Onion Juice Benefits for Hair: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఉల్లి.. జుట్టుకూ చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. కెరాటిన్, విటమిన్ ఏ, బీ, సి, ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి. ఇలాంటి ఉల్లి రసం.. జుట్టుకు చేసే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
జుట్టు ఆరోగ్యం: షాంపూలు, కండిషనర్లు, హెయిర్ సీరమ్‌లతో సహా అన్ని జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉల్లిపాయ ఒక ముఖ్యమైన భాగం. ఉల్లిపాయ నీరు లేదా రసం.. జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, చుండ్రును తగ్గించడానికి, జుట్టు రాలడం అపడానికి చక్కగా పనిచేస్తుందట.
పచ్చి ఉల్లిపాయ తింటున్నారా - ఏమవుతుందో తెలుసా?
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తోంది: ఉల్లిపాయ రసం జుట్టుకు సల్ఫర్ సరఫరా చేస్తుంది. దీనివల్ల జుట్టు బలంగా తయారవుతుంది. రాలిపోవడం ఆగుతుంది. ఉల్లిపాయల్లోని సల్ఫర్ కొల్లాజెన్ ఏర్పడటాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కొల్లాజెన్ ఆరోగ్యకరమైన చర్మ కణాలు, జుట్టు ఏర్పడటానికి సహకరిస్తుంది.
హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది: ఉల్లిపాయ రసంలోని పోషకాలు జుట్టుకు లోతు నుంచి పోషణనిస్తాయి. తద్వారా జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అనేక షాంపూలు ఉల్లిపాయ రసాన్ని కలిగి ఉంటాయి. ఉల్లి రసం పొడి, చిట్లిన, దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేస్తాయి. జుట్టు కుదుళ్లను తిరిగి ఆరోగ్యంగా చేయడంతోపాటు తలపై ఉన్న మలినాలు, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
షైనింగ్: ఆనియన్ వాటర్‌తో మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే.. ఇది మీ జుట్టుకు మెరుపును ఇస్తుంది. వెంట్రుకలకు పోషణ, తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఉల్లిపాయ తొక్కతో అధిక బరువు, బీపీ సమస్యలకు చెక్! ఈ చిట్కాలు మీకోసమే
ఉల్లిపాయ రసం తయారు చేయడం ఎలా:
- ముందుగా రెండు లేదా మూడు ఉల్లిపాయలను పొట్టు తీసి శుభ్రంగా కడగాలి.
- తడి లేకుండా తుడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
- ఇప్పుడు దానిని వడగట్టి.. రసాన్ని వేరు చేయాలి. అంతే ఉల్లిపాయ రసం రెడీ.
పరిశోధనలు- వివరాలు:
- 2002లో Journal of Dermatology and Venereologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని నివారించడంలో సమర్థవంతంగా పని చేసిందని తేలింది.
- 2007లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన అధ్యయనం.. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సాయపడిందని పేర్కొంది.
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఎలా అప్లై చేయాలి:
- ఉల్లిపాయ జ్యూస్: ఉల్లిపాయ రసాన్ని తలకు రాసి 30 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి.
- ఉల్లిపాయ నీరు హెయిర్ మాస్క్: ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనె, తేనె లేదా పెరుగుతో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించండి. 30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి.
కండరాల నొప్పులు బాధిస్తున్నాయా? ఉల్లిపొట్టుతో చెక్ పెట్టండి!