ETV Bharat / health

పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయా? - ఈ సింపిల్​ టిప్స్​ పాటిస్తే నొప్పి లేకుండా మాయం! - How to Get Rid of Warts Naturally - HOW TO GET RID OF WARTS NATURALLY

Natural Tips to Remove Warts: మీకు పులిపిర్లు ఉన్నాయా? వాటి కారణంగా నలుగురులోకి వెళ్లాలంటే ఇబ్బందిపడుతున్నారా? డోంట్​ వర్రీ.. ఈ టిప్స్​ పాటిస్తే ఎటువంటి నొప్పి లేకుండా సహజంగానే పులిపిర్లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ టిప్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Natural Tips to Remove Warts
How to Get Rid of Warts Naturally (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:07 PM IST

How to Get Rid of Warts Naturally: పులిపిర్లు.. ప్రస్తుత కాలంలో వీటితో ఇబ్బంది పడుతున్నా వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మెడ, ముఖం, వీపు, చేతులు.. ఇలా శరీర భాగాల్లో ఇవి పెరుగుతుంటాయి. అయితే వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా.. అందాన్ని దెబ్బతీస్తుంటాయి. కొద్దిమంది శరీరంపై పులిపిర్లు ఎక్కువగా ఏర్పడటం వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయి.. నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంటారు. వీటిని తొలిగించుకోవడానికి ఎన్నో రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కానీ ఫలితం ఉండదు. అలాంటి వారు నేచురల్​గానే వీటిని తొలగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పులిపిర్లు ఎందుకు ఏర్పడుతాయి ?: పులిపిర్లు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వల్ల వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్‌ శరీరంలోకి చేరిన తర్వాత అదనపు కణాలు పెరిగేలా చేస్తుందంటున్నారు. కొంత మందిలో పులిపిర్లు చిన్నగా ఏర్పడితే.. ఇంకొంత మందిలో కొద్దిగా పెద్దగా ఉంటాయంటున్నారు.

పులిపిర్లు తొలగించుకోవడానికి టిప్స్​:

ఆపిల్ సైడర్ వెనిగర్: పులిపిర్లు తొలగించుకునేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ బెస్ట్​ హోమ్​ రెమిడీ అని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక కాటన్​ బాల్​ను తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్​లో ముంచి.. దానిని పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయమంటున్నారు. ఆ తర్వాత ఒక బ్యాండేజ్​తో కవర్ చేసి దానిని రాత్రిపూట వదిలేసి.. ఉదయం తీసేయమంటున్నారు. ఇలా కొన్ని రోజుల పాటు ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే పులిపిర్లు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

అల్లం: అల్లంతో పులిపిర్లను మాయం చేసుకోవచ్చని మీకు తెలుసా ? నిజమే. అది ఎలా అంటే.. ముందుగా ఒక అల్లం ముక్కను తీసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని చర్మంపై ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు అల్లం పేస్ట్‌ను పులిపిర్ల దగ్గర పెట్టుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే అవి రాలిపోతాయని నిపుణులంటున్నారు.

2022లో ప్రచురించిన 'Journal of Complementary and Integrative Medicine' ప్రకారం.. పులిపిర్లతో బాధపడుతున్న వారు అల్లం పేస్ట్‌ను రోజుకి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల వాటి పరిమాణం, సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్​ డాక్టర్ సాల్వటోర్ లియో పాల్గొన్నారు. దాదాపు 60కి పైగా రిపోర్టులు, క్లినికల్​ ట్రయల్స్​, చికిత్స విధానాలు, ప్రయోగాలు అనంతరం ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత.. ఈ నివేదికను ప్రచురించినట్టు డాక్టర్​ లియో పేర్కొన్నారు.

టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్​.. ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు అంటున్నారు. వీటిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు.. పులిపిర్లను తొలగించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇందుకోసం టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలను పులిపిర్లుకు అప్లై చేసి ఒక బ్యాండేజ్​తో కవర్ చేయండి. ఇదే విధానాన్ని కొన్ని రోజుల పాటు రోజుకు రెండు సార్లు ఫాలో అయితే తొందర్లోనే అవి రాలిపోతాయని అంటున్నారు.

ముఖం, మెడమీద పులిపిర్లు ఇబ్బందిగా ఉన్నాయా - ఈ సింపుల్​ చిట్కాలతో క్లియర్ చేసేయండి!

వెల్లుల్లి: వెల్లుల్లిలో సహజమైన యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని.. ఇవి పులిపిర్లలను తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఒక వెల్లుల్లి రెబ్బ, లవంగాన్ని మెత్తగా చేసి పులిపిర్లకు అప్లై చేసి దానిని బ్యాండేజ్​తో కవర్​ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

అరటి తొక్క: అరటి తొక్కలో పులిపిర్లను కరిగించడంలో సహాయపడే ఎంజైమ్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం అరటి తొక్కను చిన్న ముక్కగా కత్తిరించి పులిపిర్లు మీద ఉంచి దానిని ఓ పట్టీతో కవర్​ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తీసివేయాలి. ఇలా పులిపిర్లు తొలగిపోయే వరకు ప్రతిరోజూ ఈ పని చేస్తే మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ కూడా చదవండి:

జలుబు చేసినప్పుడు ముక్కు కారడం ఆగట్లేదా? - ఇలా చేశారంటే బిగ్ రిలీఫ్!

ఉదయం కాకుండా రాత్రి పూట జుట్టుకు నూనె పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.