ETV Bharat / health

రెస్ట్​లెస్ లెగ్స్ సిండ్రోమ్​ వేధిస్తోందా? - ఈ విటమిన్స్​ ఉండే ఫుడ్​తో ఆ సమస్యకు చెక్ పెట్టండి! - Vitamins Help Restless Leg Syndrome

Restless Legs Syndrome Symptoms : మీరు రెస్ట్​లెస్ లెగ్స్ సిండ్రోమ్​తో బాధపడుతున్నారా? అయితే ఈ సమస్య తలెత్తడానికి ఈ విటమిన్లు లోపించడం కూడా కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, ఏ విటమిన్లు ఆర్​ఎల్​ఎస్ ప్రాబ్లమ్​కు కారణమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

Restless Legs Syndrome Symptoms
Restless Legs Syndrome
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 11:50 AM IST

Best Treatment for Restless Legs Syndrome : ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని కాళ్ల వణుకు సమస్య అయిన రెస్ట్​లెస్ లెగ్స్ సిండ్రోమ్(RLS) అనే నాడీ సంబంధిత వ్యాధి ఇబ్బందిపెడుతోంది. అయితే, ఇది శరీరంలో కొన్ని విటమిన్లు లోపించడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఏ విటమిన్స్ లోపిస్తే ఆర్​ఎల్​ఎస్(Restless Legs Syndrome) సమస్య వస్తోంది? అవి పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆర్​ఎల్ఎస్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

విటమిన్ బి : రెస్ట్​లెస్​ లెగ్స్ సిండ్రోమ్ ముప్పుకు విటమిన్ బి లోపం కూడా ప్రధాన కారణమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12, బి6 నరాలు, రక్త కణాల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటి లోపం ఉంటే బలహీనత, అలసట, చేతులు కాళ్ల తిమ్మిర్లు లేదా జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వీటి లోపం వల్ల కూడా ఆర్​ఎల్ఎస్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి విటమిన్లు B12, B6 అధికంగా ఉండే గుడ్లు, చేపలు, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆర్​ఎల్​ఎస్ లక్షణాలను కొంతమేర తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాదు.. 2017లో విటమిన్ B12 లోపం ఉన్న RLS రోగులు B12 తీసుకుంటే ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఓ అధ్యయనం చేపట్టారు. ఇది 'జర్నల్ ఆఫ్ క్లీనికల్ స్లీప్ మెడిసిన్' అనే పేరుతో ప్రచురితమైంది. దీని ప్రకారం.. 12 వారాల తర్వాత విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకున్న వారిలో RLS లక్షణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో 'షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయం' న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ A.A. Khoshnoodi పాల్గొన్నారు. రెస్ట్​లెస్ లెగ్స్ సిండ్రోమ్ ఉన్నవారు విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకుంటే అవి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ఆ వ్యాధి లక్షణాలను కొంతమేర తగ్గిస్తాయని పేర్కొన్నారు. అయితే అవి పరిమిత డోస్​లో మాత్రమే తీసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదన్నారు.

విటమిన్ డి : ఈ విటమిన్ లోపం డోపమైన్ పనితీరుకు అంతరాయం కలిగించి రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌ను కలిగిస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని పుష్కలంగా తినడం ఎముకలను బలపరుస్తుంది. నరాల, కండరాల పనితీరును నియంత్రిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, విటమిన్ డి అధికంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికీ మంచిది కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం.

విటమిన్ సి, ఇ : దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారికి తీవ్రమైన రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కణాలను దెబ్బతినకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ ఇ ఉండే వెజిటబుల్ ఆయిల్స్, నట్స్, సీడ్స్ వంటివి తింటే ఆర్​ఎల్​ఎస్ సమస్యల ప్రమాదం తగ్గవచ్చంటున్నారు.

మద్యం తాగే ముందు ఇవి తినండి - ఆరోగ్యం సేఫ్​గా ఉంటుందట!

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఆర్​ఎల్​ఎస్ రావడానికి విటమిన్ లోపాలే కారణమా లేదా అని నిర్ధారించడానికి మరికొన్ని రిసెర్చ్​లు అవసరం. అయితే, కొందరికి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ కారణం చేత కూడా కాళ్లు వణకవచ్చు. కానీ, ఈ పరిస్థితి మీ రోజువారీ పనులు, నిద్రకు ఆటంకంగా మారుతున్నట్లు అనిపిస్తే రోగనిర్ధారణ కోసం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఆర్​ఎల్ఎస్ వస్తే కనిపించే లక్షణాలు :

  • కాళ్లను కదిలించాలనే అనియంత్రిత కోరిక
  • విశ్రాంతి లేదా నిద్ర సమయంలో కాళ్లు అసౌకర్యమైన అనుభూతి కలిగిస్తాయి. అంటే.. జలదరింపు, లాగడం, దురద నొప్పి, పురుగులు పాకుతున్నట్లు అనిపిస్తోంది.
  • కాళ్ళు కదిలించడం ద్వారా ఈ లక్షణాల నుంచి ఉపశమనం
  • నిద్ర విధానాలలో మార్పు
  • ఏకాగ్రత సమస్యలు
  • డిప్రెషన్
  • నిద్రలేమి

నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ 5 పనులు చేస్తున్నారా? - మీ మెదడుకు తీవ్ర ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.