ETV Bharat / health

నూడుల్స్ తరచుగా తింటున్నారా? వెంటనే ఆపేయండి! లేకుంటే ఏమవుతుందో తెలుసా? - Noodles Health Effects

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 3:39 PM IST

Updated : Jul 22, 2024, 4:54 PM IST

Noodles Health Effects : మన బిజీలైఫ్​కు తగిన విధంగా, పిల్లలు కోరుకునే రుచికి తగ్గట్లుగా చిటికెలో రెడీ అయిపోయి ఆకలిని మాయం చేస్తాయి నూడుల్స్. ఇవంటే మీకు ఎంత ఇష్టమున్నప్పటికీ వీటిని తినడం వెంటనే మానేయాలి!. ఎందుకో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Noodles Health Effects
Noodles Health Effects (Getty Images)

Noodles Health Effects : సమయం లేదు, క్షణాల్లో స్నాక్స్ లేదా బ్రేక్ ఫాస్ట్ కావాలంటే చటుక్కున గుర్తొచ్చేది నూడుల్స్. చకచకా ప్యాకెట్ ఓపెన్ చేసి వేడినీళ్లలో వేసి చిటికెలో రెడీ చేసుకునే వంటకం. పైగా దీని రుచికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే మన డైలీ లైఫ్‌లో నూడుల్స్ వాడకం పెరిగిపోయింది. ఇవంటే పడిచచ్చే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ నూడుల్స్ తినడం వెంటనే ఆపేయాలని చెబుతున్నారు నిపుణులు. నూడుల్స్​లో ఉండే హై లెవల్ సోడియం, కెమికల్స్, అనారోగ్యకరమైన మిశ్రమాలు పలు సమస్యలకు దారి తీస్తాయి. ఫలితంగా హైబీపీ, గుండె జబ్బులు, మెటబాలిజంలో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

పోషకాహార లోపం
నూడుల్స్​లో పోషకాలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో అస్సలు దొరకవు. పైగా ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, అనారోగ్యాన్ని కలిగించే కొవ్వులు ఉండి శరీరం బరువు పెరిగేందుకు కారణమవుతుంటాయి. నూడుల్స్​ను రెగ్యూలర్‌గా తీసుకునే వారిలో పోషకాహార లోపం కచ్చితంగా కనిపిస్తుంది.

బరువు పెరగడం
నూడుల్స్​లో టేస్ట్ మరింతగా అనిపించేందుకు మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. ఇది వాడటం వల్ల తలనొప్పి, వికారం, బరువు పెరగడం, హైబీపీ వంటి సమస్యలుంటాయట. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైబీపీ ఉన్న వాళ్లకు డేంజర్
శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే వాటిల్లో సోడియం ఒకటి. అది ఈ న్యూడిల్స్‌లో ఎక్కువ మోతాదులో ఉంటుందట. అలా సోడియం ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు నూడుల్స్​ తినడం తక్షణమే మానేయాలని చెబుతున్నారు.

మైదాతో తయారీ
నూడుల్స్​ను తయారు చేసేందుకు వాడే పదార్థాలలో ప్రధానమైనది మైదా పిండి. అధికంగా ప్రాసెస్ చేసిన పిండినే దీనికి వినియోగిస్తారు. తృణధాన్యాలతో పోలిస్తే డైటరీ ఫైబర్, పోషకాలు మైదాలో చాలా తక్కువ. ఫలితంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది మితిమీరితే షుగర్ సమస్యలు, ఇన్సులిన్ లెవల్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

ఆరోగ్యానికి ప్రమాదం
నూడుల్స్​ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదముందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. దీని వాడకం మెటబాలిక్ సిండ్రోమ్​కు దారి తీస్తుంది. దాంతో హైబీపీ, హై బ్లడ్ షుగర్ (డయాబెటిస్), నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ లెవల్స్​లో అసమతుల్యతలకు దారి తీస్తుంది. ఒకానొక స్టడీలో ఈ నూడుల్స్​లో శరీరానికి అవసరమైన విటమిన్ డీ కూడా తక్కువ మొత్తంలో దొరుకుతుందని తేలింది. విటమిన్ డీ తగ్గితే రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్ గా లోపిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్
నూడుల్స్​ను ఎక్కువ శాతం పామాయిల్‌తోనే ఫ్రై చేస్తుంటారు. ఫలితంగా హై సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండి చెడు కొలెస్ట్రాల్ పెరిగేందుకు దారి తీస్తుంది. ఈ కొవ్వులు ఎక్కువై ఆథరోస్కెరోసిస్​కు కారణమవుతుంది. గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదముంది.

ప్రమాదకర మిశ్రమాలతో నిల్వలు
ఎక్కువ కాలం నిల్వ ఉండటం, రుచిగా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్‌ను కలుపుతారు. టెర్టియరీ బ్యూటైల్ హైడ్రోక్వినోన్, బ్యూటిలేటెడ్ హైడ్రోక్సియానిసోల్‌లు కలపడం వల్ల అదే వాసన, రుచి అనిపిస్తుంది. ఈ కెమికల్స్ చిన్నపాటి పరిమాణంలో తీసుకుంటే తప్పేమీ లేదు కానీ, రెగ్యూలర్‌గా తీసుకుంటేనే అసలు సమస్య. అలా ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల న్యూరోలాజికల్ డ్యామేజ్, లింఫోమా, లివర్ సమస్యలు కలుగుతాయని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

దోమలు మిమ్మల్ని మాత్రమే కుడుతున్నాయా? అందుకు కారణాలు, తప్పించుకునే చిట్కాలు ఇవిగో! - Mosquito Bites Protection

కొవిడ్ సోకిన చిన్న పిల్లల్లో టైప్-1 షుగర్​ లక్షణాలు! - COVID 19 Type 1 Diabetes

Last Updated : Jul 22, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.