ETV Bharat / health

మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? - ఇలా చేశారంటే వారిలో మార్పు రావడం గ్యారెంటీ! - Parenting Tips - PARENTING TIPS

Parenting Tips : కొద్దిమంది పిల్లలు ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తిస్తారు. అలాంటి పిల్లలను.. కంట్రోల్ చేయడంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మీ పిల్లలు అలాగే ప్రవరిస్తున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నిపుణులు సూచించిన ఈ టిప్స్ ఫాలో అయి చూడండి. వారిలో మార్పు గ్యారెంటీ! అవేంటంటే?

Childrens
Parenting Tips
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 6:59 PM IST

Parenting Tips to Change Rude Behaviour in Childrens : కొంతమంది పిల్లలు చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా తమకు నచ్చినట్లుగా జరగకపోతే పేరేంట్స్​తో అయినా, ఇంకెవరితో అయినా మొరటుగా ప్రవర్తిస్తారు. కఠినమైన పదజాలంతో దూషించడం లేదా వస్తువులను విసిరేయడం, అవతలి వ్యక్తులపై దాడులు చేయటం వంటివి చేస్తారు. ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వారి వైఖరి మాత్రం మారదు. రాను రాను మారుతున్న పిల్లల వైఖరితో ఒక్కోసారి తల్లిదండ్రులు(Parents) కూడా సహనం కోల్పోయి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు.

వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం కొట్టడం లాంటివి కూడా చేస్తారు. అయినా పిల్లల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాదు. ఇంకా ఇలా చేయడం వల్ల పిల్లల ప్రవర్తన మరింత దిగజారుతుంది తప్ప, వారి వైఖరిలో మార్పు కనిపించదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే నో టెన్షన్​. మొండిగా ప్రవర్తించే పిల్లల వైఖరిని మార్చడమే కాకుండా వారిని సరైన దారిలో నడిపించడానికి నిపుణులు కొన్ని సలహాలను సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరైన కారణాన్ని గుర్తించండి : పిల్లలు మొండిగా ప్రవర్తించడానికి కారణం.. చాలా సందర్భాల్లో వారు తమలోని కొన్ని భావోద్వేగాలను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడమే. దీంతో వారికి తమ బాధ ఎలా వ్యక్తపరచాలో తెలియక మొండి పిల్లలుగా ప్రవర్తిస్తారు. అటువంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారిని లోతుగా పరిశోధించాలి. వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సరైన కారణాన్ని కనుగొని అందులో నుంచి పిల్లలను బయట పడేలా చూడాలి.

మంచి మాటలు నేర్పించడం : పిల్లలు వారి తోబుట్టువులు లేదా వారి తల్లిదండ్రులతో మొరటుగా మాట్లాడుతూ ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు వారు ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పదజాలం ఉపయోగించాలి అనే విషయాలను వారికి నేర్పించాలి. ఏ రకంగా మాట్లాడితే వారు అనుకున్నది నెరవేరుతుందో తెలియజెప్పాలి. ఇది వారి భావోద్వేగాలను సరిగా కమ్యూనికేట్​ చేయడానికి, తమను తాము మార్చుకోడానికి సహాయపడుతుంది. ఇతరుల పట్ల జాలి, దయ కూడా నేర్పుతుంది.

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

మాట్లాడే భాషను ప్రాక్టీస్ చేయించడం : మీరు వారికి నేర్పించిన పదాలను వాడుతూ ఎలా తమ భావాన్ని వ్యక్తీకరించాలో ప్రాక్టీస్ చేయించాలి. మునుపటి ప్రవర్తన కాకుండా అదే అవసరానికి ఇంకోలా అడిగితే ఎలా ఉంటుందో చూడమని వారికి తెలియజెప్పాలి. ఈ ప్రాక్టీస్ వారికి వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, వారు ఎవరితో అయినా మరింత మెరుగైన మార్గంలో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. వారిలో మరింత నమ్మకం కలిగిస్తుంది.

ప్రోత్సహించడం, ప్రశంసించడం : పిల్లలు తమ మొండి వైఖరిని మార్చుకుంటున్న సమయంలో వారిని ప్రశంసించమని నిపుణులు అంటున్నారు. తమ ఫీలింగ్స్​, ఎమోషన్స్​ను మెరుగ్గా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకోవడం కోసం మరింత ప్రోత్సహించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇందుకోసం వారు తీసుకుంటున్న చర్యలను, ప్రయత్నాలను అభినందించమని సూచిస్తున్నారు. ఇది వారిలో మార్పు తేవడానికి చాలా ముఖ్యమైన దశలలో ఒకటని.. ఇలా అభినందిస్తూపోతే, వారు కోపంగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు కూడా, ప్రేమగా మాట్లాడతారని చెబుతున్నారు నిపుణులు.

మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.