ETV Bharat / health

అలర్ట్ : పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ - ఇవి చెక్​ చేసుకోండి! - Lung Cancer Causes in Non Smokers - LUNG CANCER CAUSES IN NON SMOKERS

Lung Cancer Causes : ఊపిరితిత్తుల క్యాన్సర్​ అంటే.. పొగ తాగే వారికి మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. స్మోక్ చేయని వారికి కూడా ఈ వ్యాధి వస్తుందట! మరి.. అందుకు గల కారణాలేంటో చూడండి.

Lung Cancer
Lung Cancer Causes
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 2:29 PM IST

Lung Cancer Causes in Non Smokers : ప్రతిఏటా నమోదవుతున్న లంగ్ క్యాన్సర్(Lung Cancer) కేసుల్లో.. నాన్ స్మోకర్స్​ వాటా 15-25% వరకు ఉంటోందట! ఇది సాధారణ పర్సంటేజ్ కాదంటున్నారు నిపుణులు. అందులో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. మరి.. స్మోక్​ చేయని వారిలో లంగ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ : నాసెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే.. స్మోక్ చేసే వారి పక్కన ఉండి ఆ పొగను పీల్చడం. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా స్మోక్ చేస్తుంటే.. ఆ పొగ మనకు తెలియకుండానే గాలి ద్వారా మన ముక్కులోకి వెళ్తుంది. దాంతో.. మనం పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

2019లో "Journal of the National Cancer Institute" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కి గురైన పొగతాగని పురుషులలో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ లియాంగ్ జౌ పాల్గొన్నారు. నాన్ స్మోకర్స్..​ ధూమపానం చేసే వారితో కలిసి ఉండటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

వాయు కాలుష్యం : నగరాలలో పెరిగిన వాహనాల వాడకం, పారిశ్రామిక కార్యకలాపాలు, ఇతర వివిధ కాలుష్య కారకాల నుంచి వెలువడే సూక్ష్మ రేణువులను ఎక్కువకాలం పీల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందంటున్నారు నిపుణులు.

రాడాన్ ఎక్స్‌పోజర్ : ఎప్పుడూ స్మోక్ చేయనివారిలో రాడాన్ ఎక్స్​పోజర్ కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరగడానికి ప్రధాన ప్రమాద కారకంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. రాడాన్ అనేది నేల, రాళ్లలో ఉన్న యురేనియం క్షయం నుంచి వెలువడే రేడియోధార్మిక వాయువు. ఇది కనిపించదు. వాసన కూడా ఉండదు. దీన్ని మానవ క్యాన్సర్ కారకంగా.. 1988లో "ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్" (IARC) గుర్తించింది.

కుటుంబ చరిత్ర : ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వారసత్వంగా వచ్చే అవకాశం ఉందని కనుగొన్నాయి. ధూమపానం చేయనివారిలో లంగ్ క్యాన్సర్లు దాదాపు 5-10% వంశపారంపర్యంగా లేదా జన్యులోపాల వల్ల వస్తున్నాయని తేలిందట.

దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్‌ సంకేతం కావచ్చు!

ఊపిరితిత్తుల వ్యాధులు : ధూమపానం చేయనివారిలో లంగ్ క్యాన్సర్ అభివృద్ధికి మరో ముఖ్యమైన ప్రమాద కారకం.. ఊపిరితిత్తుల వ్యాధులు. అంటే.. నాన్​ స్మోకర్స్​లో ఇప్పటికే ఏమైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉండే అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

వంట సంబంధిత ఉద్గారాలు : ధూమపానం చేయనివారిలో వంట చేయడానికి కలపను కాల్చడం వల్ల అందులో నుంచి నిరంతరం వెలువడే ఉద్గారాలు లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కిడ్నీ క్యాన్సర్ : ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా అలర్ట్ అవ్వండి - ప్రాణాలకే ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.