Do Not Eat Onions for Month What Happens in Your Body? : ఉల్లిపాయను మీ డైట్లో ఒక నెల పాటు తీసుకోకపోతే.. మీ శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చంటున్నారు సీనియర్ డైటీషియన్ డాక్టర్ స్వాతి. అంతేకాదు.. పలు ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు : ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు అది చాలా అవసరం. అదే మీరు నెలపాటు ఉల్లిపాయలు తీసుకోకపోవడం కారణంగా బాడీలో ఫైబర్ కంటెంట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు డైటీషియన్ స్వాతి. ఫలితంగా మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చంటున్నారు.
2017లో "అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ"లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఉల్లిపాయలు తీసుకోకపోవడం వల్ల డైటరీ ఫైబర్ తక్కువగా లభిస్తుందని.. ఆ కారణంగా మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ Li-Qiang Wang పాల్గొన్నారు. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే ఉల్లి తినకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పవర్ తగ్గుతుంది : సాధారణంగా ఉల్లిపాయల్లో ఉండే అలిసిన్, క్వెర్సెటిన్.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఉల్లిపాయలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ స్వాతి. ఇది కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచవచ్చని చెబుతున్నారు.
అలర్ట్ : ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? - Onions Side Effects
పోషకాహార లోపం : ఉల్లిపాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటిని నెలపాటు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడవచ్చని డైటీయన్ స్వాతి చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది : మీరు ఉల్లిపాయలను నెల రోజులు తీసుకోకపోవడం వల్ల శరీరంలో మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు సి, బి6, ఫోలేట్ లోపాలను కలిగిస్తుందంటున్నారు. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి, పెరిగిన అలసట, ఎర్ర రక్త కణాల నిర్మాణం వంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని పోషకాహార నిపుణురాలు స్వాతి సూచిస్తున్నారు. అంతేకాదు.. మీరు ఉల్లిపాయలు తీసుకోకపోవడం వల్ల అందులో ఉండే మరికొన్ని పోషకాలు అందక మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి రావొచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తెల్ల ఉల్లి Vs ఎర్ర ఉల్లిగడ్డలు - ఈ రెండిట్లో ఏవి మంచివో మీరు తెలుసుకోవాల్సిందే!