Tips For Dark Underarms : చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్ అండర్ ఆర్మ్స్ ఒకటి. నిజానికి ఇది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ.. అమ్మాయిలు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. మోడ్రన్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లు వేసుకోవాలని కోరుకునేవారు.. ఈ సమస్య కారణంగా వాటిని ధరించలేకపోతుంటారు. మరి.. ఇలా చంకల్లో నల్ల రంగు రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ టిప్స్ పాటించండి!
- చంకలు నల్లగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఊబకాయం ఒకటని నిపుణులు చెబుతున్నారు.
- ఎత్తుకు అనుగుణంగా కాకుండా.. ఎక్కువగా బరువు ఉంటే కూడా అండర్ ఆర్మ్స్ నల్ల రంగులో ఉంటాయని నిపుణులంటున్నారు.
- కాబట్టి, అధిక బరువుతో బాధపడేవారు వెయిట్ లాస్ అయ్యేలా వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
- అలాగే కొంత మంది షేవింగ్ చేసుకున్న తర్వాత దురద సమస్యతో బాధపడతారు. కాబట్టి, చంకల్లో హెయిర్‌ను తొలగించుకోవడానికి వాక్సింగ్ లేదా ఇతర హెయిర్ రిమూవల్ పద్ధతులను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
- చంకల నుంచి దుర్వాసన రాకుండా ఉండటానికి ఉపయోగించే యాంటిపెర్స్పిరెంట్స్, డియోడరెంట్లు చర్మాన్ని ఇబ్బందిపెట్టే ఛాన్స్ ఉంది. ఫలితంగా అక్కడ చర్మం నల్లగా మారేలా చేస్తాయట.
- కాబట్టి.. ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలని.. కెమికల్స్ లేని డియోడరెంట్స్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.
- రోజూ స్నానం చేసిన తర్వాత చంకల్లో తడి ఉండకుండా పొడి వస్త్రంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
- కాఫీ, కారం ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల చంకల్లో ఎక్కువగా చెమట పడుతుందట.
- దీనివల్ల ఆ ప్రాంతం అంతా నల్లగా మారుతుందని నిపుణులంటున్నారు. కాబట్టి, వీలైనంత వరకు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
- టైట్‌గా ఉండే డ్రెస్‌లు వేసుకోవడం వల్ల చర్మం రాపిడికి గురవుతుంది. దీనివల్ల కూడా ఆ ప్రాంతం బ్లాక్ కలర్‌లోకి మారుతుందట. కాబట్టి కాస్త వదులుగా ఉండే దుస్తులను ధరించండి.
- విటమిన్ సి, నియాసినామైడ్ వంటి పదార్ధాలు ఉండే క్రీమ్‌లు, సీరమ్‌లను ఉపయోగించడం వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్‌ను తగ్గించవచ్చట.
- స్నానం చేసేటప్పుడు బేకింగ్ సోడా లేదా యాపిల్ సైడర్ వెనిగర్‌తో చంకలను క్లీన్ చేసుకోవడం వల్ల నలుపు రంగు తొలగిపోతుందట.
- వాటర్‌లో బంగాళదుంప ముక్కలను కట్‌చేసి ఒక రెండు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలతో చంకల్లో నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దండి.
- ఇలా తరచూ చేయడం ద్వారా.. బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ నలుపు రంగును తొలగిస్తాయని చెబుతున్నారు.
ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు - మీ కిడ్నీలు పది కాలాల పాటు సేఫ్!
మీ చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంగా ఉన్నాయా? - ఇవి పాటించకుంటే అంతే!
పిల్లల్లో స్థూలకాయం తగ్గాలా? అందుకోసం పెద్దలు చేయాల్సిన పనులివే!