ICMR Obesity Guidelines : ఊబకాయం ప్రపంచంలోని ప్రజల పెద్ద సమస్యగా మారింది. అధిక ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధులు పెరిగేందుకు కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం హెచ్చరించింది. ఊబకాయం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది. ఈ ఊబకాయం వల్ల టైప్ 2 మధుమేహం, కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు, మానసిక రుగ్మతలు వస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయం ఉన్నవారిలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వయసుల వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆహారపు అలవాట్లే
దాదాపు 25 శాతం మంది భారతీయులు అధిక బరువుతో బాధపడుతున్నారని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. భారతీయులకు ఆహారపు అలవాట్లే దీనికి కారణమని స్పష్టం చేసింది. పప్పులు, పాలు, కూరగాయలు, పండ్లు తీసుకున్న వారు పెద్దగా ఊబకాయంతో బాధపడడం లేదని అధ్యయనం వెల్లడించింది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం పెరుగుతుండగా, శారీరక శ్రమ తగ్గుతుందని ఇది కూడా ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది. దీనివల్ల చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నారని వెల్లడించింది. అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు, అల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తగ్గించాలని ఐసీఎంఆర్ సూచించింది.
ఊబకాయం అంటే ఏమిటి?
25 కిలోల వరకు సాధారణంగా పరిగణిస్తారు. కానీ ఆసియన్లకు బీఎంఐ 18.5 నుంచి 22.3 కిలోల మధ్య ఉంటుంది. ఎందుకంటే ఇవీ శరీర కొవ్వు శాతంలో కూడా అధిక శాతం కలిసి ఉంటున్నాయి.
బీఎంఐ అంటే ఏమిటి?
బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఇది మీ బరువు. ఎత్తు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం. మీ బరువు ఆరోగ్యకరమైన శ్రేణిలో లేకుంటే భవిష్యత్తులో అనేక జీవనశైలి సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల, ఎత్తును బట్టి మీ బరువు ఎంత ఉండాలో బీఎంఐ ద్వారా తెలుసుకోవచ్చు.
కారణమేమిటి?
అతిగా తినడం తగ్గిన శారీరక శ్రమ ఊబకాయానికి ప్రధాన కారణం. తీసుకునే ఆహారం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుంది. బాల్యంలో అనారోగ్యకరమైన ఆహార పద్ధతుల వల్ల కూడా ఊబకాయం వస్తుంది. మహిళలకు అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, గర్భం, రుతుస్రావం, జన్యు కారకాల వల్ల కూడా ఊబకాయం వస్తుంది.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
కూరగాయలతో సమతుల్య భోజనాన్ని తీసుకోవాలి. అలాగే శారీరక శ్రమ చేయాలి. తృణధాన్యాలను , చపాతి, మిల్లెట్లు, దంపుడు బియ్యం, బీన్స్, చిక్కుళ్ళు ఎక్కువగా తిన్నాలి. వీటిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్థిరమైన శక్తిని అందిస్తాయి.
డయాబెటిస్ పేషెంట్లు ఏ టైమ్లో వ్యాయామం చేస్తే మంచిది? - Diabetes Patients Exercise Time