ETV Bharat / health

షుగర్​ బాధితులకు దీపావళి స్వీట్స్ - ఈ మిఠాయిలు​ హ్యాపీగా తినేయొచ్చట! - SUGARLESS SWEETS FOR DIABETES

- ఇలా తయారు చేసుకోండి.. తియ్యని వేడుక చేసుకోండి

Sugarless Sweets for Diabetes
Sugarless Sweets for Diabetes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 5:05 PM IST

Sugarless Sweets for Diabetes: డయాబెటిస్​ ఎటాక్​ అయితే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇక, స్వీట్స్​ తినే విషయంలో ఆందోళన మామూలుగా ఉండదు. ఓ పక్క స్వీట్స్​ తినాలని ఉంటుంది.. మరోపక్క తింటే ఇంకా షుగర్‌ పెరుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఈ క్రమంలో దీపావళి పండగ వేళ షుగర్​ పేషెంట్స్​కు గుడ్​న్యూస్​ చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ ఉన్నవాళ్లు కూడా తినే కొన్ని స్వీట్స్ ఉన్నాయట. మరి.. అవి ఏంటో తెలుసుకుని.. పండగ పూట నోరూ కట్టేసుకోకుండా తినేయండి.

డ్రై ఫ్రూట్ స్వీట్: పండగ ఏదైనా స్వీట్​ చేయాలంటే బెల్లం లేదా చక్కెర ఉపయోగించి చేయాల్సిందే. వీటితో చేసినవి తింటే ఒంట్లో షుగర్​ పెరుగుతుంది. అయితే.. ఈ స్వీట్ చక్కెర, బెల్లం ఉపయోగించకుండా తయారు చేయవచ్చు. ఈ స్వీట్ తింటే ఆరోగ్యం కూడా లభిస్తుందని NIH సభ్యుల బృందం చేసిన అధ్యయనంలో తేలింది.(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి)

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలను దోరగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు వీటన్నింటిని మిక్సీజార్​లోకి వేసి అందులోకి డేట్స్​ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఖర్జూరంలోని తీపి పదార్థం ఈ ముద్దను తీపిగా చేస్తుంది.
  • తర్వాత నెయ్యితో నచ్చిన సైజ్​లో చిన్నచిన్న బాల్స్‌లా చేసుకుంటే డ్రై ఫ్రూట్స్​ లడ్డూ రెడీ.

బాదం బర్ఫీ: ఇది షుగర్​ పేషెంట్స్​కు ఆరోగ్యకరమైన స్వీట్. షాపుల్లో కొనుగోలు చేసిన దాని కంటే ఇంట్లో చేసుకుంటే దీని రుచి బాగుంటుంది. అందుకోసం..

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బాదంపప్పులను దోరగా వేయించి కొద్దిగా దంచాలి.
  • దానిలో కాస్త తేనె, నెయ్యి వేసి కావాల్సిన ఆకారం ఇస్తే కమ్మని బర్ఫీ రెడీ.
  • ఈ బర్ఫీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట.

క్యారెట్ హల్వా : అత్యంత ప్రాచుర్యం పొందిన డెజర్ట్‌లలో ఇదీ కూడా ఒకటి. అందుకోసం..

  • క్యారెట్‌ను అవసరమైనంత తీసుకుని బాగా తురుముకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌పై ఒక పాత్ర ఉంచి అందులో సరిపడా పాలు పోసి, తురిమిన క్యారెట్‌ను వేసి మీడియం మంట మీద ఉడికించాలి.
  • క్యారెట్ సహజంగా తీపిగా ఉంటుంది కాబట్టి చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు.
  • అయితే.. మీకు అవసరమైతే, చక్కెరకు బదులుగా కొద్దిగా తేనె ఉపయోగించండి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
  • గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. తినొచ్చు కదా అని ఇష్టం ఉన్నన్ని తినకుండా మితంగా తీసుకోవాలి. కాబట్టి రోజుల్లో 1 లేదా 2 అంతకుమించి ఎక్కువ తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మధుమేహం​తో తీవ్రంగా బాధపడుతున్నారా? - పరిశోధకులు సూచిస్తున్న డైట్ ఇదే!

డయాబెటిస్ బాధితులు 'సోయా దోశ' తినండి - దెబ్బకే షుగర్ కంట్రోల్! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.