ETV Bharat / health

మెడ చూట్టూ ముడతలు, సన్నని గీతలు వచ్చాయా? తగ్గించుకోండిలా! - Tips For Reducing Neck Wrinkles - TIPS FOR REDUCING NECK WRINKLES

Tips For Reducing Neck Wrinkles : మీ మెడ చూట్టూ ముడతలు, సన్నని గీతలు వచ్చాయా? మెడపై ముడతలు మీ వయసును మరింత పెంచి చూపిస్తున్నాయా? వీటిని తగ్గించుకునే మార్గాలు ఏంటో చూద్దాం.

Tips For Reducing Neck Wrinkles
Tips For Reducing Neck Wrinkles
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 9:46 AM IST

Tips For Reducing Neck Wrinkles : ఎల్లపుడూ యవ్వనంగా కనిపించాలనుకునే చాలా మంది ఎదుర్కునే సమస్య మెడపై ముడతలు, సన్నని గీతలు. వయసు పెరిగే కొద్దీ చర్మం స్థితిస్థాపకతను కోల్పోయి, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి వదులుగా మారుతుంది. ఫలితంగా సన్నని గీతలు ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. వీటితో పాటు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు ఎక్కువ సేపు చూడటం, సూర్య రష్మి, మద్యం, ఊబకాయం, ధూమపానం వంటి ఇతర కారణాల వల్ల కూడా మెడపై ముడతలు ఏర్పడతాయి. మహిళలు, సౌందర్య ప్రియులకు ఇది ఆందోళన కలిగించే సమస్య అనే చెప్పుకోవచ్చు. వీటిని తగ్గించకోవడం ఎలా ఆలోచిస్తున్నవారికి ఇదిగో ఇవే చక్కడి మార్గాలు!

సూర్య రష్మి
చర్మం యవ్వనంగా కనిపించడానికి సూర్య రష్మి బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మెడపై ముడతలు, సన్నని గీతలు రాకుండా ఉండాలంటే మీరు సన్ ప్రొటెక్షన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సూర్యుని నుంచి విడుదలయ్యే హానికరమైన కిరణాల కారణంగా చర్మంపై ఏర్పడతాయి. కాబట్టి మీరు సన్ స్క్రీన్ లోషన్లు ఎల్లప్పుడూ రాసుకోవడం మంచిది. ఇవి యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడతాయి. వీటితో పాటు బయటకు వెళ్లినప్పుడు నేరుగా మెడపై ఎండ పడకుండా టోపీ, స్కార్ఫ్, మెడను దాచేసే దుస్తులను ధరించాలి.

మాయిశ్చరైజేషన్
చర్మాన్ని బాగా తేమగా ఉంచడం వల్ల స్థితిస్థాపకతను కాపాడుకోవచ్చు. మెడపై ముడతలు తగ్గడానికి మీ చర్మం హైడ్రేటెడ్​గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా మెడ చుట్టూ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. ఇది మీ చర్మానికి పోషణనిచ్చి చర్మాకృతిని యవ్వనంగా మార్చుతుది. ముఖ్యంగా హైలురోనిక్ యాసిడ్, సిరమైడ్, పెప్టైడ్స్, విటమిన్-సీ కలిగిన క్రీములు మీ చర్మన్ని మృదువుగా మార్చేందుకు బాగా సహాయపడతాయి.

రెటినోల్స్
రెటినోల్ ఉత్పత్తులు యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్-ఏ డెరివేటివ్ కొల్లాజెన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. వీటితో పాటు రేడియో ఫ్రీక్వెన్సీతో మెక్రోనెడ్లింగ్ చికిత్స కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

ధూమపానం
2013లో జరిపిన అధ్యయనాల ప్రకారం, ధూమపానం అకాల వృద్ధాప్యానికి ముఖ్య కారణమవుతుంది. పొగాకు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఇందులోని నికోటిన్ ఆక్సిజన్ సరఫరాకు అడ్డుకట్ట వేస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం దెబ్బతిని ముడతలు సన్నని గీతలు ఎక్కువ ఏర్పడతాయి.

మెడ భంగిమ
మనలో చాలా మంది శరీర భంగిమకు ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోతున్నాం. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్, ల్యాప్ ట్యాప్ లతో పనిచేసేవారు మెడను వంచి ఉంచడం కూడా మెడపై ముడతలను కారణమవుతుంది. మెడను సరైన భంగిమలో ఉంచకపోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి శాశ్వతమైన ముడతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించాలంటే మీరు మెడ భంగిమ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే స్క్రీన్ టైమ్​ను కాస్త తగ్గించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో చర్మాన్ని బిగుతుగా ఉండేందుకు సహాయపడే ఆహార పదార్థాలను మీ డైట్​లో చేర్చుకోవడం వల్ల మెడపై వచ్చే ముడతలు, గీతలను త్వరగా అరకట్టగలుగుతారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కలవరపెడుతున్న ఆటిజం సమస్య! మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్​ చేయండి! - How To Indentify Autism In Children

డాక్టర్​ వద్దకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి - మొత్తం తేడా కొట్టేస్తుంది! - TIPS BEFORE MEDICAL CHECK UP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.