Causes Of Skin Cancer : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చర్మ సౌందర్యం కోసం వివిధ కాస్మోటిక్స్ యూజ్ చేస్తుంటారు. కానీ.. వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకుంటే.. సువాసననిచ్చే పర్ఫ్యూమ్, లోషన్లు, సబ్బులు వంటి కాస్మోటిక్స్ వల్ల ఎలర్జిక్ రియాక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు వాడడం వల్ల డెర్మటైటిస్, స్కిన్ ర్యాషెస్ వంటి చర్మ సమస్యలు తలెత్తవచ్చు. క్రమంగా అవి చర్మ క్యాన్సర్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
సన్‌స్క్రీన్స్ : స్కిన్ క్యాన్సర్ బారినపడకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సన్‌స్క్రీన్స్‌లో ఆక్సిబెంజోన్, అవో బెంజోన్ వంటి కెమికల్ ఉంటాయి. నిజానికి ఇవి యూవీ కిరణాలు నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కానీ, కొందరిలో కెమికల్ సన్‌స్క్రీన్స్ కారణంగా అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా వాటిని ఎక్కువకాలం వాడడం వల్ల దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కు దారితీసి.. చర్మ క్యాన్స్ర్ని కలిగించే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
2019లో "జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 20 సంవత్సరాలకు పైగా రసాయనాలు కలిగిన సన్‌స్క్రీన్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించిన వ్యక్తులు చర్మ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ లారెన్స్ డేవిడ్ పాల్గొన్నారు. కెమికల్ సన్ స్క్రీన్స్ వాడడం వల్ల అందులోని రసాయనాలు భవిష్యత్తులో స్కిన్ క్యాన్సర్‌కి దారితీసే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : చీర అలా కట్టుకుంటే క్యాన్సర్ ఖాయం! - దేవుడా ఇంకా ఎన్ని చూడాలో!
హెయిర్ డై : ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఇబ్బందిపెడుతుండడంతో చాలా మంది హెయిర్ డైలు వాడుతుంటారు. కానీ, ఇవి కూడా స్కిన్ క్యాన్సర్‌కు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. జుట్టుకు వేసుకునే కొన్ని రకాల హెయిర్ డైలలో పారా ఫెనిలెన్డైమైన్ (పీపీడీ) అనే రసాయన పదార్థం ఉంటుంది. ఫలితంగా వీటిని ఎక్కువగా యూజ్ చేసినప్పుడు స్కిన్ ఇన్ఫ్లమేషన్కు గురై.. క్యాన్సర్‌కు దారితీయవచ్చంటున్నారు.
ప్రిజర్వేటివ్స్ : వీటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాస్మోటిక్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటి కారణంగా చర్మం ఇన్ఫ్లమేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఫలితంగా స్కిన్ క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చని చెబుతున్నారు.
ఆ వస్తువుల విషయంలో జాగ్రత్త : పైన చెప్పినవే కాకుండా నికెల్ కలిగే ఉండే నగలు, నాణేలు, కొన్ని రకాల వస్తువుల వాడకం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరిలో నికెల్ సంబంధిత వస్తువులను తరచూ తాకడం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కారణంగా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తలెత్తడమే కాకుండా.. చర్మ కణాలు, డీఎన్ఏకు నష్టం ఏర్పడుతుంది. ఫలితంగా చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు సహజ పద్ధతుల్లో చర్మ సంరక్షణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.