ETV Bharat / health

మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే మీ బాడీలో ఆ సమస్య ఉన్నట్టే! - High Cholesterol Symptoms

Peripheral Artery Disease Symptoms : బాడీలో అధిక కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ సైలెంట్ కిల్లర్‌ లాంటిది. దాన్ని సరైన టైమ్​లో గుర్తించకపోతే.. గుండె జబ్బులు, వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని లక్షణాలను మొదట్లో గుర్తించడం చాలా కష్టం. కానీ.. ఇటీవల నిర్వహించిన పరిశోధనల ద్వారా కాళ్లలో కనిపించే లక్షణాల ఆధారంగా ఈజీగా గుర్తించవచ్చని తేలింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Cholesterol
Peripheral Artery Disease Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 10:05 AM IST

Leg Pain A Sign Of High Cholesterol : గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇందుకు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంతో.. బాడీలో షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా.. కొలెస్ట్రాల్‌(Cholesterol) పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఛాతీ నొప్పి, మైకం, మాటల్లో అస్పష్టత వంటి హెచ్చరిక సంకేతాలతో ముందే గుర్తించవచ్చు. ఇవేకాకుండా ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనలు కాళ్లలో నొప్పి కూడా హై కొలెస్ట్రాల్‌కు ప్రారంభ సంకేతంగా తేలింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మన బాడీలో కణ త్వచాలను నిర్మించడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడే మైనపు లాంటి పదార్థం కొలెస్ట్రాల్. ఇది చెడు కొలెస్ట్రాల్(LDL), మంచి కొలెస్ట్రాల్(HDL) అనే రెండు రూపాల్లో ఉంటుంది. ఈ రెండూ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్రమాదం. దీని లెవల్స్ పెరిగితే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా తగ్గి హార్ట్ ఎటాక్, ఇతర ప్రాణాంతక సమస్యలు రావొచ్చు.

వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా కాళ్లలో నిర్దిష్ట నొప్పి ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ స్థాయిల ప్రారంభ సూచికగా గుర్తించొచ్చని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. బాడీలోని ఇతర భాగాల్లో మాదిరిగానే కాళ్లలోని ధమనులు హై కొలెస్ట్రాల్ కారణంగా కొవ్వుతో మూసుకుపోతాయి. అప్పుడు అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD)కు దారితీస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసే సమయంలో కాలు నొప్పిగా ఉంటే.. అది PAD సాధారణ లక్షణం కావచ్చు. అలాగే గోర్లు, చర్మ ఆకృతిలో మార్పులు వంటి గుర్తించదగిన శారీరక మార్పులతో దీన్ని గుర్తించవచ్చు. కాళ్లలో నొప్పి, రక్తనాళాలు కుచించుకుపోవడం వంటివి కూడా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్(PAD) ప్రధాన సంకేతాలుగా చెప్పుకోవచ్చు.

కొలెస్ట్రాల్‌ ఎక్కువుందని డాక్టర్‌ చెప్పారా..? అయితే ఇవి పాటించాల్సిందే!

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ రిస్క్ లక్షణాలు :

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తుల్లో PAD డెవలప్‌మెంట్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట. దీని కారణంగా.. తొడలు, లోయర్ బ్యాక్, హిప్ ప్రాంతాల్లో నొప్పి వస్తుంది. ముఖ్యంగా వ్యాయామం, ఎక్కువసేపు నడవడం, తరచుగా మెట్లు ఎక్కడం వంటి యాక్టివిటీస్ చేసే సమయంలో నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా PAD రిస్క్‌ను సూచించే సాధారణ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. కాలు నొప్పి, వాపు, తిమ్మిరి, నయం కాని గాయాలు, కాలు రంగు మారడం, బలహీనత, జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం, చేతి నొప్పి లేదా తిమ్మిరి వంటివి ఉండవచ్చు.

కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం కోసం రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేయించుకోవడం చాలా కీలకమంటున్నారు ఆరోగ్యనిపుణులు. అలాగే సమతుల ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, జీవనశైలి మార్పులతో కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటెయిన్‌ చేయవచ్చు. ఫలితంగా PAD సంబంధిత సమస్యల రిస్క్ గణనీయంగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అదేవిధంగా హై కొలెస్ట్రాల్, PAD లక్షణాల మధ్య సంబంధంపై అవగాహన పెంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

చెడు కొలెస్ట్రాల్​ తగ్గించుకోవాలా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సమస్యకు చెక్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.