ETV Bharat / health

కనురెప్పలు బాగా పెరగాలా? కలబంద, కొబ్బరిపాలతో ఇలా చేస్తే చాలు! - Tips For Eyelashes Growth - TIPS FOR EYELASHES GROWTH

Tips For Eyelashes Growth : మీ కనురెప్పలు చాలా చిన్నగా, సన్నగా ఉన్నాయని బాధపడుతున్నారా? అందమైన పొడవైన ఐల్యాష్ కావాలా? అయితే ఇంట్లోనే ఇలా చేయండి!

Tips For Eyelashes Growth
Tips For Eyelashes Growth
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 7:23 AM IST

Tips For Eyelashes Growth : పెద్ద పెద్ద కళ్లు, చంద్రవంక లాంటి కనుబొమ్మలు, పొడవుగా, చిక్కగా ఉండే కనురెప్పలు! అందంగా కనపడాలంటే ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? కానీ చాలా మందికి కనురెప్పలు సన్నగా, చిన్నగా ఉంటాయి. ఐల్యాష్ చిన్నగా ఉండటం వల్ల కళ్లు అంత అందంగా కనపడవు. వాటిని పెంచుకునేందుకు చాలా రకాల క్రీములు కూడా తెచ్చుకుని వాడేవారు ఉన్నవారు. క్రీములకు భయపడి ఆర్టిఫీషియల్ ఐల్యాష్ లు పెట్టుకుని తిరిగే వారు కూడా లేకపోలేరు. అయితే ఈ రెండింటి అవసరం లేకుండా కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే కను రెప్పలను పొడవుగా, ఒత్తుగా పెంచుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందామా!

అలోవెరా
మీ పెరట్లో ఎప్పుడూ ఉండే కలబందను కాస్త కత్తిరించి దాంట్లోని గుజ్జును కనురెప్పలకు రాసుకోవాలి. ఈ గుజ్జులో పుష్కలంగా ఉండే ఖనిజాలు, విటమిన్లు మీ కనురెప్పలు బలంగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. కాకపోతే ఈ గుజ్జు నేరుగా కంట్లోకి వెళ్లకుండా చూసుకోండి.

ఆలివ్ నూనె
మీరు నిద్రపోయే ముందు స్వచ్ఛమైన ఆలివ్ నూనెతో కంటి రెప్పలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ కనురెప్పలకు మంచి పోషణనిచ్చి పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా కడుక్కోవడం మాత్రం మర్చిపోకండి.

కొబ్బరిపాలు
కొంచెం కాటన్​ను ఉండగా చేసి కొబ్బరిపాలలో కాసేపు నానబెట్టండి. తరువాత వాటిని కంటిపై పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కొబ్బరిపాలలో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు కనురెప్పల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

చమోమిలే టీ
చమోమిలే టీని తయారు చేసి అది చల్లారే వరకూ ఆగండి. తర్వాత కాటన్ ప్యాడ్ సహాయంతో కనురెప్పలకు దాన్ని అప్లై చేయండి. ఇది మీ కంటి నరాల ఒత్తిడిని తగ్గించి కనురెప్పల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

విటమిన్-ఈ క్యాప్సుల్స్
విటమిన్-ఈ ట్యాబ్లెట్లలో లభించే నూనె వెంట్రుకల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. దీన్ని కనురెప్పలకు రాసుకోవడం వల్ల అవి పొడవుగా, మందంగా పెరిగేలా చేస్తాయి.

ఉల్లిపాయ రసం+ఆముదం నూనె
ఉల్లిపాయ రసాన్ని, ఆముదం నూనెను సమానంగా తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. వీటి కలయిక వెంట్రుకల పెరుగుదలకు మంచి ఔషధంగా చెప్పవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ కనురెప్పలకు రాసి 30నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది కనుక ఆ రసం కంట్లోకి పోకుండా జాగ్రత్తగా ఉండండి.

నిమ్మకాయ తొక్క+ ఆలివ్ నూనె
నిమ్మకాయ తొక్కలను తీసుకుని ఆలివ్ నూనెలో నానబెట్టండి. ఒక పావు గంట పాటు వాటిని అలాగే ఉంచిన తర్వాత ఈ మిశ్రమాన్ని కను రెప్పలకు రాయండి. నిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రెప్పల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి.

వీటిని అప్పడప్పుడు కూడా మాత్రమే కాకుండా తరచుగా కనురెప్పలకు రాసుకోవడం వల్ల మీ కను రెప్పలు పొడవుగా, మందంగా పెరుగుతాయి. అలాగే మీ రోజూవారీ ఆహారంలో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-ఈ, బయోటిన్​లు అధికంగా ఉండేలా చూసుకోండి. వీటితో పాటు ఓమేగా-3ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మొత్తం వెంట్రుకల ఆరోగ్యం మెరుగవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.