ETV Bharat / health

డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్‌ లేకుండానే మెరిసిపోవచ్చు! - natural face mask for glowing skin - NATURAL FACE MASK FOR GLOWING SKIN

Natural Facials For Beautiful Skin : ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా మెరుస్తూ ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం డైలీ రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌వాష్‌లను వాడుతుంటారు. అయితే, ఇవేమి లేకుండా.. కేవలం వంటగదిలో లభించే కొన్ని పదార్ధాలతో ఫేస్​ప్యాక్​లు ట్రై చేస్తే సూపర్​ రిజల్ట్​ గ్యారెంటీ అంటున్నారు నిపుణులు.

Beautiful Skin
Natural Facials For Beautiful Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 12:15 PM IST

Natural Facials For Beautiful Skin : అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. అందుకోసం రోజూ ఎన్నో రకాల కాస్మెటిక్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అలాగే బ్యూటీపార్లర్‌లకు వెళ్లి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటుంటారు. అయితే, ఇలా ముఖానికి మేకప్‌లు, ఫేషియల్‌లు ఎన్ని సార్లు చేసుకున్న సరే.. ఆ అందం ఎక్కువ రోజులు ఉండదు. పైగా కొందరిలో తరచుగా మేకప్‌ వేసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా నిపుణులు కొన్నిఫేస్‌ప్యాక్స్ ట్రై చేయమని సూచిస్తున్నారు. వీటి కోసం అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేవలం కిచెన్​ లభించే కొన్ని పదార్థాలతో అందంగా మారొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫేస్‌ప్యాక్స్ ఏంటో చూసేద్దామా ?

గుమ్మడిపండుతో ఫేస్‌ప్యాక్‌ :

కావాల్సినవి :

  • బాగా పండిన గుమ్మడి పండు గుజ్జు - 2 టేబుల్‌ స్పూన్‌లు
  • తేనె - అర చెంచా
  • పాలు - అర చెంచా
  • దాల్చినచెక్క పొడి - పావు చెంచా

తయారీ విధానం : బాగా పండిన గుమ్మడి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి తేనె, పాలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్‌ చేయాలి.

ఫేషియల్ ఇలా :

  • ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని కొద్దిసేపు ఆరనివ్వాలి.
  • తర్వాత గుమ్మడిపండు మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి.
  • ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. చల్లని నీళ్లతో క్లీన్‌ చేసుకుని మెత్తటి క్లాత్​తో తుడుచుకోవాలి.
  • ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ ఫేస్‌ప్యాక్‌ను ట్రై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. ఇంకా చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. గుమ్మడి పండులో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

2014లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొటిమల సమస్యతో బాధపడేవారు గుమ్మడిపండు గుజ్జును ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల.. సమస్య తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని "దిల్లీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌"లో పనిచేసే డాక్టర్. సునీల్ కుమార్ పాల్గొన్నారు. మొటిమలతో బాధపడేవారు వారు గుమ్మడిపండు గుజ్జును అప్లై చేసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్‌ :

కావాల్సినవి:

  • కోడిగుడ్డు - ఒకటి
  • నిమ్మరసం - ఒక చెంచా
  • పెరుగు - ఒక చెంచా

తయారీ విధానం : ఫస్ట్‌ గుడ్డులోని తెల్ల సొనను వేరు చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా ట్రై చేయండి!

  • ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి.
  • తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
  • ఇప్పుడు గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
  • ఇలా ఒక వారం రోజుల పాటు ఈ ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కోమలంగా తయారవుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ఈస్ట్ పౌడర్‌ ఫేస్​ప్యాక్​ :

కావాల్సినవి:

  • కోడిగుడ్డు - ఒకటి
  • ఈస్ట్ పౌడర్ - రెండు చెంచాలు
  • కలబంద గుజ్జు - ఒక చెంచా

తయారీ విధానం : ముందుగా ఎగ్‌లోని తెల్లసొనను ఒక బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో ఈస్ట్ పౌడర్, కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్‌ చేయాలి.

ఫేషియల్ ఇలా అప్లై చేసుకోండి!

  • ఫేస్‌ను శుభ్రం చేసుకున్న తర్వాత ఆరనివ్వాలి.
  • ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 30 నిమిషాలు ఆరనివ్వాలి.
  • తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
  • ఇలా డైలీ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ముఖం మృదువుగా, కాంతివంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోడిగుడ్డును ఇలా అప్లై చేస్తే - జుట్టు సమస్యలన్నీ పరార్ - హెల్దీ హెయిర్ గ్యారెంటీ! - Egg Masks for Hair Growth

ఓట్స్‌తో బెస్ట్‌ ఫేస్‌ప్యాక్‌ :

కావాల్సిన పదార్థాలు :

  • ఓట్స్ పొడి - ఒక చెంచా
  • మీగడ లేని పెరుగు - మూడు చెంచాలు
  • తేనె - ఒక చెంచా

తయారీ విధానం : ముందుగా ఓ గిన్నెలోకి ఓట్స్‌ పొడి తీసుకుని అందులోకి పెరుగు, తేనె వేసి బాగా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా!

  • ముఖానికి ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌ రాసుకుని ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి.
  • తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
  • ఈ ఓట్స్‌ ప్యాక్‌ వల్ల చర్మానికి మృదుత్వం, తాజాదనం వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా! - Best Oils for Double Hair Growth

సమ్మర్​లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? - ఈ టిప్స్​తో తొలగించుకోవడం వెరీ ఈజీ! - Dark Circles Under Eyes Remove Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.