Side Effects Of Drinking Cool Drinks : పార్టీ, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా కూల్ డ్రింక్స్ ఉప్పొంగుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా మహిళలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇందులో మరో విషయం ఏమంటే.. పురుషుల కంటే మహిళలకు అవి ఎక్కువ ప్రమాదమని, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Side Effects Of Cool Drinks : క్యాన్సర్ పేరు వింటేనే వణికిపోతాం. ఇక దాని బారినపడితే చెప్పేదేముంది? తమకు చెడు అలవాట్లు ఏమీ లేకున్నా.. ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదని కొందరు మదనపడతారు. అయితే.. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువట. కూల్ డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫేట్లు, ఫ్రక్టోజ్, సోడియం వంటి పదార్థాలు లివర్ పై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయట. ఈ పదార్థాలు లివర్ లో కొవ్వు పేరుకుపోవడానికి, శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని తగ్గించడానికి, ప్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచడానికి దారితీస్తాయని నిపుణులంటున్నారు. ఈ పరిస్థితులు అన్నీ లివర్ క్యాన్సర్ కు దారితీయే అవకాశం ఉందట.
సుమారు లక్ష మంది రుతుక్రమం ఆగిన మహిళలపై 'బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్' బృందం నేతృత్వంలో ఓ పరిశోధన జరిగింది. దీని ప్రకారం.. రోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు శీతల పానీయాలు తాగిన మహిళల్లో కాలేయ క్యాన్సర్ అభివృద్ధి అయ్యే అవకాశం 85 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే దీర్ఘకాలిక హెపటైటిస్‌తో మరణించే ప్రమాదం 68 శాతం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
సాధారణంగా హాట్ డ్రింక్స్ తీసుకునే మహిళలు తక్కువగా ఉంటారు. మిగిలిన వారంతా.. శీతల పానీయాలను తీసుకుంటారు. అయితే.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల స్త్రీలలో ఫైబ్రోసిస్, సిర్రోసిస్, దీర్ఘకాలిక కాలేయ మంట ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక సాధారణ శీతల పానీయం 600ml సీసాలో సుమారు 16 ప్యాక్‌ల చక్కెర ఉంటుందట. ఇది దాదాపు 1000 అనవసరమైన కిలోజౌల్స్‌ను తీసుకోవడానికి దారి తీస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని పానియాలలో బెంజీన్, మిథైలిమిడాజోల్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకామైనవని నిపుణులు అంటున్నారు.
కాలేయ క్యాన్సర్ లక్షణాలు: కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలూ ఉండవని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్ర రూపం దాల్చిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అవేంటంటే..
- పొత్తికడుపు కుడి వైపున, పక్కటెముక కింద నొప్పి
- కుడి భుజం దగ్గర నొప్పి
- కామెర్లు
- బరువు తగ్గడం
- వికారం
- ఆకలి లేకపోవడం
- అలసట
- ముదురు రంగు మూత్రం
అలర్ట్ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?
బాదం ఎక్కువగా తింటున్నారా? - నిపుణులు హెచ్చరిస్తున్నారు!
గర్భిణుల్లో దంత సమస్యలు - బిడ్డకూ ఎఫెక్ట్ - ఎలా నివారించాలి?