Evening Tea Side Effects : మనలో చాలా మందికి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కప్పు వేడి ఛాయ్ లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరు! నిజానికి చాలా మంది ఇష్టపడే పానీయాలలో టీ ఒకటని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఓ సర్వే ప్రకారం ఇండియా జనాభాలో 64 శాతం మంది రోజూ టీ తాగడాన్ని ఇష్టపడుతున్నారట. అందులో 30 శాతం కంటే ఎక్కువ మందికి సాయంత్రం పూట ఛాయ్ తాగే అలవాటు ఉందట! అయితే ఈ సమస్యలతో బాధపడేవారు మాత్రం సాయంత్రం పూట టీ(Tea) తాగడం బంద్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, ఎవరు సాయంత్రం పూట ఛాయ్ తాగకూడదు? ఎవరు తాగవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాయంత్రం టీకి ఎవరు దూరంగా ఉండాలంటే?
- నిద్రలేమితో బాధపడేవారు, ఇన్‌సోమ్నియా వంటి జబ్బులు కలవారు సాయంత్రం టీ తాగే అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అదే విధంగా పొడి చర్మం, పొడి జుట్టు వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈవినింగ్ టీ తాగకపోవడం మంచిది అంటున్నారు.
- మానసిక ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడితో బాధపడుతున్న వారు సాయంత్రం టీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
- బరువు తక్కువగా ఉండి.. పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా సాయంత్రం టీని తాగకూడదని అంటున్నారు.
- సమయానికి ఆకలిగా అనిపించని వారు సాయంత్రం టీ తాగే అలవాటును మానుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఎక్కువ టీ తాగడం వల్ల ఆకలి మరింత తగ్గుతుందంటున్నారు నిపుణులు.
- జీవక్రియ సరిగా లేనివారు, అజీర్తి, మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్‌ట్రబుల్ వంటి సమస్యలు ఉన్న వారు సాయంత్రం పూట టీ తాగడానికి దూరంగా ఉండాలంటున్నారు. వీరితో పాటు హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈవినింగ్ టీ కి గుడ్ బై చెప్పాల్సిందే అంటున్నారు.
- 2020లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. సాయంత్రం టీ తాగిన వ్యక్తులు గ్యాస్‌ట్రబుల్ సమస్యలతో బాధపడే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ జాన్సన్ పాల్గొన్నారు. ఈవినింగ్ టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్, ఆమ్లాలు జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.
- అదేవిధంగా.. ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు సాయంత్రం టీ తాగే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
కాఫీ Vs టీ- రెండిట్లో ఏది బెస్ట్? మార్నింగ్ లేవగానే తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?
ఈవినింగ్ ఎవరు టీ తాగవచ్చంటే?
- నైట్ షిఫ్టులో పనిచేసే వారికి ఈవినింగ్ టైమ్ టీ తాగడం హానికరం కాదంటున్నారు నిపుణులు. కానీ, ఎక్కువగా తాగొద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.
- అదేవిధంగా.. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు కూడా సాయంత్రం ఛాయ్ తాగవచ్చంటున్నారు. అలాగే మంచి జీర్ణశక్తి ఉన్నవారికి కూడా ఈవినింగ్ టీ-స్నాక్ మంచిదని చెబుతున్నారు.
- నిద్ర సమస్యలు లేని వారు, రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు ఈవినింగ్ టైమ్ టీ తాగొచ్చని సూచిస్తున్నారు.
- అలాగే.. తక్కువ టీ తాగే అలవాటు ఉన్నవారు, సగం లేదా 1 కప్పు టీ తాగాలని చెబుతున్నారు నిపుణులు. అంతకుమించి తాగితే సమస్యలు వస్తాయంటున్నారు.
చివరగా.. ఈ అంశాలన్నింటిని పరిశీలించి సాయంత్రం పూట టీ తాగడం లేదా టీకి దూరంగా ఉండటం మంచిదా? కాదా? అని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నిజానికి టీ మంచి రిఫ్రెష్‌గా పనిచేస్తుంది. కానీ, అతిగా తాగితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఛాయ్ ఎంత సేపు మరిగిస్తున్నారు? - అంతకు మించితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు!