ETV Bharat / health

పొలం వెళ్లే మహిళ నుంచి ఆఫీసు కెళ్లే వారి వరకు - ఈ కప్ ఎంతో మేలు చేస్తుంది! - శానీటరీ ప్యాడ్స్​కు గుడ్​బై చెప్పండి! - Menstrual Cup Benefits

Menstrual Cup: ఈ రోజుల్లో నెలసరి కోసం మహిళలంతా ప్యాడ్స్ వినియోగిస్తుంటారు. లీకేజీ నుంచి సేఫ్​గా ఉండొచ్చనే కారణంతో అందరూ వీటినే వాడుతుంటారు. కానీ.. ఇవి ఆరోగ్యానికీ, పర్యావరణానికీ హాని చేస్తాయని.. అందుకే మెన్​స్ట్రువల్​ కప్స్​ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు నిపుణులు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Menstrual Cup
Menstrual Cup (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 12:10 PM IST

Menstrual Cup Benefits: పీరియడ్స్​.. 14 సంవత్సరాల బాలిక నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. ఇక నెలసరి అనగానే చాలా మందికి ప్యాడ్లే గుర్తొస్తాయి. కారణం.. పీరియడ్స్​ టైంలో లీకేజీ నుంచి సేఫ్​గా ఉండొచ్చనే భావన. అయితే ఇది అప్పటివరకు సేఫ్​గానే ఉన్నా.. దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే శానీటరీ ప్యాడ్స్​కు గుడ్​బై చెప్పి.. పీరియడ్స్​ టైంలో మెన్​స్ట్రువల్ కప్స్ ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు దీనిపై మహిళల్లో అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు శానీటరీ ప్యాడ్స్​ వాడటం వల్ల కలిగే నష్టాలు? మెన్​స్ట్రువల్​ కప్స్​ ఎందుకు ఉపయోగించాలి? అనే వాటిపై పూర్తి స్థాయిలో వివరణ అందిస్తున్నారు. మరి మనం కూడా ఈ కప్స్​ వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

శానీటరీ ప్యాడ్స్​ ఎందుకు వద్దు?:

  • సాధారణంగా ప్యాడ్స్​ను రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తుంటారు. వీటిని వాడటం వల్ల క్రమంగా అనేక సమస్యలు వస్తాయి. అదే మెన్​స్ట్రువల్​ కప్స్​ అయితే సిలికాన్​ మెటీరియల్​ ఉపయోగించి తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది.
  • ప్యాడ్స్ వినియోగిస్తే.. ఒకటి ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. అలా రోజులో ముడు నాలుగు మార్చాల్సి రావొచ్చు. వీటివల్ల ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికీ నష్టం కలుగుతుంది. అదే ఒక మెన్​స్ట్రువల్ కప్ కొనుగోలు చేస్తే.. అది ఏకంగా పదేళ్ల వరకూ పనిచేస్తుందని చెబుతున్నారు. అంటే ఒక మెన్​స్ట్రువల్ కప్ 2,500 శ్యానిటరీ ప్యాడ్స్​తో సమానం అన్నమాట. సో హెల్త్​ పరంగా కూడా నో టెన్షన్​.
  • శానీటరీ ప్యాడ్స్​ వాడితే లీకేజ్​ టెన్షన్​ ఉంటుంది. అదే మెన్​స్ట్రువల్​ కప్పు వినియోగిస్తే.. 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుందట. అలాగే.. మెన్​స్ట్రువల్ కప్​ని అమర్చుకున్నాక అసలు తాము నెలసరిలో ఉన్నామన్న భావనే కలగదని, అంత సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

పీరియడ్స్​ నొప్పుల కోసం మందులా? - వద్దే వద్దు - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!

  • ప్యాడ్స్​ యూజ్​ చేస్తూ ఏ పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఇక గ్రామాల్లో ఉండే మహిళలకైతే వీటి వల్ల ఇబ్బంది ఉంటుంది. అదే ఈ కప్​ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌.. ఇలా పొలాల్లో పనిచేస్తే మహిళల నుంచి ఆఫీసులో వర్క్​ చేసే మహిళల వరకు అందరికీ ఉపయోగపడుతుంది.
  • మీరు శానిటరీ ప్యాడ్స్ వాడితే.. బ్లీడింగ్‌ను బట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది రెండు గంటలకోసారి మార్చుకుంటే.. మరికొంతమందికి నాలుగు గంటలకు ఒకటి మారుస్తుంటారు. అయినప్పటికీ.. మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ మాదిరిగా పూర్తి రక్షణ ఇవ్వలేవంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కప్ క్వాలిటీ, వాడే విధానాన్ని బట్టి 6 నెలల నుంచి పది సంవత్సరాల వరకు యూజ్ అవుతాయని చెబుతున్నారు.

శానీటరీ ప్యాడ్స్​ ఉపయోగించడం వల్ల నష్టాలు:

చర్మం చికాకు: కొన్ని ప్యాడ్స్​లో ఉండే సుగంధ ద్రవ్యాలు, యాంటీబాక్టీరియల్ ఏజెంట్లు, డీయోడరెంట్లు చర్మం చికాకు, దద్దుర్లు, వాపుకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.

యోని ఇన్ఫెక్షన్స్​: కొన్ని పీరియడ్స్ ప్యాడ్స్​లోని రసాయనాలు యోని సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది ఫంగస్ లేదా బ్యాక్టీరియా సంక్రమణలకు దారితీస్తుందని.. తద్వారా పలు సమస్యలు వస్తాయంటున్నారు.

హార్మోన్ల అసమతుల్యత: కొన్ని పీరియడ్స్ ప్యాడ్స్​లో ఫ్థాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఫలితంగా, ఇర్​రెగ్యులర్​ పీరియడ్స్​, హెవీ బ్లీడింగ్​, మొటిమలు, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.

క్యాన్సర్: కొన్ని రకాల శానిటరీ ప్యాడ్స్​లో.. బ్లీచ్‌, డయాక్సిన్‌.. వంటి కెమికల్స్ యూజ్ చేస్తుంటారు. అవి పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

అమ్మాయిల్లో చిన్నతనంలోనే రజస్వల​ - అడ్డుకోకుంటే ప్రమాదమే!

మెన్​స్ట్రువల్ కప్స్‌తో ప్రయోజనాలు :

  • ఈ కప్స్‌ వెజైనాను పొడిబారేలా చేయవు. తద్వారా అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియా తొలగిపోకుండా ఉంటుంది. ఫలితంగా వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అరుదు అని చెబుతున్నారు నిపుణులు. 2018లో 'PLOS One' అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించే మహిళల్లో బ్యాక్టీరియల్ వజైనోసిస్ వంటి వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 40% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్త్ కరోలినాలోని 'డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్'కు చెందిన డాక్టర్ W. Seth పాల్గొన్నారు. ట్యాంపన్ల కంటే మెన్స్ట్రువల్ కప్స్ ఉపయోగించే మహిళల్లో బ్యాక్టీరియల్ వజైనోసిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
  • కొన్నిసార్లు ప్యాడ్స్ వాడే క్రమంలో రక్తం లీకవడం వల్ల దానికి గాలి తగిలి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే.. కప్స్‌ వాడితే ఆ సమస్య ఉండదంటున్నారు.
  • పీరియడ్స్ టైమ్​లో శ్యానిటరీ ప్యాడ్స్ ధరించడం వల్ల.. కూర్చోవడం, లేవడం, ఏదైనా కఠినమైన పని చేయడం కూడా అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ, అదే.. మెన్‌స్ట్రువల్‌ కప్‌ వల్ల అలాంటి అసౌకర్యం ఉండనే ఉండదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పీరియడ్స్​ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్​ పొందండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.