ETV Bharat / health

పోహా vs రైస్​- ఆరోగ్యానికి ఏది బెటర్​? - poha or rice which is better - POHA OR RICE WHICH IS BETTER

Poha VS Rice Which Is Better : రోజంతా మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్​ఫాస్ట్​లో మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పోహా (అటుకుల ఉప్మా) తింటే మంచిదా? లేదా రైస్​ తింటే బెటరా? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.

Poha VS Rice
Poha VS Rice
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 6:18 PM IST

Poha VS Rice Which Is Better : ఉదయాన్నే మనం తినే ఆహారం రోజంతా మనం ఎనర్జీగా, చురుగ్గా ఉండడానికి దోహదం చేస్తుంది. మనం రోజంతా తినే ఆహారాల్లో బ్రేక్​ఫాస్ట్​ అనేది చాలా ముఖ్యం. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపుకు ఉదయాన్నే మనం సరైన పోషక విలువలు ఉన్న ఫుడ్​ను అందించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఇప్పటికీ చాలామంది ఉదయాన్నే అన్నం తింటుంటారు. సమయం లేకనో లేదా అలవాటు లేకనో ఉదయాన్నే అన్నం, కూర వండేసి కాస్త లంచ్​ బాక్సులో, ఇంకాస్త బ్రేక్​ఫాస్ట్​గా తినేసి పనులకు వెళ్తుంటారు. మరి అలా ఉదయాన్నే అన్నం తినడం మంచిదేనా? లేక అల్పాహారంగా అటుకులతో చేసిన పోహా లేదా ఉప్మా తినడం బెటరా?

వాస్తవానికి అన్నం బియ్యంతోనే చేస్తారు. మనం పోహాకు ఉపయోగించే అటుకులు కూడా బియ్యంతోనే తయారు చేస్తారు. కానీ రెండింటి పోషక విలువలు వేరు వేరుగా ఉంటాయట. మరి అన్నం, పోహా (అటుకుల ఉప్మా) రెండింటిలో ఎందులో ఎక్కువ పోషకాలుంటాయి? ఉదయాన్నే ఏది తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పోహా పోషక విలువలు!
Poha Health Benefits : 100గ్రాముల పోహాలో 70గ్రాముల ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయట. అందుకే చాలామంది ఆరోగ్య ప్రియులు, బరువు తగ్గాలనుకునేవారు పోహాకు ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. ఇది కేవలం పోషకాలతో కూడిన ఆహారం మాత్రమే కాదు దీనిని తినడం వల్ల కడుపుకు తృప్తిగా ఉంటుందట.

అన్నంలో
అన్నం విషయానికొస్తే ప్రస్తుతం బియ్యం పాలీష్​ చేసి అమ్ముతున్నారు. అలాగే దీంట్లో ఆర్సెనిక్​ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 'కన్స్యూమర్​ రిపోర్ట్స్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ఆర్సెనిక్​ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం, నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయట.

అన్నంతో పోలిస్తే పోహా ఎందుకు మంచిది?

గ్లూటెన్
అన్నంతో పోలీస్తే పోహా ఆరోగ్యకరమైన ఎంపికగా డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పోహాలో చక్కెర శాతం ఉండదు. అలాగే దీని తయారీలో మనం ఉపయోగించే కూరగాయలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. నూనె కూడా పోహా తయారీకి తక్కువ పడుతుంది. పోహాలో గ్లూటెన్​ తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

ఇనుము
బియ్యాన్ని అటుకులుగా మార్చే క్రమంలో బియ్యంలో సహజంగా ఉండే ఐరన్​ కంటెంట్​ పెరుగుతుంది. రక్తహీనత, ఐరన్​ లోపం ఉన్నవారికి పోహా మంచి ఆహారం.

ఫైబర్​
అన్నంతో పోలిస్తే పోహా తేలికగా అనిపిస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. దీంట్లో కేలరీలు కూడా తక్కువ ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే చక్కగా పోహాను తీనేయవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్​
పోహాలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు మొదలైన కూరగాయలు ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సూక్ష్మపోషకాలు లాంటి అద్భుతమైన మూలాలు ఉంటాయి.

మొత్తం మీద అన్నంతో పోలిస్తే ఉదయాన్నే చక్కగా పోహా తయారు చేసుకని శరీరానికి విటమిన్-సీని అందించే నిమ్మకాయ రసాన్ని కాస్త చల్లుకుని తిన్నారంటే రోజంతా ఉల్లాసంగా, శక్తిమంతంగా ఉండవచ్చన్నమాట.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్వీట్​ తింటే దాహం వేస్తుందా? డీహైడ్రేట్​ అయ్యే ఛాన్స్​! ఇలా చేస్తే అంతా సెట్​ - Feel Thirsty After Eating Sweet

ఎండా కాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు రావాలంటే - ఇవి ఫ్రిజ్​లో పెట్టాలి - అవి బయట పెట్టాలి! - Tips For Vegetables Fruits Fresh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.