ETV Bharat / health

అలర్ట్ : ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? - Onions Side Effects

Onions Side Effects : ఉల్లిపాయ చేసే మేలు గురించి అందరికీ తెలుసు. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అతిగా వాడితే అనర్థాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Onions Side Effects
Onions
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 2:36 PM IST

Side Effects of Onions : ఉల్లిపాయలో పొటాషియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, ఐరన్‌.. వంటి ఖనిజాలూ, ఫొలేట్‌, విటమిన్‌-సి, ఎ, బి6లతో పాటు పీచూ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢమవుతాయి. తలనొప్పి, అధిక రక్తపోటు.. వంటి అనేక అనారోగ్యాలకు ఉల్లిపాయ దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా.. ఉల్లిలోని యాంథోసియానిన్స్‌ గుండెను సంరక్షిస్తాయి. ముఖ్యంగా బ్లడ్‌ షుగర్‌ స్థాయిని తగ్గించడమే కాకుండా క్యాన్సర్‌ను సైతం నివారిస్తాయి.

అదేవిధంగా.. ఉల్లితో గాయాలు, దద్దుర్లు, మంట, తాపం, అలర్జీలు, సైనస్‌ వంటివి కూడా తగ్గుతాయి. జీర్ణప్రక్రియను, కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా.. జుట్టు ఆరోగ్యానికీ చాలా బాగా సహాయపడుతుంది.

అయితే.. ఆహారం ఏదైనా పరిమితంగా తీసుకుంటేనే అమృతమని.. ఎక్కువైతే విషం అన్న సంగతి గ్రహించాలని సూచిస్తున్నారు. ఉల్లిపాయలను కూడా అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయలు ఇలా తీసుకుంటే- డయాబెటిస్​కు చెక్​!

  • ఉల్లిపాయలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. వీటిని అధికంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగించవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్​లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు వంటి వాటికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు.
  • కొంతమందిలో ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల గుండెల్లో మంట కలుగుతుంది. ఈ గుండెల్లో మంటను "గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) లక్షణంగా చెబుతోంది "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్" సంస్థ.
  • అందువల్ల గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉన్నవారు ఉల్లిపాయకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయొచ్చని సూచిస్తున్నారు.
  • 2017లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. గుండెలో మంట ఉన్న 100 మంది వ్యక్తులను పరిశీలించగా.. వారిలో ఉల్లిపాయలు ఎక్కువగా తినేవారిలో గుండెలో మంట లక్షణాలు మరింత తీవ్రంగా కనిపించాయని తేలింది.
  • ఈ పరిశోధనలో పాల్గొన్న 'యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్టర్న్ మెడికల్ సెంటర్‌' ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జేమ్స్ ఎ. కాల్హౌన్ ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే కొన్ని సమ్మేళనాలు గుండెలో మంటను కలిగిస్తాయని లేదా మరింత తీవ్రతరం చేస్తాయని పేర్కొన్నారు.
  • ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అలర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల దురద, దద్దుర్లు వంటి తేలికపాటి లక్షణాల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన ప్రతిచర్యల వరకు ఉంటాయని పేర్కొన్నారు.
  • పచ్చి ఉల్లిపాయలు కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలకూ దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా.. చర్మంపై ఎరుపు, దురద లేదా బొబ్బలు ఏర్పడవచ్చని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

తెల్ల ఉల్లి Vs ఎర్ర ఉల్లిగడ్డలు - ఈ రెండిట్లో ఏవి మంచివో మీరు తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.