ETV Bharat / health

మీ దాంపత్యం​ రొమాంటిక్​గా ఉండాలంటే - ఇలా చేయండి! - tips to build good relationship

Tips to Build Strong Relationship: భార్యాభర్తల బంధం​ లైఫ్​లాంగ్​ రొమాంటిక్​గా సాగిపోవాలని ఎవరు మాత్రం కోరుకోరు? కానీ.. చిన్న అపార్థాలు, విభేదాలతో పచ్చని సంసారంలో మంటలు రేపుకుంటారు. అయితే.. కొన్ని టిప్స్​ పాటిస్తే ఆ బంధం కలకాలం అన్యోన్యంగా ఉంటుందని అంటున్నారు.

Tips to Build Strong Relationship
Tips to Build Strong Relationship
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 2:06 PM IST

Tips to Build Strong Relationship : రొమాంటిక్ లైఫ్ ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ.. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది మాత్రం చాలా మందికి తెలియదు. మెజారిటీ జనానికి తెలిసిన రొమాన్స్​ మీనింగ్ కామం మాత్రమే. కానీ.. కామం (Lust) వేరు, రొమాన్స్ (Romance) వేరు! రొమాన్స్ అంటే.. ప్రేమగా మాట్లాడడం కావొచ్చు.. హగ్ చేసుకోవడం కావొచ్చు.. ఓ ముద్దు పెట్టుకోవడం కావొచ్చు.. చేతిలో చేయి వేసి దగ్గరికి తీసుకోవడం అవ్వొచ్చు. ఒకరికొకరు తినిపించుకోవడం కూడా అవ్వొచ్చు.. సరదాగా నవ్వుతూ ఉండడం కావొచ్చు.. ఇలాంటివన్నీ రొమాన్స్ కిందకే వస్తాయి. మీ లైఫ్​ కూడా ఇలాగే సాగిపోవాలంటే.. కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటో​ఈ స్టోరీలో చూద్దాం..

టైం స్పెండ్​ చేయండి: ఉద్యోగం, బాధ్యతలు, పిల్లల పెంపకం.. ఇవన్నీ ఎంత ముఖ్యమో.. భార్యాభర్తలుగా మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవడమూ అంతే ముఖ్యం. ఎంత పని ఉన్నా.. జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాల్సిందే. ఇందుకోసం రోజులో కాస్త టైమ్ పెట్టుకోండి. ఇద్దరు కూర్చుని ఆ రోజు అనుభవాలను పంచుకోండి. కలిసి డిన్నర్​ చేయడం, లేదా వాకింగ్​కు వెళ్లడం, వీకెండ్​ బయటికి వెళ్లడం వంటివి చేస్తే.. ఆటోమేటిక్​గా టైం దొరుకుతుంది. లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలన్నా.. మీ ప్రేమ ఎల్లకాలం పరిమిళించాలన్నా.. ఇది చాలా అవసరం.

ఇవి ఒంటరి తనానికి సంకేతాలు - ముదిరితే భార్యాభర్తల బంధానికి బీటలే!

సర్ప్రైజ్​ : మీ భాగస్వామిని అప్పుడప్పుడూ సర్​ప్రైజ్​ చేయండి. పార్టీ ప్లాన్‌ చేయడమో, గిఫ్ట్స్​ ఇవ్వడమో.. చెప్పకుండా నచ్చిన చోటికి తీసుకెళ్లడమో.. ఇలాంటివి చేయండి. అప్పుడు మీరు తన గురించి పట్టించుకుంటున్నారనే విషయం వారికి అర్థమవుతుంది. అది చాలా సంతోషానిస్తుంది. సర్​ప్రైజ్​ అంటే ఖరీదైన గిఫ్ట్సే కానవసరం లేదు.. వారికి తెలియకుండా వారికి నచ్చిన కర్రీ వడడం, చక్కటి గ్రీటింగ్​ కార్డ్​ ఇవ్వడం కూడా సర్​ఫ్రైజే అన్నది మరవొద్దు.

