ETV Bharat / health

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ ఆయిల్స్​ ట్రై చేసే మెరుపు గ్యారంటీ! - what oils uses for glowing skin

Oils for Glowing Skin: యంగ్​గా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఆయిల్స్​ హెల్ప్​ చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Oils for Glowing Skin
Oils for Glowing Skin
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 12:39 PM IST

Best Oils for Natural Glowing Skin: చర్మాన్ని రక్షించడంలో కొన్ని ఆయిల్స్ బాగా పనిచేస్తాయి. అయితే ఫేస్​కు ఆయిల్‌ రాయాలంటే.. చాలా మంది ఆందోళన చెందుతారు. ఎందుకంటే నూనె రాస్తే ముఖం జిడ్డుగా మారుతుందని, నల్లగా అవుతుందని, చర్మ సమస్యలు ఎక్కువవుతాయని, అందం దెబ్బతింటుందని టెన్షన్​ పడుతుంటారు. కానీ, చర్మాన్ని రక్షించడానికి, అందాన్ని రెట్టింపు చేయడానికి, ఏజింగ్‌ ప్రక్రియను తగ్గించడానికి నూనెలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇవి చర్మానికి పోషణ అందించి లోలోపలి నుంచి చర్మానికి మెరుపును అందిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమై స్కిన్ యవ్వనంగా మారి మెరిసిపోతుంది. మరి మీ అందాన్ని సంరక్షించే.. నేచురల్‌ ఆయిల్స్‌ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆల్మండ్​ ఆయిల్​: బాదం నూనెలో విటమిన్ ఎ, విటమిన్​ ఇ , విటమిన్ డి, జింక్‌, ప్రొటీన్లు, పొటాషియం ఉంటాయి. ఈ నూనె నేచురల్‌ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. అలాగే ఎండ వల్ల కమిలిన చర్మాన్ని నార్మల్‌ చేస్తుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా మాయమవుతాయి. మాయిశ్చరైజర్​కు బదులుగా బాదం నూనెను వాడితే చర్మం మృదువుగా మారడమే కాదు కాంతివంతంగా మారుతుంది. కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​తో బాధపడేవారికి.. ఇది మంచి రిలీఫ్​ అందిస్తుంది.

పాలకూరను ఇలా తీసుకుంటే- క్యాన్సర్​ దూరం!

జొజోబా ఆయిల్..: జోజోబా ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. దీన్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. జోజోబా గింజల నుంచి తీసే ఈ నూనెలో విటమిన్​ బి, విటమిన్​ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మ రంధ్రాలను అడ్డుకోకుండా నేరుగా చర్మరంధ్రాలలోకి వెళ్లి స్కిన్​ని రిపేర్ చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. పొడి చర్మం, డెలికేట్​ స్కిన్​ ఉన్నవారికి ఇది సూపర్ ఆయిల్ అని నిపుణులు అంటున్నారు.

ఆర్గాన్ నూనె..: ఆర్గాన్ నూనెను లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తేమను అందించడం మాత్రమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. డ్రై స్కిన్​, ఫ్లాకీనెస్‌ను ఎదుర్కోవడంలోనూ, చర్మం మీద గీతలు, గరుకుదనం తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

చిన్న వయసులోనే చర్మంపై ముడతలా? - కారణాలు ఇవేనట!

కొబ్బరి నూనె..: ఇది అందరి ఇళ్లల్లో లభిస్తుంది. ఇది సూపర్​ మాయిశ్చరైజర్​గా పనిచేస్తుంది. ఈ ఆయిల్స్​లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఇ, కెలు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.

ఆలివ్ నూనె..: కేవలం వంటలలోనే కాదు.. చర్మానికి బాగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. మొటిమలకు కారణమయ్యే సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నీళ్లలో రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపి వాటితో స్నానం చేస్తే విటమిన్‌ ఈ, ఎ చర్మానికి అందుతాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

మేకప్ వేసుకుంటే - క్యాన్సర్ వస్తుందా?

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!

వయసును బట్టి నడక - మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.