ETV Bharat / health

షుగర్ వ్యాధి​ వచ్చే ముందు శరీరంలో కనిపించే లక్షణాలేంటో - మీకు తెలుసా ? - Prediabetes Symptoms

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 1:38 PM IST

Symptoms Of Prediabetes : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అందులో.. మధుమేహం ఒకటి. అయితే, ఎక్కువ మందికి షుగర్​ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలియదు. ఆ ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Prediabetes Symptoms
Symptoms Of Prediabetes (ETV Bharat)

Prediabetes Symptoms : ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఒకటి.. మధుమేహం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఒక్కసారి​ వచ్చిందంటే.. రోజూ మందులు వేసుకుంటూ జాగ్రత్తలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు.

ఇది ఇలా ఉంటే.. మెజార్టీ జనాలకు షుగర్​ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలియదు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్​ స్థాయులు పెరిగి గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే, డయాబెటిస్​ వచ్చే ముందు మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్​ 'డాక్టర్​ రవిశంకర్​ ఇరుకులపాటి' వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రీ డయాబెటిస్ : కొద్దిపాటి లక్షణాలతో కనిపించే మధుమేహాన్ని 'ప్రీ డయాబెటిస్'​ అంటారు. దీనివల్ల గుండె రక్తనాళాల జబ్బు, మరణాల ముప్పు పెరుగుతుంది. ప్రీ డయాబెటిస్​ ఉన్నవారిలో గ్లూకోజ్​ మమూలు కన్నా ఎక్కువగానే ఉంటుంది కానీ, మధుమేహంగా నిర్ధారించే అవకాశం అంత ఎక్కువగా ఉండదని వైద్యులు చెబుతున్నారు.

తరచుగా మూత్రవిసర్జన చేయడం : తరచూ మూత్రవిసర్జన చేయడం డయాబెటిస్​ ఉందనడానికి మొదటి సంకేతం. రాత్రి సమయంలో కూడా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తే ప్రీ డయాబెటిస్​ ఉన్నట్లు గుర్తించాలంటున్నారు డాక్టర్ రవిశంకర్.

దాహం ఎక్కువగా వేయడం : తరచూ నీళ్లు తాగినా కూడా ఎక్కువగా దాహం వేస్తుంటే.. మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించాలి. షుగర్​ వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో దాహం ఎక్కువగా వేస్తుందని చెబుతున్నారు.

ఆకలి ఎక్కువగా వేయడం : ఆహారం సరిపడినంత తిన్న తర్వాత కూడా ఆకలి వేస్తుంటే అది ప్రీ డయాబెటిస్​ సంకేతంగా గుర్తించాలి. శరీరానికి తగినంత గ్లూకోజ్​ అందకపోవడంతో ఇలా ఆకలి ఎక్కువగా వేస్తుందంటున్నారు.

అలర్ట్‌ : మీ కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? - షుగర్ సంకేతం కావొచ్చు!

అలసట : రాత్రి బాగా నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటే.. మధుమేహం పొంచి ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే కొద్ది దూరం నడవగానే అలసిపోవడం, కొన్ని మెట్లు కూడా ఎక్కలేకపోవడం వంటి లక్షణాలు కూడా ప్రీ డయాబెటిస్​ ఉందనడానికి ఒక సంకేతం.

కంటిచూపు తగ్గిపోవడం : వయసు పైబడుతున్నా కొద్ది కంటిచూపు తగ్గిపోవడం సహజమే. కానీ, ప్రీ డయాబెటిస్​ వల్ల కంటిలోని రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు తగ్గిపోతుంది.

  • అలాగే ఎటువంటి వ్యాయామాలు చేయకపోయినా, డైట్​ పాటించకపోయినా కూడా అప్రయత్నంగా బరువు తగ్గడం మధుమేహానికి సంకేతం కావొచ్చు.
  • ఇంకా గాయాలు త్వరగా మానకపోవడం కూడా ప్రీ డయాబెటిస్​ లక్షణాలలో ఒకటి.
  • చివరిగా పైన తెలిపిన లక్షణాలలో ఏవి కనిపించినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించి బ్లడ్​ షుగర్​ టెస్ట్​ చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

ఉదయం నిద్రలేచాక ఇలా అనిపిస్తోందా? - అయితే, మీకు డయాబెటీస్ ముప్పు ఉన్నట్టే!

నోటి దుర్వాసన, చిగుళ్లలో రక్తమా? - షుగర్ వ్యాధి కారణం కావొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.