ETV Bharat / health

అరటిపండ్లు త్వరగా పాడైపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు స్టోర్​ చేయొచ్చు! - Banana Storage Ideas - BANANA STORAGE IDEAS

How To Store Bananas For Long Time: అరటిపండు అంటే చాలా ఇష్టమా? రోజు ఒకటి తినే అలవాటు ఉందా? ఈ అలవాటు మంచిదే. కానీ కొన్న కాసేపటికే ఇవి పండిపోయి, నల్లగా మారిపోయి తినాలనిపించడం లేదా! అరటిపండును ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియదా? అయితే మీరు ఇవి తెలుసుకోవాల్సిందే!

How To Store Bananas for Extended Shelf Life

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 6:48 PM IST

How To Store Bananas For Long Time: సామాన్యుడు కూడా సందేహం లేకుండా కొనుక్కుని తినే పండు అరటిపండు. అలాగని చీప్​గా మాత్రం తీసిపడేయకండి. ధర తక్కువే అయినా దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. ప్రతి రోజు ఒక అరటిపండు తినడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దీంట్లో లభించే థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-బీ6, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు అవసరం.

ఇన్ని లాభాలు కలిగించే ఈ పండుతో చిక్కేంటంటే, ఇవి కొన్న కాసేపటికే పండిపోతాయి. నల్లగా, మెత్తగా మారి తినడానికి ఆసక్తి కలిగించవు. అయితే వీటిని కొనేముందు ముందు, కొనుగోలు చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ కాలం నిల్వ చేయచ్చు. అదెలాగంటే?

ఉష్ణోగ్రత: అరటిపండు పక్వానికి రావడంలో టెంపరేచర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పూర్తిగా పండకుండా ఉండాలంటే వీటిని తీవ్రమైన చలి లేదా ఎక్కువ వేడికి దూరంగా ఉంచాలి. చల్లటి ప్రదేశంలో ఉంటే అస్సలు పండకుండా ఉంటాయి. వేడి ప్రదేశంలో ఉంచితే ఎక్కువ పండిపోతాయి. కాబట్టి అరటిపండ్లు ఎప్పుడు రూమ్ టెంపరేచర్​లో ఉంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

వెలుతురు: అరటిపండ్లు ఎక్కువ కాలం ఉండాలంటే సూర్యుని వెలుతురు నేరుగా వీటిపై పడకుండా చూసుకోవాలి. సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల పండ్ల మీద గోధుమ రంగు, నల్లటి మచ్చలు ఏర్పడటం సహాత్వరగా పక్వానికి వస్తాయి.

ఇథిలిన్ గ్యాస్: ఈ పండ్ల నుంచి ఇథిలిన్ గ్యాస్ విడుదల అవుతుంది. ఇది వీటిని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. కాబట్టి వీటిని మూసి ఉంచినట్టుగా కాకుండా చక్కగా గాలి తగిలే ప్రదేశంలో అరటిపండ్లను ఉంచిదే ఇథిలిన్ గ్యాస్ నుంచి తప్పించుకుని అరటిపండ్లు ఎక్కువ కాలం పండకుండా ఉంటాయి.

స్పర్శ: తరచూ అరటిపండ్లను చేతితో తాకడం, లేదా ఏదైనా వస్తువులు, ఇతర పండ్లు వాటిని తాకేలా ఉంచడం వల్ల కూడా ఇవి త్వరగా పక్వానికి వస్తాయి. వీటిపై మచ్చలువస్తాయి. కాబట్టి ఎటువంటి తాకిడి లేకుండా వీటిని నిల్వ చేసేలా చూడండి.

ప్యాకింగ్: ప్రస్తుతం దుకాణాలు, మాల్స్​లో పండ్లను పూర్తిగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. వీటిని ఇంటికి తీసుకొచ్చాక వాటిపైన ఉన్నకవర్లు, స్టిక్కర్లను మర్చిపోకుండా తీసేయాలి. అలాగే ఉంచితే గాలి ఆడక ఇథిలిన్ గ్యాస్ అందులోనే ఉండిపోయి త్వరగా నల్లగా మారి, పాడైపోతాయి.

రిఫ్రిజిరేటర్లో ఎలా నిల్వ చేయాలి?
ఫ్రిజ్​లో ఉంచడం వల్ల అరటిపండ్లు 5 నుంచి 7 రోజుల పాటు తాజాగా ఉంటాయి. తొక్క నల్లగా మారినప్పటికీ ఎక్కువ కాలం గట్టిగా ఉంటాయి. అయితే ఇందుకు ముందుగానే మామూలుగా పండిన అరటిపండ్లను గుత్తిగా కాకుండా వేరు వేరుగా విడదీసి ఫ్రిజ్​లో పెట్టాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే వేరే పండ్లేవి వీటి పక్కన ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటిపండ్లు ఎక్కువ కాలం పండకుండా ఉంటాయి.

వేసవిలో చర్మం కమిలిపోతోందా? - ఈ ఫేస్ ప్యాక్​ ట్రై చేశారంటే మెరిసిపోతారంతే!

అలర్ట్ : ఆరోగ్యానికి మంచివని పొట్టలో వేసేస్తున్నారా? - తీవ్ర హాని కలిగిస్తాయ్! - Foods That Are Unhealthy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.