ETV Bharat / health

ఈ టిప్స్​ పాటిస్తే - స్టెయిన్​లెస్​ స్టీల్​ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!

Tips to Clean Stainless Steel: స్టెయిన్​ లెస్ స్టీల్​ గృహోపకరణాలు కిచెన్ అందాన్ని మరింత మెరుగ్గా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిమీద ఏ చిన్న మరక పడ్డా వాటి లుక్​ పాడవుతుంది. కాబట్టి వాటి మెరుపు అలాగే కంటిన్యూ చేయాలంటే కొన్ని టిప్స్​ పాటించాలి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 9:53 AM IST

kitchen hacks
kitchen hacks

Tips to Clean Stainless Steel: స్టెయిన్​ లెస్​ స్టీల్​ గృహోపకరణాలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో, వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే వస్తువులను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరిగ్గా శుభ్రం చేయకుండా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో వాటిని క్లీన్​ చేయడమే కాకుండా కొత్తవాటిలా మెరిపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఈ స్టోరీలో చూద్దాం.

డిష్ సోప్‌: రోజువారీ ఉపయోగించే వంటపాత్రలే కాకుండా కొన్ని గృహోపకరణాలపై (రిఫ్రిజిరేటర్స్​, ఓవెన్​) మరకలు శుభ్రం చేసేందుకు కూడా ఓ పద్ధతి ఉంది. దీని ప్రకారం ముందుగా చల్లని నీళ్లతో వాటిపై ఎలాంటి మరకలు లేకుండా ఓ క్లాత్​ సాయంతో పైపైన తుడవాలి.​ తర్వాత మెత్తని స్పాంజ్‌తో గోరువెచ్చని నీళ్లలో కలిపిన డిష్​ సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రంగా తడి లేకుండా తుడిచి కాసేపు ఆరబెట్టాలి.

గ్లాస్ క్లీనర్‌: ఇక డిష్​సోప్​తో మరకలు పోకపోతే అందుకోసం గ్లాస్​ క్లీనర్​ను యూజ్​ చేయవచ్చు. ముందుగా మైక్రోఫైబర్​ క్లాత్​పై ఈ లిక్విడ్​ను స్పే చేసి మరకలపై రుద్దాలి. తర్వాత వేరే తడి క్లాత్​ తీసుకుని తుడిచిన తర్వాత, మరో క్లాత్​తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.

వైట్ వెనిగర్‌ : స్టెయిన్​ లెస్​ స్టీల్​ పాత్రలను క్లీన్​ చేయడానికి వెనిగర్​ బెస్ట్​ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు. ఇందుకోసం మైక్రోఫైబర్ క్లాత్‌పై కొద్దిగా డిస్టిల్డ్ వైట్ వెనిగర్‌ను స్ప్రే చేసి మరకలపై రుద్దాలి. తర్వాత వేరే తడి క్లాత్​ తీసుకుని తుడిచిన తర్వాత, మరో క్లాత్​తో తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ పద్ధతి ముఖ్యంగా ధూళి, ఫింగర్​ప్రింట్స్​ను తొలగించడంలో సాయపడుతుంది. అయితే ఇతర క్లీనర్ల కంటే వెనిగర్​లో కొంచెం ఎక్కువ ఆమ్లం ఉంటుంది. కాబట్టి మీరు దానిని గృహోపకరణాలపై ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ క్లీనర్‌: పైన చెప్పిన టిప్స్​ పాటించి ఈ గృహోపకరణాలను క్లీన్​ చేసినా జిడ్డు, మరకలు పోకపోతే ఇక చివరగా మార్కెట్లో స్టెయిన్​ లెస్​ స్టీల్​ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లీనర్​ను యూజ్​ చేసి ఎంత మొండి మరకలనైనా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం మైక్రోఫైబర్​ క్లాత్​పై కొద్దిగా క్లీనర్‌పై స్ర్పే చేసి క్లీన్​ చేయాలి.

వంట గదిలో వాస్తు - ఈ టిప్స్​ పాటించకపోతే ఇబ్బందే!

స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఎలా పోలిష్ చేయాలి: కాగా స్టెయిన్​ లెస్​ స్టీల్​లు కొత్తవాటిలా మెరవాలంటే పోలిష్​ చేయాలి. పైన చెప్పినా చిట్కాలన్నీ మరకలను పొగొట్టడానికి ఉపయోగపడతాయి కానీ, వాటిని మునుపటిలా కొత్తవాటిలా మార్చలేవు. కాబట్టి క్లీన్​ చేసిన తర్వాత పోలిష్​ చేయడం వల్ల వాటి మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉండడమే కాకుండా మంచి లుక్‌ని కూడా అందిస్తాయి.

ఆలివ్ ఆయిల్‌: స్టెయిన్​ లెస్​ స్టీల్​ వస్తువులను కొత్తవాటిలా మెరిపించడంలో ఆలివ్​ ఆయిల్​ ఎఫెక్టివ్​గా పని చేస్తుంది. అందుకోసం ఓ క్లాత్​ తీసుకుని దానిపై ఈ ఆయిల్​​ వేసి శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల అవి కొత్త వాటిలా మెరుస్తాయి.

క్లబ్ సోడా: ఇది కూడా గృహోపకరణాలను మెరిపించడంలో ఉపయోగపడుతుంది. అందుకు కొంచెం క్లబ్ సోడా తీసుకుని దానిని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఆపై ఏదైనా స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలంపై చల్లి మెత్తని వస్త్రంతో దాన్ని శుభ్రం చేస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది.

స్టెయిన్‌లెస్ స్టీల్‌ ఎప్పుడు శుభ్రం చేయాలి? : స్టెయిన్​ లెస్​ స్టీల్​ పరికరాలను శుభ్రం చేయడానికి కచ్చితమైన సమయం అంటూ ఏం లేదు. అది మీ శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే రోజువారి ఉపయోగించే గిన్నెలు, స్టవ్​లు డిష్​సోప్​తో రెగ్యులర్​గా క్లీన్​ చేయాలి. అలాగే రిఫ్రిజిరేటర్ వంటి పెద్ద గృహోపకరణాలు వారంలో రెండు సార్లు క్లీన్​ చేయడం మంచిది.

స్టెయిన్‌లెస్ స్టీల్‌ క్లీనింగ్​ విషయంలో ఈ తప్పులు చేయొద్దు:

  • ఒకవేళ స్టీల్‌పాత్రలపై ఏవైనా పదార్థాలు గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే వాటిని తొలగించేందుకు స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ను ఉపయోగించకూడదు. ఎందుకుంటే వీటిని యూజ్​ చేయడం వల్ల పాత్రలపై గీతలు పడటమే కాకుండా, తుప్పు పట్టే అవకాశాన్ని పెంచుతాయి. కాబట్టి వీటి బదులుగా నైలాన్ స్క్రబ్‌ని మాత్రమే ఉపయోగించాలి.
  • స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపకరణాల క్లీనింగ్​ కోసం బ్లీచ్ లేదా స్ట్రాంగ్ క్లీనింగ్ సొల్యూషన్స్ ఉపయోగించకపోవడమే మంచిది. ఇవి వాటి నాణ్యతను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా మురికిగా ఉన్న స్పాంజ్​లను కూడా ఉపయోగించకూడదు.

చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

మీ వంటగ్యాస్ త్వరగా అయిపోతోందా? - ఈ టిప్స్​తో నెల వచ్చేది 2 నెలలు రావడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.