ఓపెన్ కమ్యూనికేషన్: దాంపత్యంలో ఓపెన్ కమ్యూనికేషన్​ చాలా చాలా ముఖ్యం​. మీకు, మీ భాగస్వామికి మధ్య దాపరికాలు ఉండకూడదు. మీ ఆలోచనలు, కలలు, భయాలు.. అన్నీ పంచుకోండి. సీక్రెట్స్​ లేని బంధం రాక్​ సాలిడ్​గా ఉంటుంది. కాబట్టి.. అన్ని విషయాలనూ ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చర్చించుకోండి. ఇలా ఉండడం వల్ల.. మీ భాగస్వామి మానసికంగా మీకు ఎంతో దగ్గరవుతారు. మీ బంధాన్ని విడిచి ఉండలేనంతగా కలిసిపోతారు.

చెప్పేది వినండి: మీ బంధానికి కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో.. అవతలి వారు చెప్పేది వినడం కూడా ముఖ్యమే. చాలా మంది వాళ్ల పార్టనర్​ ఏం చెబుతున్నారో వినడానికి ఇంట్రెస్ట్​ చూపరు. తనకేం తెలుసు? అంటూ.. లైట్ తీసుకుంటారు. దీనివల్ల మీరు వారిని చులకనగా చూస్తున్నారనే ఫీలింగ్ ఏర్పడుతుంది. కాబట్టి.. అలా చేయకండి. మీ భాగస్వామి ఏం చెప్పాలనుకుంటున్నారో.. శ్రద్ధగా, పూర్తిగా వినండి. దీనివల్ల.. వారు చెప్పేదానిపై మీరు ఆసక్తి చూపుతున్నారని హ్యాపీగా ఫీలవుతారు. మీ బంధాన్ని ఇది ధృడంగా మారుస్తుంది.

మీ పార్ట్​నర్​తో గొడవ పడినప్పుడు ఈ మాటలు అంటున్నారా? - అయితే విడాకులు ఖాయం!

అప్రిసియేషన్​: భార్యాభర్తల మధ్య ఇది చాలా ముఖ్యం. ఒకరిని ఒకరు ప్రశసించుకోవడం అవసరం. వారు మీ కోసం చేసే చిన్న పనిని కూడా మెచ్చుకోండి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. భార్య చేసిన కర్రీ బాగుందని చెప్పడం కావొచ్చు.. భర్త మీకు ఇంటి పనుల్లో ఏదైనా సాయం చేసినప్పుడు కావొచ్చు.. థాంక్స్ చెప్పడం వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇవి చూడ్డానికి చాలా చిన్నవికానీ.. చాలా ఎఫెక్టివ్​గా ఉంటాయి.

ఫిజికల్​ టచ్​: ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఫిజికల్​ టచ్​ కేవలం బెడ్​ రూమ్​కు మాత్రమే పరిమితం కాకూడదు. ఒక చిన్న హగ్ ద్వారా.. మనసులోని భారమంతా దిగిపోతుందని ఎన్నో పరిశోధనలు నిర్ధారించాయి. అందుకే.. మనకు నచ్చిన వారిని రోజులో కనీసం మూడ్నాలుగు సార్లు కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు చేతులు పట్టుకోవడం, ఆఫీసుకు వెళ్లేముందు ప్రేమగా ముద్దుపెట్టుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత ఓ హగ్​.. ఇవన్నీ ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతో ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి.

ఒక్కోసారి మాటల్లో చెప్పలేని అనుభూతిని.. ఇలా చేతల ద్వారా చూపించొచ్చు. ఇవన్నీ మీ దాంపత్య బంధాన్ని సాలిడ్​గా మార్చేవే. సో.. ఏం చేయాలో అర్థమైంది కదా! మీరు ఇప్పటికే.. ఇవి చేస్తుంటే మరింత ఎఫెక్టివ్​గా చేయండి. ఒకవేళ మీరు ఇలాంటివి చేయట్లేదంటే.. ఈ రోజునుంచే మొదలు పెట్టండి. కాదు.. కాదు.. ఇప్పట్నుంచే స్టార్ట్ చేయండి. లేచి వెళ్లండి మీ పార్ట్​నర్​ దగ్గరికి!

మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!

ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోతున్నది.. ఈ 7 కారణాలతోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.