ETV Bharat / health

ఈ పండ్లను ఫ్రిజ్​​లో స్టోర్ చేస్తున్నారా? - అవి త్వరగా పాడవ్వడమే కాదు రుచిని కోల్పోతాయి! - These fruits should not refrigerate - THESE FRUITS SHOULD NOT REFRIGERATE

These Fruits Should Never Store in Fridge : పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలని కొన్న వెంటనే ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్​లో పెట్టేస్తుంటాం. కానీ, అన్నింటినీ అలా స్టోర్ చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

These Fruits Should Never Store in Fridge
These Fruits not to Preserve in Fridge (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 4:58 PM IST

These Fruits not to Preserve in Fridge : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పటికప్పుడు మార్కెట్​కు వెళ్లి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చుకొని తినడం అంత తేలికైన పని కాదు. అందుకే.. చాలా మంది వీకెండ్ టైమ్​లో మార్కెట్​కు వెళ్లినప్పుడు కావాల్సిన వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకుంటుంటారు. ఇక సమ్మర్​లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. వేసవిలో పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతాయని.. ఇంటికి తీసుకురాగానే రిఫ్రిజిరేటర్​లో పెట్టేస్తుంటారు. అయితే, కొన్ని పండ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్​లో(Fridge) నిల్వ చేయవద్దంటున్నారు నిపుణులు. అలా ఉంచడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉండడమేమో గానీ.. త్వరగా పాడవుతాయట. అంతేకాదు.. రుచిని కోల్పోయి విషపూరితంగా మారవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఫ్రిజ్​లో ఏ పండ్లను ఉంచకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పుచ్చకాయ : సమ్మర్ స్పెషల్​ ఫ్రూట్​గా చెప్పుకునే పుచ్చకాయను చాలా మంది కూల్​గా తినాలని ఫ్రిజ్​లో పెడుతుంటారు. అయితే ఈ పండు పెద్దదిగా ఉండడంతో దాన్ని కోసి ముక్కలను రిఫ్రిజిరేటర్​లో ఉంచుతుంటారు. కానీ, ఎప్పుడు కూడా పుచ్చకాయ, దాని ముక్కలను ఫ్రిజ్​లో నిల్వ చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా ఉంచడంలో వల్ల దానిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు నశిస్తాయంటున్నారు.

2012లో 'జర్నల్​ ఆఫ్ న్యూట్రిషన్​'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ ముక్కల కంటే.. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన ముక్కలలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్​లోని టెక్నాలజికల్ యూనివర్శిటీ ఆఫ్ డాల్మేషియాకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్. జువాన్ పాబ్లో కాస్ట్రో-పాలోమో పాల్గొన్నారు. ఫ్రిజ్​లో పుచ్చకాయ ముక్కల స్టోర్ చేయడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు.

మామిడి పండ్లు : వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లను చాలా మంది ఎక్కువ మొత్తంలో కొని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకొని తింటుంటారు. కానీ, వీటి ఎప్పుడూ రిఫ్రిజిరేటర్​లో నిల్వ చేసుకొని తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పండ్లను ఫ్రిజ్​లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది అందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయట. అంతేకాదు త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.

అరటిపండ్లు : మీరు ఫ్రిజ్​లో ఉంచకూడని మరో పండు.. అరటి. ఎందుకంటే వీటిలో రిఫ్రిజిరేటర్​లో ఉంచితే చాలా త్వరగా నల్లగా మారి పాడవుతాయంటున్నారు నిపుణులు. అలాగే ఈ పండ్ల కాండం నుంచి ఇథిలీన్ వాయువు రిలీజ్ కావడం వల్ల త్వరగా పండుతాయంటున్నారు. కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్​లో ఉంచకుండా గది ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది అంటున్నారు నిపుణులు.

వేసవిలో ఫ్రిజ్​ నీళ్లు తాగితే - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

యాపిల్స్ : వీటిని కూడా ఫ్రిజ్​లో ఉంచవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలా ఉంచడం వల్ల త్వరగా పండుతాయని, పోషకాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఇందుకు వాటిలో ఉండే క్రియాశీల ఎంజైమ్​లే కారణమంటున్నారు నిపుణులు. ఒకవేళ మీరు ఎక్కువ కాలం యాపిల్స్​ను స్టోర్ చేయవలసి వస్తే వాటిని కాగితంలో చుట్టి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే రేగు, చెర్రీస్, పీచెస్ వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

అవకాడోలు : పండని అవకాడోలు ఎప్పుడూ ఫ్రిజ్​లో నిల్వ చేయవద్దంటున్నారు నిపుణులు. వాటిని సరిగ్గా పండించడానికి గది ఉష్ణోగ్రత చాలా అనువైనదిగా చెబుతున్నారు. అలాకాకుండా అవి పూర్తి పక్వానికి రాకముందే రిఫ్రిజిరేటర్​లో నిల్వచేస్తే గట్టి పడడంతో పాటు రుచిని కోల్పోతాయంటున్నారు నిపుణులు.

బొప్పాయిలు : వీటిని పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. అలాకాకుండా.. ఫ్రిజ్​లో స్టోర్ చేస్తే శీతలీకరణ వల్ల పండు త్వరగా పండదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దాని రుచి, ఆకృతిని కూడా ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు.

పైనాపిల్స్ : వీటిని కూడా ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫ్రిజ్​లోని చల్లని ఉష్ణోగ్రతలు ఈ పండులోని ఎంజైమ్​ల కార్యాచరణను నెమ్మదిస్తాయి. ఇది పండ్ల పక్వాన్ని ఆపివేస్తుందని, రుచిని దెబ్బతీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫ్రిజ్​లో స్టోర్ చేసిన ఫైనాపిల్స్ గట్టిగా పుల్లగా తయారవుతాయంటున్నారు.

కీర దోస : దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటిని ఫ్రిజ్​లో స్టోర్ చేయడం వల్ల మచ్చలు ఏర్పడి త్వరగా పాడవుతాయంటున్నారు నిపుణులు. చూశారుగా.. ఏ ఏ పండ్లను ఫ్రిజ్​లో నిల్వ చేయకూడదో కాబట్టి మీరు ఇకపై ఈ పండ్లను వీలైనంత వరకు రిఫ్రిజిరేటర్​లో పెట్టకుండా తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ఫ్రిడ్జ్​ను ఇలా ఉంచండి.. డోర్ ఓపెన్ చేసినోళ్లు వావ్ అంటారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.