ETV Bharat / health

ఇంట్లో బొద్దింకల స్ప్రే వాడితే మనకు డేంజర్ - ఈ నేచురల్​ టిప్స్​ పాటిస్తే ఒక్కటి కూడా ఉండదు! - How to Get Rid of Cockroaches - HOW TO GET RID OF COCKROACHES

Tips To Avoid Cockroaches At Home : మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా? వాటిని తరిమికొట్టడానికి ఎన్ని రకాల స్ప్రేలు ఉపయోగించినా ఫలితం లేదా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే! కొన్ని సింపుల్‌ టిప్స్​తో బొద్దింకలను ఇంటిని తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Cockroaches
Tips To Avoid Cockroaches At Home (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 2:05 PM IST

Tips To Avoid Cockroaches At Home : అపరిశుభ్రంగా ఉండే కిచెన్‌లో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉదయం పూట ఎక్కడ దాక్కుంటాయో గానీ, రాత్రి పూట కిచెన్​పై దండయాత్ర చేస్తాయి. వీటివల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొందరు బొద్దింకల బెడదను వదిలించుకోవడానికి మార్కెట్‌లో దొరికే వివిధ రకాల స్ప్రేలను తీసుకొచ్చి పిచికారీ చేస్తుంటారు. దీనిలో ఉండే కెమికల్స్‌ వల్ల మనకు హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. బొద్దింకలను తరిమికొట్టడానికి కొన్ని టిప్స్‌ సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బొద్దింకల బెడదని తగ్గించే చిట్కాలు :

  • తరచుగా ఉపయోగించని, తేమ ఎక్కువగా ఉండే కప్‌బోర్డులు, సింకుల కింద బొద్దింకలు ఉంటాయి. కాబట్టి, ఈ ప్రదేశాలను క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి.
  • బొద్దింకలు ఎక్కువగా ఉన్నచోట బిర్యానీ ఆకులను పొడి చేసి చల్లండి. అలాగే ఎక్కువగా శుభ్రం చేయని ప్రదేశాలు, మూలల్లో ఈ బిర్యానీ ఆకు పొడి చల్లడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • బొద్దింకలు ఉండేచోట పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌, లెమన్‌గ్రాస్‌ ఆయిల్‌ను చల్లితే ఒక్కటి కూడా ఉండదు.
  • ప్రతి వంటింట్లో బేకింగ్‌ సోడా, చక్కెర ఉంటాయి. అయితే, ఇవి బొద్దింకలను తరిమికొడతాయని మీకు తెలుసా బేకింగ్‌ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు ఉన్న చోట చల్లితే అవి తిని చనిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
  • మనలో చాలామంది బియ్యంలో పురుగులు రాకుండా కలపడానికి, అలాగే క్యారమ్స్ ఆడుకోవడానికి ఎక్కువగా బోరిక్‌ పౌడర్‌ వాడుతారు. అయితే ఈ పౌడర్‌ను బొద్దింకలు సంచరించే చోట చల్లితే అవి పారిపోతాయి.
  • ఒక స్ప్రే బాటిల్‌లో సమాన భాగంలో నీటిని, వెనిగర్‌ను కలపండి. తర్వాత ఈ స్ప్రేను బొద్దింకలు ఉండే ప్లేస్‌లలో చల్లండి. ఇలా చేస్తే ఒక్క బొద్దింక కూడా బతకదని నిపుణులు చెబుతున్నారు.
  • బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో లవంగాలను పెట్టండి. వీటి వాసన బొద్దింకలకు అసలు పడుదు. దీంతో అవి పారిపోతాయి.
  • వేపాకులను గ్రైండ్‌ చేసి ఆ నీళ్లను ఒక బాటిల్‌ స్పే బాటిల్‌లో పోసుకోండి. బొద్దింకలు ఉన్నచోట ఈ స్ప్రే చేయడం వల్ల అవి నశిస్తాయి.
  • బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తున్న ప్రదేశాల్లో హెయిర్‌ స్ప్రేను కొట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా చనిపోతాయి.
  • ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిని కలిపి పేస్ట్‌లాగా రెడీ చేయండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే చోట పెట్టడం వల్ల అవి పారిపోతాయి.
  • అలాగే.. కిరోసిన్‌ ఆయిల్‌ను బొద్దింకలు ఉండే మూలల్లో స్ప్రే చేయడం వల్ల అవి పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా! - Best Oils for Double Hair Growth

వెన్నునొప్పి ఇబ్బంది పెడుతోందా? ఇంట్లోనే చేసుకునే ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో బిగ్​ రిలీఫ్! - Exercises For Back And Spinal Cord

ఎంతటి మొటిమలైనా ఈ టిప్స్​ పాటిస్తే క్లియర్​​! మీరూ ట్రై చేస్తారా? - Tips to Prevent Acne Problems

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.