Reverse Walking Health Benefits : వాకింగ్.. ప్రతి ఒక్కరూ దీనిని సులభంగా చేయొచ్చు. అందుకే ఉన్న వ్యాయామాలన్నింటిలో దీనిని ముఖ్యమైనదిగా భావిస్తుంటారు. ప్రతి రోజూ కొంతసేపు నడవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక నడకతో షుగర్, రక్తపోటు, కీళ్ల నొప్పులు లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే నడకను అలవాటు చేసుకోవాలని డాక్టర్లందరూ చెబుతుంటారు. అయితే నడకలో కూడా బోలెడన్ని రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్, స్ట్రోల్ వాకింగ్, రేస్ వాకింగ్ ఇలా అనేక వెరైటీలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో రివర్స్ వాకింగ్ కూడా చేరింది. ఈ నడకతో కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
రివర్స్ వాకింగ్ అంటే ఏమిటి: అడుగులు వెనక్కి వేస్తూ రివర్స్‌లో నడవటమే రివర్స్ వాకింగ్. మామూలు వాకింగ్‌లో అడుగు ముందుకు వేసేటప్పుడు తొలుత మడమ భాగం నేలకు ఆనుతుంది. ఆ తరువాత కాలు మొత్తం నేలపై ఆనుతుంది. కానీ రివర్స్ వాకింగ్‌లో ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కాలు వెనక్కి వేసే సమయంలో ఫస్ట్ కాలి వేళ్ల భాగం నేలకు ఆని.. ఆ తరువాత పాదం మొత్తం నేలకు ఆనుతుంది. ఇలా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ నడవడమే రివర్స్ వాకింగ్. మామూలు వాకింగ్‌తో పోలిస్తే ఈ పద్ధతితో అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోజుకు 10 వేల అడుగుల వాకింగ్- ఈ సింపుల్ టిప్స్‌తో సులువుగా నడిచేయండి!
రివర్స్ వాకింగ్ బెనిఫిట్స్:
కేలరీలు బర్న్: మామూలు నడకకంటే.. రివర్స్ వాకింగ్‌లో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (American College of Sports Medicine) ప్రకారం మామూలుగా గంటకు 3.5 మైళ్ల వేగంతో నడిస్తే.. 4.3 METలు కేలరీలు బర్న్ అవుతాయి. అదే సమయంలో రివర్స్ వాకింగ్ వల్ల.. 6.0 METలు బర్న్ అవుతాయని స్పష్టం చేసింది. కాబట్టి వేగంగా నడవడం కంటే రివర్స్ వాకింగ్ నిమిషానికి 40% ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుందని ACSM స్పష్టం చేసింది.
ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు: ఈ నడక ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి పలు రకాల ప్రయోజనాలు అందిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది. రివర్స్ వాకింగ్ నడక వేగం, సమతుల్యత మెరుగుపరుస్తుంది. ఇతర ఫిజికల్ థెరపీ చికిత్సలతో కలిపినప్పుడు, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ACL గాయాలు ఉన్నవారిలో రివర్స్ వాకింగ్ మేలు చేస్తుంది.
బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!
ఈ తరహా వాకింగ్‌తో ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తొడ వెనక భాగంలోని కండరాలు మరింత బలంగా మారతాయి. అంతేకాదు స్టెబిలిటీ, కండరాల మధ్య సమన్వయం, శ్వాస తీసుకోవడం కూడా మెరుగవుతుంది. అంతిమంగా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలా స్టార్ట్ చేయండి: కొత్తగా రివర్స్ వాకింగ్ ట్రై చేసేవారు తమకు బాగా తెలిసిన ప్రాంతంలోనే ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు. నేలపై లేదా ట్రెడ్ మిల్‌పై చిన్న చిన్నగా అడుగులు వెనక్కి వేస్తూ ప్రారంభించాలి. క్రమంగా కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ ఎక్కువ దూరం రివర్స్ వాకింగ్ చేయొచ్చు. సాధారణ వర్కవుట్ పూర్తయ్యాక, లేదా అప్పుడప్పుడూ గ్యాప్ ఇస్తూ ఈ తరహా వాకింగ్ చేయాలనేది నిపుణుల సలహా!
రోజూ ఎంతసేపు నడుస్తున్నారు? - ఈ లెక్క ప్రకారం నడవకపోతే ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం!
భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!
వాకింగ్, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!