ETV Bharat / health

నేచురల్​ హెయిర్​ ఆయిల్స్​తో ఎన్నో ఉపయోగాలు- ఒత్తైన జుట్టు, డాండ్రఫ్ ఫ్రీ పక్కా! - Hair Growth Natural Oils - HAIR GROWTH NATURAL OILS

Natural Oils For Hair Growth : మార్కెట్లో దొరికే కృత్రిమ మందులకు బై బై చెప్పేసి సహజమైన నూనెలు వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చక్కటి పొడవైన శిరోజాలు పెరిగేలా చేసే ఆ నూనెల గురించి మీకు తెలుసా?

Hair Growth Natural Oils
Hair Growth Natural Oils (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:59 AM IST

Natural Oils For Hair Growth : జుట్టు అనేది ఉంటే ఏ కొప్పు (హెయిర్ స్టైల్) అయినా పెట్టుకోవచ్చు అన్నట్లు ముందు జుట్టే కదా ఇంపార్టెంట్. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైపైన షైనింగ్ వచ్చేలా ఏవో ఒక క్రీములు వాడేస్తే సరిపోదు. వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా ఉంటేనే కేశారోగ్యం మెరుగవుతుంది. ఇది కేవలం చక్కటి నాణ్యమైన నూనెతో రోజూ మసాజ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. జుట్టు ఒత్తుగా, డాండ్రఫ్ రహితంగా ఉంచే ఆ నూనెలేంటో తెలుసుకుందాం.

రోజ్‌మేరీ ఆయిల్
జుట్టు ఒత్తుగా కనిపించాలని మీరు అనుకుంటే మీకు కరెక్ట్ ఛాయీస్ రోజ్‌మేరీ ఆయిల్. కణాల ఉత్పత్తిని మెరుగుచేసేందుకు బాగా సహాయపడుతుంది.

లావెండర్ ఆయిల్
జుట్టు త్వరగా ఎదగడంలో లావెండర్ ఆయిల్ బాగా తోడ్పడుతుంది. కణాల ఉత్పత్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబయాల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలతో కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పుదీనా నూనె
ఈ నూనె మనకు తలలో చల్లని ఫీలింగ్‌ను కలిగిస్తుంది. రోజూ రాసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల రక్త సరఫరా బాగా జరిగి వెంట్రుకలు బాగా ఎదిగేందుకు సహాయపడుతుంది.

లెమన్‌గ్రాస్ ఆయిల్
డాండ్రాఫ్​ను తగ్గించి, జుట్టు పొడుగ్గా ఎదిగేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక బెస్ట్ ఆప్షన్. కుదుళ్లలో జిడ్డును తగ్గించి జుట్టు ఒత్తుగా ఎదిగేందుకు సహాయపడుతుంది.

టీ ట్రీ ఆయిల్
చాలా తలనూనెల్లో దొరికే కామన్ ఎలిమెంట్ అయిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ గుణాలు కలిగి ఉంటుంది. కుదుళ్లను శుభ్రం చేసి వెంట్రుకల ఎదుగుదలకు సహకరిస్తుంది. జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.

సీడర్ వుడ్ ఆయిల్
జుట్టు ఎదగడానికి సహకరించడమే కాకుండా జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. కేశ రంధ్రాల్లో చొచ్చుకుపోయి జుట్టుకు బలం చేకూరుస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉండడంతో డాండ్రఫ్ ఉందనే పరిస్థితే రాకుండా చేస్తుంది.

క్లారీ సాగె ఆయిల్
ఇందులో ఉండే లినాలిల్ ఎసిటేట్ అనే గుణం జుట్టులో నాణ్యతను పెంచుతుంది. వెంట్రుకలు పొడుగ్గా ఎదిగేందుకు తోడ్పడుతుంది. జుట్టుకు బలం చేకూర్చి తెగిపోకుండా కాపాడుతుంది.

తైమ్ ఆయిల్
కుదుళ్ల ఆరోగ్యం మెరుగు చేసి, వెంట్రుకలు ఎదిగేందుకు తోడ్పడుతుంది. జుట్టు ఊడిపోయే సమస్య అయిన అలొపేసియా ఎరియాట నుంచి కూడా కాపాడుతుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.