ETV Bharat / health

క్రియాటినిన్‌ పెరిగితే కిడ్నీలు ఖతమే - ఇలా నేచురల్​గా తగ్గించుకోండి! - Kidney Health Tips

Kidney Health Tips : కిడ్నీలు చక్కగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే.. ప్రాణాలకే ప్రమాదం! కిడ్నీల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తారు. బ్లడ్​లో 'క్రియాటినిన్‌' పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం ద్వారా.. కిడ్నీల ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. నార్మల్​ రేంజ్​ దాటి ఇది ఎంత పెరిగితే.. ముప్పు అంతగా పెరుగుతుంది. మరి.. నేచురల్​గా దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Kidney Health Tips
Kidney Health Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 2:35 PM IST

Kidney Health Tips : మన శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకంగా పని చేసే అవయవాల్లో మూత్రపిండాలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి మన బాడీలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తుంటాయి. అలసిపోకుండా నిత్యం ఇదే పనిలో ఉంటాయి. అయితే.. ఈ వ్యర్థ పదార్థాలలో "క్రియాటినిన్‌" అనే ఒక రసాయనం కూడా ఉంటుంది. ఇది కండరాలలో "క్రియాటిన్‌" అనే ప్రోటీన్ విచ్ఛిన్నం కావడం వల్ల "క్రియాటినిన్" ఏర్పడుతుంది. ఇది మూత్రం ద్వారా బయకు వెళ్తుంది.

కానీ.. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో క్రియాటినిన్‌ శాతం పెరుగుతూ ఉంటుంది. ఇది ఎంత పెరిగితే కిడ్నీలు అంతగా దెబ్బతిన్నాయని అర్థం. కాబట్టి.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రియాటినిన్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిందే. మరి.. దీన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇది రక్తంలో పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త పరీక్ష ద్వారా..
కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి వైద్యులు రక్తం ద్వారా క్రియాటినిన్‌ పరీక్ష చేస్తారు. సాధారణంగా క్రియాటినిన్‌ 0.5 నుంచి 1.2 మి.గ్రా ఉంటే కిడ్నీల పనితీరు చక్కగా ఉన్నట్టే! ఒకవేళ క్రియాటిన్‌ స్థాయి 1.2 దాటితే మాత్రం కిడ్నీల ఆరోగ్యంపై ఏదో ప్రభావం పడిందని గుర్తించాలి. ఈ పర్సంటేజ్ ఎంత పెరుగుతూ పోతే.. కిడ్నీలు అంతగా డ్యామేజ్ అవుతున్నాయని అర్థం. ఒకవేళ క్రియాటిన్‌ 4 మి.గ్రాలకు దాటితే 80 శాతానికి పైగా కిడ్నీల పనితీరు దెబ్బతిన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలో క్రియాటిన్‌ పెరగడానికి కారణాలు :

  • అధికంగా ప్రొటీన్ తీసుకోవడం
  • పెయిన్‌ కిల్లర్లు విపరీతంగా వాడటం
  • హై బీపీ
  • మధుమేహం
  • కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు
  • ప్రొస్టేట్‌ గ్రంథి వాపు

బాదం ఎక్కువగా తింటున్నారా? - నిపుణులు హెచ్చరిస్తున్నారు!

రక్తంలో క్రియాటిన్‌ స్థాయిలు పెరిగాయి అని అనడానికి బాడీలో కనిపించే కొన్ని లక్షణాలు :

  • మూత్రం రంగు మారడం
  • కండరాల తిమ్మిరి రావడం
  • ఆకలి లేకపోవడం
  • అలసటగా ఉండటం
  • వికారం, వాంతులు
  • కళ్ల చుట్టూ ఉబ్బడం
  • పాదాలు లేదా చీలమండలలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • 2018లో "నేఫ్రాలజీ జర్నల్" ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో కాళ్లు లేదా చీలమండల్లో వాపు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే వీరి రక్తంలో క్రియాటినిన్‌ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

క్రియాటిన్ స్థాయిలను ఎలా తగ్గించుకోవాలి ?

  • ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే మాంసాహారం తినడం వల్ల రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు.
  • దీర్ఘకాలికంగా క్రియాటినిన్‌ స్థాయిలు అధికంగా ఉంటే.. మూత్రపిండాలు డ్యామేజ్‌ అవుతాయి. కాబట్టి.. మాంసం తక్కువగా తినాలి.
  • రోజూ ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలి.
  • అలాగే తృణధాన్యాలను కూడా తినడం మంచిది.
  • ఉప్పును తీసుకోవడం తగ్గించండి.
  • జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి.
  • నీళ్లను ఎక్కువగా తాగండి. రోజూ కనీసం 8 గ్లాసులు తాగాలి.
  • హెర్బల్ టీ తాగండి.
  • మద్యం సేవించడం తగ్గించాలి. పొగ తాగడం పూర్తిగా మానేయాలి.

ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు - మీ కిడ్నీలు పది కాలాల పాటు సేఫ్‌!

అలర్ట్‌ : కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణాలివే! - అస్సలు లైట్‌గా తీసుకోవద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.