Lip Balm And Lip Gloss Which Is Better : చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో చర్మం పొడిబారటం ఒకటి. దీని నుంచి తప్పించుకోవడానికి స్కిన్‌కు మాయిశ్చరైజర్లు, జెల్లీలను ఎక్కువ మంది అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చర్మాన్ని పగలకుండా, పొడిబారకుండా ఉండటంలో కొంత సహాయం చేస్తాయి. అయితే.. శరీరంలో సున్నితంగా ఉండే పెదాలకు కూడా కొంత మంది పెట్రోలియం జెల్లీలను అప్లై చేసుకుంటారు. ఇంకొంత మంది మార్కెట్లో దొరికే లిప్ బామ్‌లు, లిప్ గ్లోస్‌లను వినియోగిస్తుంటారు. మరి వీటన్నింటిలో ఏది మంచిది? పెదాలు గులాబీ రేకుల్లాగా ఉంచడంలో ఏది బెస్ట్ వర్క్ చేస్తుంది? ఏది వాడితే మంచిది? అనే విషయంలో నిపుణులు చేస్తున్న సూచనలు ఇక్కడ తెలుసుకుందాం.
లిప్‌బామ్, లిప్‌గ్లోస్ రెండింటి మధ్య తేడా ఏంటి ?
లిప్‌బామ్..
చాలా మందికి లిప్‌బామ్ - లిప్‌గ్లోస్ మధ్య తేడా తెలియకపోవచ్చు. లిప్‌బామ్ అనేది పెదాలు పొడిబారకుండా, పగలకుండా కాపాడే ఒక రకమైనటువంటి జెల్లీ. దీనిని ఉపయోగించడం వల్ల చలికాలం, ఎండకాలంలో పెదాలు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. బ్రాండెడ్ కంపెనీలు తమ లిప్‌బామ్ ఉత్పత్తులలో షియా బటర్, నేచురల్ ఆయిల్స్, గ్లిజరిన్‌ను యాడ్ చేస్తున్నాయి. ఇవి వాతావరణంలో ఉన్న తేమ నుంచి పెదాలను కాపాడతాయి.
అలాగే.. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‌లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (Sun Protection Factor) 30 కంటే ఎక్కువగా ఉన్న లిప్‌బామ్‌లను వాడాలని సూచిస్తున్నారు. అలాగే చలికాలంలో తక్కువ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండే లిప్‌బామ్‌లను ఎంచుకోవాలి. లిప్‌బామ్‌లు పెదాలకు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లుగా పనిచేస్తాయి.
లిప్‌గ్లోస్..
లిప్‌గ్లోస్‌లలో ఉండే క్రీమ్ వంటి పదార్థాలు పెదాల అందాన్ని రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి లిప్స్‌ను మెరిసేలా చేస్తాయి. అందుకే వీటిని సౌందర్య ఉత్పత్తులలో ఒకటిగా చెబుతారు. ఇవి లిప్‌బామ్‌ల లాగా పెదాలను పొడిబారకుండా చేయలేవు. లిప్‌గ్లోస్‌లను ఉపయోగించడం వల్ల అందంగా కనిపించడం తప్ప, మరే ఇతర ప్రయోజనాలుండవని నిపుణులు చెబుతున్నారు.
లిప్‌బామ్, లిప్‌గ్లోస్ బెస్ట్ ఆప్షన్ ఏది ?
మీరు పెదాలు పొడిబారడం, పగలడం వంటి సమస్యలతో బాధపడుతుంటే.. లిప్‌బామ్‌లను యూజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యవంతమైన పెదాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే మీరు ఇతరుల కంటే అందంగా కనిపించాలనుకుంటే.. లిప్‌గ్లోస్‌ను ఉపయోగించాలని చెబుతున్నారు. లిప్ గ్లోస్ను పెదాలకు అప్లై చేసే ముందు కొద్దిగా లిప్‌బామ్‌ను రాసి.. ఆ తరువాత లిప్‌గ్లోస్‌ను రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అందంగా కనిపించడంతో పాటు, పెదాలు కూడా ఆరోగ్యంగా, మృదువుగా ఉంటాయని అంటున్నారు.
అలర్ట్ : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - గుండెపోటుకు దారితీయొచ్చు!
చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ ఆయిల్స్ ట్రై చేసే మెరుపు గ్యారంటీ!