ETV Bharat / health

అందంగా కనిపించాలని రోజూ లిప్‌స్టిక్‌ పెట్టుకుంటున్నారా? ఈ సమస్యలు ఎటాక్​ చేయడం గ్యారెంటీ! - Side Effects Of Lipstick Daily - SIDE EFFECTS OF LIPSTICK DAILY

Side Effects of Wearing Lipstick Regularly : మీరు లిప్​స్టిక్​ వాడుతున్నారా? అకేషన్​తో పనిలేకుండా రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌ పెట్టుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఇలా రోజూ లిప్‌స్టిక్‌ వేసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Wearing Lipstick Regularly
Side Effects of Wearing Lipstick Regularly (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 12:13 PM IST

Side Effects of Wearing Lipstick Regularly : అమ్మాయిలు అందంగా కనిపించడానికి రోజూ వివిధ రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను వాడుతుంటారు. అందులో లిప్​స్టిక్​ ఒకటి. అయితే ఎంత మేకప్‌ వేసుకున్నా పెదాలకు లిప్​స్టిక్​ అప్లై చేస్తేనే పర్ఫెక్ట్​ లుక్​ వస్తుంది. కాగా, అవసరాన్ని బట్టి.. ఫంక్షన్లకు ఎప్పుడో ఒకసారి లిప్‌స్టిక్ వేసుకుంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా రోజూ లిప్‌స్టిక్‌ అప్లై చేసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం.

పెదాలు పొడిబారడం : మార్కెట్‌లో లభ్యమయ్యే చాలా లిప్‌స్టిక్స్‌లలో హానికరమైన రసాయనాలుంటాయి. వీటిని రెగ్యూలర్‌గా అప్లై చేసుకోవడం వల్ల పెదాలు పొడిబారతాయని నిపుణులంటున్నారు. అలాగే రోజూ లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం వల్ల పెదాలు పగులుతాయని చెబుతున్నారు. కాబట్టి, లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేసేటప్పుడు హానికరమైన కెమికల్స్‌ లేనివి ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు.

2016లో "Contact Dermatitis" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రోజూ లిప్‌స్టిక్ పెట్టుకునే మహిళల్లో పెదాలు పొడిబారడం, చికాకుకు గురయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 'డాక్టర్‌ జెన్నిఫర్ ఎం. లిన్' పాల్గొన్నారు. లిప్‌స్టిక్‌లోని పదార్థాలు పెదాల సహజ రక్షణ బారియర్‌ను దెబ్బతీస్తాయని.. ఈ కారణంగా పెదాలు పొడిబారతాయి" అని వారు పేర్కొన్నారు

అలెర్జీలు : ప్రతిరోజు లిప్‌స్టిక్‌ అప్లై చేసుకోవడం వల్ల కొంతమందిలో అలర్జీ, దురద, వాపు, పెదాలు ఎర్రగా మారడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మీ చర్మంపై తెల్ల మచ్చలకు కారణాలు ఇవే! - మీకు తెలుసా? - Causes For White Patches on Skin

ఆరోగ్య సమస్యలు : లిప్‌స్టిక్‌లో హానికారక లోహాలు, కెమికల్స్‌, పారాబెన్‌లు అధికంగా ఉంటాయి. దీనివల్ల లిప్‌స్టిక్‌​లోని కెమికల్స్​ బ్లడ్‌లో కలిసిపోయి.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఈ రసాయనాలు వాళ్ల ఒంట్లో నుంచి పుట్టే పిల్లలకూ ట్రాన్స్​ఫర్ అవుతాయట. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 30 మంది అమ్మాయిలపై రీసెర్చ్​ చేసి.. ఈ విషయాన్ని తేల్చారు.

ఇన్ఫెక్షన్లు : లిప్​స్టిక్ అప్లికేటర్‌లను శుభ్రంగా ఉంచకపోతే, అవి బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. ఈ బ్యాక్టీరియా చర్మానికి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందని అంటున్నారు. కాబట్టి, లిప్​స్టిక్ వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే అప్లికేటర్‌లను క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లిప్​స్టిక్​ విషయంలో జాగ్రత్తలు:

  • లిప్‌స్టిక్ పెట్టుకునే ముందు, తర్వాత పెదాలకు లిప్ బామ్ లేదా వాసెలిన్ వంటి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
  • ఎటువంటి రసాయనాలు లేని లిప్‌స్టిక్‌ను ఎంపిక చేసుకోండి.
  • రాత్రి పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను తొలగించండి.
  • గర్భిణీలు లిప్‌స్టిక్‌ అప్లై చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు!

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

క్లియర్ స్కిన్ కావాలా? డార్క్ స్పాట్స్ తగ్గాలా? ముఖానికి ఆ పిండి రాసుకుంటే చాలు! - Benefits Of Corn Flour On Face

చీటికీ మాటికీ చెవిలో కాటన్​ బడ్స్​ పెడుతున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ముప్పు తప్పదు! - Side Effects of Using Cotton Buds

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.