ETV Bharat / health

ఇన్​ఫెక్షన్లు ఇబ్బందిపెడుతున్నాయా? - ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న సూపర్​ ఫుడ్​! - How to Reduce Infection in Body

author img

By ETV Bharat Health Team

Published : Aug 25, 2024, 11:56 AM IST

Updated : Sep 14, 2024, 10:37 AM IST

How to Reduce Infections in Body: మీరు ఇన్​ఫెక్షన్ల​తో బాధపడుతున్నారా? ఇక డాక్టర్లు చుట్టూ తిరిగి ఇంగ్లీష్ మందులు తీసుకోవాల్సిన అవసరం లేదట. కేవలం మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే మంచి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.

How to Reduce Infections
How to Reduce Infections in Body (ETV Bharat)

How to Reduce Infections in Body: ఆధునిక జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్ల‌ కారణంగా ప్రజలు వివిధ ర‌కాల ఇన్​ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఇన్​ఫెక్షన్స్​ అంటే.. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు లేదా పరాన్నజీవులు వంటి రోగకారక మూలకాలు శరీరంలోకి ప్రవేశించి.. అక్కడ పెరిగి, శరీర కణాలకు హాని కలిగించడం. ఇవి చిన్న చిన్న జలుబు నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు కారణమవుతాయి. అయితే ఇన్​ఫెక్షన్ల సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది ఆసుపత్రులకు వెళ్తుంటారు. అయితే ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే ఔషధం తయారు చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం

కావాల్సిన పదార్థాలు

  • అర కప్పు బియ్యం
  • ఒక చెంచా విడంగాల చూర్ణం
  • ఒక చెంచా పిప్పళ్లు చూర్ణం (నేతిలో వెయించినవి)
  • ఒక చెంచా మిరియాల పొడి
  • కొన్ని మునగ ఆకులు
  • రుచికి సరిపడా సౌవర్చ లవణం పొడి
  • మజ్జిగ

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించి కడాయిని పెట్టి నాలుగు కప్పుల నీటిని పోయాలి.
  • నీరు బాగా మరిగాక ఇందులో అరకప్పు బియ్యం, మునగ ఆకులు వేసి ఉడికించుకోవాలి.
  • బియ్యం ఉడికిన తర్వాత అందులోనే విడంగాల చూర్ణం, మిరియాల పొడి, పిప్పళ్ల చూర్ణం వేసుకోవాలి.
  • ఆ తర్వాత బాగా కలిపి సుమారు 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • అనంతరం చివర్లో రుచికి సరిపడా సౌవర్చ లవణం వేసి కలిపి దించేసుకోవాలి.
  • దీనిని మరో గిన్నెలోకి తీసుకుని కాస్త చల్లారక అవసరమైనంత మజ్జిగను పోసుకుని కలపాలి.

ఈ ఔషధాన్ని ఇన్​ఫెక్షన్లతో బాధపడుతున్నవారు.. రోజు ఆహారం లాగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రోజులో కనీసం ఒక్కసారి.. వీలైతే రెండు సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి త్వరగా శక్తిపుంజుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

మునగ ఆకులు: మునగ ఆకులకు ఇన్​ఫెక్షన్​లను తగ్గించే గుణం బాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మలినాలను తొలగించే డీటాక్స్​ టానిక్​ లాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.

విడంగాలు: బ్యాక్టీరియా, వైరస్​ లాంటి ఏ రకమైన ఇన్​ఫెక్షన్లను తగ్గించడానికి విడంగాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. అదే కాకుండా శరీరానికి బలాన్ని ఇచ్చే ఔషధంగానూ పని చేస్తుందని వివరిస్తున్నారు.

పిప్పళ్లు: పిప్పళ్లు.. ఇన్​ఫెక్షన్లు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీర్ణశక్తిని పెంచి ఆకలి ఎక్కువ అయ్యేలా చేస్తుందని తెలిపారు. వీటి వల్ల సహజంగానే శరీరానికి బలం, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని వివరించారు.

మిరియాలు: ఇన్​ఫెక్షన్లు తగ్గడానికి మిరియాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఇదే కాకుండా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఇవి సహాయపడతాయని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బిగ్​ అలర్ట్​: మలబద్ధకాన్ని లైట్​ తీసుకుంటే - గుండె సమస్యలు వస్తాయి! ఇలా చేస్తే సేఫ్​! - constipation cause heart problems

ఈ​ టీ తాగారంటే - నిద్రలేమి నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ పరార్​! - lemon balm tea benefits

Last Updated : Sep 14, 2024, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.