Immediate Effects of Smoking One Cigarette: సిగరెట్ వెలిగించి, పొగను తొలిసారి లోపలికి పీల్చడంతోనే దాని పని మొదలు పెడుతుంది. శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పొగలో విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి వాయుమార్గాల లైనింగ్‌ను చికాకుపరుస్తాయి. అవి కుంచించుకుపోయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాయి. దగ్గు వచ్చే అవకాశాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
2017లో "రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఒక్క సిగరెట్ తాగడం కూడా శ్వాస మార్గాలలో శ్లేష్మం పెరిగేలా చేస్తుందని, దగ్గు, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలను కూడా కలిగిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ డేవిడ్ ఓల్సన్ పాల్గొన్నారు.
యువకులు స్మోకింగ్‌కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి?
నోటి ఆరోగ్యంపై : సిగరెట్ పొగలోని రసాయనాలు.. నోరు, గొంతులోని సున్నితమైన కణజాలాలను చిరాకు పరుస్తాయి. ఇవి ోటి దుర్వాసనకు దారితీస్తాయి. చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. దీర్ఘకాలంగా స్మోకింగ్ చేస్తే నోటి క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంపై : గొంతు నుంచి లోపలికి వెళ్లిన పొగలో ఉన్న నికోటిన్ రక్త ప్రవాహంలోకి వేగంగా ప్రవేశిస్తుంది. ఇది జరిగినప్పుడు వెంటనే హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. గుండె స్పందన రేటు పెరగడంతో.. హృదయనాళ వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీంతో రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితి కంటిన్యూగా సాగినప్పుడు బీపీ పెరిగి గుండెపోటు, పక్షవాతం వంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఆక్సిజన్ పై ప్రభావం: సిగరెట్ పొగలోని కార్బన్‌మోనాక్సైడ్.. శరీరంలో ఆక్సిజన్ పర్సంటేజ్‌ను తగ్గిస్తుంది. దీంతో.. ముఖ్యమైన అవయవాలు, కణజాలాలకు సరఫరా చేయడానికి కావాల్సినంత ఆక్సిజన్ ఉండదు. శారీరక శ్రమ చేసినప్పుడు అలసట, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలకు ఈ పరిస్థితి దారితీస్తుందని సూచిస్తున్నారు.
సిగరెట్ తాగడం Vs పొగాకు నమలడం- ఏది ఎక్కువ డేంజర్! నిపుణుల మాటేంటి!
మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం: ధూమపానం ప్రభావాలు భౌతికంగా మాత్రమే కాకుండా మెదడు, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నికోటిన్.. మెదడులో డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను ప్రేరేపిస్తుందని అంటున్నారు.
చర్మం ఆరోగ్యంపై ప్రభావాలు: పొగాకులోని టాక్సిన్స్ చర్మానికి రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఆక్సిజన్ తోపాటు అవసరమైన పోషకాలు కూడా చర్మానికి అందవు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు.. చర్మం పైన ముడతలు, మొటిమలు, సోరియాసిస్ లక్షణాలు కనిపించే ప్రమాదం ఉందని, ఇవన్నీ అకాల వృద్ధాప్యానికి దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నో స్మోకింగ్ డే - ఈ టిప్స్ పాటిస్తే సిగరెట్ అస్సలు ముట్టుకోరు!
ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా?- ఈ టిప్స్ ట్రై చేస్తే అస్సలు తాగరు!