Tips For Honey Using On Face: మెరుగైన చర్మం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల చర్మ ఉత్పత్తులు త్వరగా ఫలితాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా అవి చర్మ ఆరోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి ఈ మధ్య చాలా మంది హోంమేడ్ (Homa Made) ఫేస్ ప్యాక్స్ వేసుకుంటున్నారు. ఇంట్లోనే సులువుగా దొరికే పదార్థాలు చర్మంపై ఫలితాలు ఆలస్యంగా చూపించినప్పటికీ వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలా మీవంటగదిలో ఎప్పుడూ ఉండే తేనె మీ చర్మానికి ఎంతో మేలు చేస్తోంది.
తేనెలో యాంటీమైక్రోబయోల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. స్థిరంగా, సరిగ్గా ఉపయోగించడం వల్ల తేనె మీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని చర్మారోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంలోని సహజ సూక్ష్మజీవులను నాశనం చేయకుండా స్కిన్ ను కాపాడటంలో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి పోషణ అందించడానికి, గాయలను నయం చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి కూడా హనీ హెల్ప్ చేస్తుంది.
చర్మంపై తేనెను పూసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ ఎడ్స్, గాయాలు నయం కావడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందల్లా చర్మంపై తేనెను ఎలా ఉపయోగించాలా అని. సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ఏ పదార్థమైనా మంచి కంటే ఎక్కువ హాని చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హనీని నేరుగా స్కిన్ పై ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. ముఖానికి తేనెను ఎలా ఉపయోగించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
1. హనీ ఫేస్ క్లీన్సర్
మొటిమల సమస్య ఉన్నవారు తేనెను ఫేస్ వాష్ రూపంలో ఉపయోగించడం మంచిది. మీరెగ్యులర్ ఫేస్ వాష్ లో ఒక టీస్పూన్ తేనెను కలిపి వాడటం వల్ల చర్మంలోని మురికి, దుమ్ము లాంటి మలినాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
2. హనీ లోషన్:
పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్న వారు తేనె కలిగి ఉన్న బాడీ లోషన్‌ను తీసుకోవడం మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆర్గనిక్ తేనెతో తరచుగా ముఖంపూ మసాజ్ చేయడం వల్ల చర్మానికి అవసరమైన తేమ అందటంతో పాటు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
3. హనీ ఫేస్ ఆయిల్:
సహజమైన ఫేస్ ఆయిల్లు నేచురల్ యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని, చర్మం రంగును పెంచడంలో సహాయపడతాయి. మీ ఫేస్ ఆయిల్లో కొన్ని చుక్కల తేనెను కలపడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. మచ్చలు, ముడతలు తొలగిపోతాయి.
4. హనీ ఫేస్ ప్యాక్స్
- అరటిపండు, రోజ్ వాటర్, తేనె
- దాల్చిన చెక్క, బొప్పాయి, తేనె
- తేనె, దోసకాయ, కలబంద
- శనగపిండి, వేపాకు, తేనె
ఇలా తేనెతో రకరకాల ఫేస్ ప్యాకులు తరచుగా వేసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా కాంతివంతంగా మారి మీరు ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా కనిపిస్తారు.
ముఖ్య గమనిక: ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ముడి తేనెతో మెరుగైన ఆరోగ్యం- దీర్ఘకాలిక వ్యాధులు దూరం! కానీ ఆ విషయంలో జాగ్రత్త!!.
Health Benefits Of Honey : 'తేనె'తో ఎన్నో లాభాలు.. చిన్న పిల్లలు, షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవచ్చా?