ETV Bharat / health

అలర్ట్‌ : మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే - మీకు గుండె జబ్బు ఉన్నట్టే! - Heart Disease problems in telugu

Signs of Heart Disease : నేటి ఆధునిక జీవితంలో ఎంతో మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇలాంటి వారు శరీరంలో వచ్చే కొన్ని మార్పులతో, ముందే ఈ సమస్యలను గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Signs of Heart Disease
Signs of Heart Disease
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 1:26 PM IST

Signs of Heart Disease : మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు మన శరీరం తెలియజేస్తునే ఉంటుంది. కానీ, మనమే ఆ లక్షణాలను కొంచెం లైట్‌ తీసుకుంటాము. గుండె జబ్బుల విషయంలోనూ దేహం పలు హెచ్చరికలు చేస్తుందట. ఆ సంకేతాలు తెలుసుకొని మేల్కొంటే.. ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాదాలు, చీలమండలంలో వాపు :
హార్ట్‌ సరిగ్గా పనిచేయని వ్యక్తుల పాదాలు, చీలమండలలో వాపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏంటంటే కాళ్లలో చెడు ద్రవం పెరుకుపోవడమేనని అంటున్నారు. ఇది క్రమంగా కాళ్ల పై భాగం నుంచి గజ్జల వరకు విస్తరిస్తుందని అంటున్నారు. 2022లో 'అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌' ప్రచురించిన నివేదిక ప్రకారం, చీలమండల దగ్గర వాపు ఉన్న వారు గుండె జబ్బుల ప్రమాదంతో ఎక్కువ మంది మరణించారని వెల్లడించారు.

చర్మం నీలం లేదా ఊదా రంగులోకి మారుతుంది :
మీ చర్మం నీలం లేదా ఊదా రంగులో ఉన్నట్లయితే గుండె పనితీరు సరిగ్గా లేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా స్కిన్‌ రంగు మారడానికి రక్తనాళాలు బ్లాక్ అవ్వడమే కారణం కావొచ్చని అంటున్నారు. అలాగే చర్మం రంగు మారడం వెనక మీ రక్తంలో ఆక్సిజన్‌ తగినంత లేదనడానికి ఒక సంకేతమని తెలియజేస్తున్నారు. దీనికి అసలు కారణం చర్మంలోని కణజాలాలు చనిపోవడమేనని చెబుతున్నారు.

చేతివేళ్లు వాపు :
మీ చేతివేళ్ల చివర అలాగే కాళ్ల చివర్లో ఉండే గోర్లు గుండ్రంగా, మందంగా ఉబ్బినట్లుగా ఉంటే మీరు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో 'క్లబ్బింగ్‌' అని అంటారు. అలాగే గోర్ల చుట్టూ ఉండే చర్మం ఎరుపు రంగులోకి మారుతుందని అంటున్నారు. ఇంకా గోళ్ల కింద ఉన్న చర్మం కూడా వాపు వస్తుందని తెలియజేస్తున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో ఊపిరితిత్తులకు సంబంధించి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నట్లేనని చెబుతున్నారు. అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా కావచ్చు.

వేళ్లు, కాళ్ల మీద గడ్డలు :
మీ చేతి వేళ్లు, కాళ్లపై గడ్డలు కనిపిస్తున్నాయా ? అయితే, ఇది మీ రక్తనాళాలలో ఇన్ఫెక్షన్‌ ఉందని దానికి ఒక సంకేతం కావచ్చు. ఇలా గడ్డలు ఏర్పడటానికి కారణం 'ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్' అనే గుండె ఇన్ఫెక్షన్ కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటాయని అంటున్నారు.

చర్మంపై గడ్డలు ఉన్నట్లయితే కూడా గుండె సంబంధిత సమస్యలు మనల్ని వెంటాడుతున్నట్లేనని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించి గుండె ఆరోగ్యానికి, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు రకాల పరీక్షలను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.

ఈ టిప్స్ పాటిస్తే చాలు - బ్యూటీ పార్లర్​కు వెళ్లకుండానే ఫేస్​ మిలమిలా మెరవడం గ్యారంటీ!

పరగడుపున అల్లం వాటర్​ తాగితే - ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

టేస్టీ​గా ఉందని సాస్​ లాగించేస్తున్నారా? - మీ శరీరంలో జరిగేది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.