ETV Bharat / health

మునగ గింజల నూనెతో ఇలా ట్రై చేయండి- చుండ్రు, చర్మ సమస్యలు పరార్ అవ్వడం ఖాయం..! - Health Benefits Of Moringa Oil

Health Benefits Of Moringa Oil : దృఢమైన కురులు, నిగనిగలాడే చర్మాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మునగ నూనె ఉపయోగించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ నూనె మీ కురుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటుగా మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఆవిషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Moringa Oil
Moringa Oil (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 23, 2024, 9:40 AM IST

Updated : Sep 23, 2024, 10:01 AM IST

Health Benefits Of Moringa Oil : మునక్కాయలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, వాటి గింజల ద్వారా వచ్చే నూనెలో సైతం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. వీటి గింజలను ఎండబెట్టి, అనంతరం వాటి నుంచి తీసిన మునగ నూనె ఉపయోగించడం ద్వారా అటు ఆరోగ్య, సౌందర్యపరంగా కూడా ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగ నూనె చర్మంపై రాసుకోవడం వలన తేమ అందడంతో పాటు కాలుష్యం కోరల్లో చిక్కుకొని పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఈ మునగ నూనె రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంటున్నారు. ఫలితంగా చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

పొడి చర్మానికి తేమ
పొడిచర్మతత్వం ఉన్నవారికి మునగ నూనె ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేరుగా చర్మం లోపలి పొరల్లోకి ఇంకి పొడిబారిపోవడం, పొలుసుల్లా రాలిపోవడం లాంటి సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. అలాగని జిడ్డుగా కూడా అనిపించదు. అలాగే పగిలిన పెదవులకు కూడా దీన్ని అప్త్లె చేసుకుంటే అవి తిరిగి మృదువుగా మారతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, మినరల్స్ చర్మానికి తగినంత తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయంటున్నారు నిపుణులు.

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా
మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. తద్వారా చర్మం నవయవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే ఇందులోని విటమిన్ 'సి' కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుందంటున్నారు. కాబట్టి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు, ఒకవేళ ముఖంపై సన్నటి గీతలుంటే అది కూడా తగ్గుముఖం పట్టి తాజాగా, అందంగా కనిపించే చర్మం సొంతమవుతుందంటున్నారు. స్నానం చేసిన తర్వాత ఈ నూనెతో చర్మానికి మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పగటి పూట ఇబ్బంది అనుకునేవారు రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా ఈ నూనెను చర్మానికి రాసుకోవచ్చని సూచిస్తున్నారు.

మచ్చలు తగ్గడానికి
మునగ నూనెలో విటమిన్ 'సి', 'ఇ' పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేందుకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే చర్మంపై ఉండే నల్లమచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలకు చక్కని పరిష్కారంగా మునగ నూనె ఉపయోగించవచ్చంటున్నారు. అలాగే ఈ నూనెలో ఉండేటువంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాల ద్వారా చర్మంపై కాలిన మచ్చలు, గాయాల వంటివి తొందరగా నయమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

దృఢమైన కురులు కోసం
మునగ నూనె కేవలం చర్మానికే కాదు.. కురులకు కూడా తగినంత తేమని అందిస్తుంది. ఇందుకోసం కాస్త మునగ నూనె తీసుకొని జుట్టు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లలోకి చేరేలా మృదువుగా మర్దన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నూనెని తరచూ ఉపయోగించడం వల్ల దృఢమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే చుండ్రు, చిట్లిన చివర్లు లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు
మునగ నూనెని ఫేషియల్ క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల ఇది ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుందంటున్నారు. దీన్ని హెయిర్ సీరమ్‌గా కూడా వినియోగించవచ్చుని నిపుణులు సూచిస్తున్నారు. NLM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉదయం కాకుండా రాత్రి పూట జుట్టుకు నూనె పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి? - Benefits of Oiling Hair At Night

జుట్టు సమస్యలకు గుడ్డు- ఇలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ బంద్ గ్యారెంటీ! - Egg Hair Mask

Last Updated : Sep 23, 2024, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.