ETV Bharat / health

మీ వయసు 30 దాటుతోందా? - మీ బాడీలో ఈ విటమిన్స్ తగ్గిపోతే అంతే! - Vitamins for Mens after 30 Years

Must Required Vitamins for Mens after 30 Years : వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలోనూ మార్పులు కామన్. 30 ఏళ్లు దాటాక శరీరం చిన్నచిన్నగా బలహీనమవడం మొదలవుతుంది. కాబట్టి.. కొన్ని విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో కలిగి ఉండడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అవేంటంటే?

HEALTH TIPS FOR MEN
Vitamins
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 12:36 PM IST

These Vitamins Must Required Every Man after 30 Years : పురుషులు 30 ఏళ్ల తర్వాత కూడా ఫిట్​గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇప్పుడు చెప్పబోయే విటమిన్లు(Vitamins), ఖనిజాలు శరీరానికి తగిన మొత్తంలో అందేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విటమిన్ D : 30 ఏళ్ల తర్వాత పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు క్షీణించడం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఎనర్జీ లెవల్స్, మజిల్ పవర్​పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి టైమ్​లో 'విటమిన్ డి' చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి, గుండె జబ్బుల నివారణకు చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ B12 : 30 ఏళ్లు దాటాక ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను, బలమైన నాడీ వ్యవస్థను మెయిన్​టెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం విటమిన్ B12 చాలా కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది. దీనిని సహజంగా జంతు ఉత్పత్తుల నుంచి పొందవచ్చు. అయితే, శాకాహారులకు మాత్రం తగినంత విటమిన్ B12 కోసం బలవర్ధకమైన ఆహారాలు, సప్లిమెంట్స్ అవసరం కావొచ్చంటున్నారు నిపుణులు.

2013లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ"లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత విటమిన్ B12 స్థాయిలు తక్కువగా ఉన్న పురుషులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్​కు చెందిన ప్రముఖ డాక్టర్. ఎక్స్. యు. జాంగ్ పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత విటమిన్ B12 తగిన మొత్తంలో లేకుండా గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు.

విటమిన్ B6 : పురుషులు 30 ఏళ్ల తర్వాత తగినమొత్తంలో తప్పక కలిగి ఉండాల్సిన మరో విటమిన్.. B6. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చేపలు, పౌల్ట్రీ, కొన్ని రకాల ధాన్యాలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటి వాటిలో ఎక్కవగా లభిస్తుందని చెబుతున్నారు.

వృద్ధాప్యం శాపం కావొద్దంటే - 30 ఏళ్లు దాటిన వారు ఇవి తినొద్దు!

విటమిన్ K : ఈ విటమిన్​ను కూడా 30 సంవత్సరాల తర్వాత పురుషులు తప్పనిసరిగా కావాల్సిన మొత్తంలో కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తం గడ్డకట్టడం, ఎముకల ఆరోగ్యానికి చాలా కీలకం. అలాగే మెదడు పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు, కొన్ని రకాల నూనెలలో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

విటమిన్ A : దృష్టి, చర్మం, రోగనిరోధకవ్యవస్థ పనితీరు అన్ని విటమిన్ A పై ఆధారపడతాయి. ముఖ్యంగా, ఇది పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అంటే.. స్పెర్మ్ ఉత్పత్తి, ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి పురుషులు 30 ఏళ్ల తర్వాత ఈ విటమిన్​ను కావాల్సినంత కలిగి ఉండడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. క్యారెట్లు, చిలగడదుంపలు, పాల ఉత్పత్తులలో ఇది అధికంగా లభిస్తుందంటున్నారు నిపుణులు.

ఒమేగా-3 : 30 ఏళ్ల తర్వాత పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగినంత మొత్తంలో కలిగి ఉండడం చాలా అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి గుండె, మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మెగ్నీషియం : గుండె, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి, 30 ఏళ్ల తర్వాత పురుషులు ఈ ఖనిజాన్ని తగిన మొత్తంలో కలిగి ఉండడం చాలా అవసరమని సూచిస్తున్నారు నిపుణులు.

వీటితో పాటు జింక్, ఫోలేట్, ఐరన్ వంటి ఖనిజాలను 30 ఏళ్ల తర్వాత మగవారు తగినంత స్థాయిలో కలిగి ఉండడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ ఫుడ్స్ తీసుకుంటే - మీ రోగనిరోధక శక్తి ఓ రేంజ్​లో పెరగడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.