Simple Tips To Stop White Hair : జుట్టు రంగు మారడం అనేది ఒక సహజ సిద్ధ ప్రక్రియ. వయసు పెరిగే కొద్దీ జుట్టు రంగు మారడం జరుగుతుంది. నల్లగా ఉన్న జుట్టు వయసు ప్రభావంతో తెల్లగా మారుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు తెల్లబడటాన్ని గమనించవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, వాడే హెయిర్ ప్రోడక్టులు తదితరాలు. ఈ నేపథ్యంలో వెంట్రుకలు తెల్లబడటాన్ని ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలు, పప్పులు, ఆకుకూరలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని మూలకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా అవి త్వరగా తెల్లబడకుండా కాపాడతాయి.
పొగతాగడం మానేయండి
వెంట్రుకలు తెల్లబడటానికి పొగతాగడం కూడా ఒక కారణం కావచ్చు. నేరుగా పొగతాగడం లేదా పొగ ప్రభావానికి లోనుకావడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పొగకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. దీని వల్ల వెంట్రుకల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
ఒత్తిడిని నియంత్రించుకోండి
మారిన పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఒత్తిడికి గురవడం అనేది ప్రస్తుతం మామూలు అయిపోయింది. అయితే ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసే వ్యాయామం, ధ్యానం, యోగాలతో పాటు ఇతర శారీరక శ్రమ చేసే కార్యక్రమాలపై దృష్టి సారించడం ఉత్తమం.
సూర్యుడి నుంచి జుట్టును రక్షించుకోండి
వెంట్రుకలు తెల్లబడటానికి ఎక్కువగా ఎండకు ఉండటం కూడా కారణం కావచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ లేదా యూవీ కిరణాలు వెంట్రుకలు నష్టపోవడమే కాకుండా తెల్లబడటానికి కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా ఎండకు గురికాకుండా జాగ్రత్తలు పాటించడమే కాకుండా ఎస్పీఎఫ్ కలిగిన హెయిర్ ప్రోడక్ట్లను వాడటం ఉత్తమం.
హెయిర్ ట్రీట్మెంట్కు దూరంగా ఉండండి
అతిగా హెయిర్ డైలు వాడటం, రకరకాల చికిత్సలు, వెంట్రుకలను స్టైల్‌గా కనిపించేలా చెయ్యడానికి వేడి వస్తువులను వాడటం లాంటి అనేక కారణాలు కూడా వెంట్రుకలు తెల్లబడటానికి కారణం కావచ్చు. రసాయనాలతో కూడిన ట్రీట్మెంట్లు కాకుండా సహజసిద్ధ పద్ధతుల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.
తేలిక ప్రోడక్టులను వాడండి
మీ వెంట్రుకల మీద అలాగే మాడు మీద తీవ్రంగా ప్రభావం చూపని తేలికపాటి షాంపూలు, కండీషనర్లు వాడటం మంచిది. అలా కాదని ఎక్కువ నష్టాన్ని కలిగించే కెమికల్స్ వాడటం వల్ల కూడా వెంట్రుకలు త్వరగా పాడవడమే కాకుండా తెల్లబడతాయి.
హెయిర్ కేర్ రొటీన్‌ను ఫాలో అవ్వండి
మీకు తగిన మంచి షాంపూ, కండీషనర్‌ను క్రమం తప్పకుండా వాడండి. దువ్వుకునేటప్పుడు మరీ ఇబ్బందికరంగా కాకుండా వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. స్టైల్ కోసం అంటూ వెంట్రుకలను అతిగా లాగడం, బలప్రయోగం చేయడం లాంటి వాటి జోలికి వెళ్లకండి. అలాగే నిపుణులను కలిసి మీకు అవసరమైన బయోటిన్, విటమిన్-బీ12, విటమిన్-ఇ సహా ఇతర సప్లిమెంట్లను అవసరమైన మేరకు తగిన మోతాదులో తీసుకోండి.
మీ జుట్టు రంగును అంగీకరించండి
మనలో చాలామందికి ఇప్పటికే వెంట్రుకల రంగు మారి ఉండవచ్చు. అయితే సహజసిద్ధంగా జరిగే ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడమే కాకుండా సహజ సిద్ధంగా వచ్చిన రంగును కూడా అంగీకరించడం మంచిది. ఇలా వచ్చిన జుట్టు రంగును కాస్త స్టైలిష్‌గా మార్చి బూడిద రంగులోకి లేదంటే సిల్వర్ రంగులోకి మారిస్తే బాగా కనిపిస్తుంది. అయితే వెంట్రుకలకు రంగు వెయ్యాల్సి వస్తే మాత్రం సహజసిద్ధంగా వచ్చే రంగులను ట్రై చెయ్యడం ఉత్తమం.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టెన్షన్‌తో భేజా ఫ్రై అవుతోందా? - ఇది నోట్లో వేసుకోండి - క్షణాల్లో హుష్ కాకి!
ఫుడ్ పాయిజన్ అయిందా? డాక్టర్ వద్దకు వెళ్లేముందు ఇంట్లో ఇలా చేస్తే బిగ్ రిలీఫ్!