Natural Ways To Prevent Kitchen Sink Clogs : నీళ్లు పోకుండా సింక్ జామ్ అవ్వడమనే ప్రాబ్లమ్‌ను.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తుంటారు. అయితే.. నేచురల్ టిప్స్‌తో సింక్ బ్లాకింగ్ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడవచ్చంటున్నారు నిపుణులు. అలాగే సింక్ నుంచి వచ్చే దుర్వాసనలు ఇట్టే తొలగిపోతాయంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ, ఈనో :
ఈ మిశ్రమం సింక్‌ను శుభ్రపరచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్‌లో కాస్త ఈనో పౌడర్ తీసుకొని అందులో నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని సింక్‌లో వేసి స్క్రబ్బర్ సహాయంతో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. అంతే.. సింక్‌లోని దుమ్ము, జిడ్డు మరకలన్నీ తొలగిపోయి కొత్తదానిలా మెరుస్తుందంటున్నారు నిపుణులు. అలాగే దుర్వాసన తొలగిపోతుందంటున్నారు.
వేడి నీళ్లు :
సింక్ పైపులో ఇరుక్కుపోయిన వేస్ట్ మొత్తాన్ని వేడి నీళ్లతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ఒక పెద్ద గిన్నెలో నీటిని వేడి చేసుకోవాలి. తర్వాత జాగ్రత్తగా కొద్దిగా నీటిని తీసుకొని సింక్‌లో పోయాలి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయడం వల్ల సింక్ పైపులో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వేడి నీళ్లను పోయడం వల్ల జిడ్డు కూడా తొలగిపోయి సింక్ శుభ్రంగా కనిపిస్తుందంటున్నారు.
స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!
నిమ్మకాయ, ఉప్పు :
సింక్‌లో వాటర్ పోకుండా జామ్ అయినప్పుడు దుర్వాసన వస్తుంది. అలాంటి టైమ్‌లో ఉప్పు, నిమ్మరసం మిశ్రమం చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్‌లో కాస్త ఉప్పు వేసుకొని అందులో నిమ్మరసం పిండుకోవాలి. ఆపై దాన్ని సింక్‌లో పోసి నైట్ అంతా అలాగే ఉంచాలి. అవసరమైతే దీనికి కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్ట్ డే మార్నింగ్ వాటర్‌తో క్లీన్ చేస్తే.. సింక్ కొత్తదానిలా తళతళా మెరుస్తుంది. దుర్వాసన కూడా పోయి మంచి స్మెల్ వస్తుందంటున్నారు నిపుణులు.
2019లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిమ్మరసం కిచెన్ సింక్‌లో పేరుకుపోయే సాల్మొనెల్లా, E. coli వంటి హానికరమైన బ్యాక్టీరియాను చంపి పరిశుభ్రంగా ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA)లో ఫుడ్ మైక్రోబయాలజీస్ట్ 'డాక్టర్ జాన్ స్మిత్' పాల్గొన్నారు. నిమ్మరసంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సింక్‌లోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను పోగొట్టడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మెటల్ వైరు :
సింక్ జామ్ అయినప్పుడు ఒక కఠినమైన మెటల్ వైరు ద్వారా ఈజీగా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఆ మెటల్ వైరును సింక్ హోల్ ద్వారా పైపులోకి పంపించండి. ఆపై దాన్ని పైకి, కిందకు కదిలిస్తూ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిపోయేలా ప్రయత్నించండి. అంతే.. వ్యర్థాలు ఈజీగా బయటకిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్ :
ఇలా చేయడం ద్వారా సింక్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఓ కప్పు వాటర్‌లో సగం కప్పు బేకింగ్ సోడా, సగం కప్పు వెనిగర్‌ను పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని సింక్‌లో పోయాలి. పావుగంట తర్వాత మళ్లీ అందులో వేడి నీటిని పోయాలి. ఇలా రెండు మూడు సార్లు వేడి నీటిని సింక్‌లో పోసుకోవాలి. అంతే.. సింక్ పైపులో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా సింక్‌ని శుభ్రం చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ఈ చిట్కాలు ట్రై చేయండి!
ఇవి కూడా చదవండి :
మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే స్మెల్ పరార్!