Side Effects Of Eating Too Much Watermelon : ఎండలు దంచుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, వివిధ రకాల పండ్ల జ్యూస్‌లు, వాటర్‌మెలన్ వంటి వాటిని తీసుకుంటుంటారు. ముఖ్యంగా చాలా మంది సమ్మర్‌లో వాటర్‌మెలన్ ఎక్కువగా తింటుంటారు. అయితే, వాటర్‌మెలన్ ఎక్కువగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
చక్కెర స్థాయిలు పెరుగుతాయి : వాటర్‌మెలన్‌లో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. అయితే, మధుమేహం వ్యాధితో బాధపడేవారు దీనిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉందట. కాబట్టి, షుగర్ ఉన్నవారు ఒకటి లేదా రెండు పుచ్చకాయ ముక్కలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
2017లో "న్యూట్రిషన్, మెటబాలిజం అండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్" జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, టైప్ 2 మధుమేహం వ్యాధితో బాధపడేవారు పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని 'షాంగ్హై జియాటాంగ్ విశ్వవిద్యాలయానికి' చెందిన డాక్టర్. షుయాన్ జు పాల్గొన్నారు. మధుమేహం వ్యాధితో బాధపడేవారు వాటర్‌మెలన్ ఎక్కువగా తినడం వల్ల షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
విరేచనాలు : వాటర్‌మెలన్‌లో నీరు, సహజ చక్కెరలు, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. అయితే, వాటర్‌మెలన్ ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో విరేచనాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి, వాటర్‌మెలన్‌ను తక్కువగా తినాలని సూచిస్తున్నారు.
మునగాకు నుంచి వేర్ల వరకూ అన్నింటితో లాభాలే- ఈ విషయాలు తెలుసా? - Health Benefits Of Drumstick Tree
జీర్ణసమస్యలు : పుచ్చకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఇవే కాకుండా..
- వాటర్‌మెలన్‌ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్‌ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యతకు దారితీస్తుంది.
- చాలా అరుదుగా కొంతమందిలో పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల అలర్జీ, దురద, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుందట. కాబట్టి, రోజూ పుచ్చకాయను తినేవారు మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? నిద్రలేకపోవడమే కాదు, ఇవీ కారణాలే! - Reasons for Dark Circles
ఎన్ని రోజులకోసారి తలకు నూనె రాసుకోవాలి? ఎలా అప్లై చేసుకుంటే లాభం? - Hair Oil Using Tips