ETV Bharat / health

అల్సర్​తో ఇబ్బంది పడుతున్నారా? ఏం తినాలో? ఏం తినకూడదో తెలుసుకోండి! - Stomach Ulcer Diet - STOMACH ULCER DIET

How To Prevent Stomach Ulcers: అల్సర్‌ సమస్యతో బాధపడేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ ఆహారం తినాలన్నా కష్టమే. అయితే, రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అల్సర్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Stomach Ulcers
How To Prevent Stomach Ulcers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 2:14 PM IST

How To Prevent Stomach Ulcers : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోన్న అనారోగ్య సమస్యలలో అల్సర్‌ ఒకటి. అజీర్తి అనేది తీవ్రరూపం దాల్చినప్పుడు అల్సర్​గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తీవ్రమైన, ఒత్తిడి, ఆందోళనలు, స్మోకింగ్, మద్యం తాగడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అల్సర్ సమస్యను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

అల్సర్‌ లక్షణాలు :

  • జీర్ణశయంలో అల్సర్ ఏర్పడటం వల్ల కడుపులో నొప్పి, మంటగా ఉంటుంది.
  • గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉంటుంది.
  • కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు వస్తాయి.
  • తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.
  • ఈ సమస్య వల్ల కొంతమంది రక్తహీనతతో బాధపడతారు. అలాగే బరువు కూడా తగ్గే అవకాశం ఉంది.
  • వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులంటున్నారు.

ఈ ఆహార పదార్థాలు తీసుకోండి :

క్యారెట్ : రోజూ క్యారెట్‌ తినడం వల్ల అల్సర్‌ ప్రమాదం తగ్గుతుందని.. ఇందులోని విటమిన్‌ ఎ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో 'Nutrients' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం.. ప్రకారం క్రమం తప్పకుండా క్యారెట్‌ తినడం వల్ల అల్సర్‌ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బీజింగ్​లోని చైనా మెడికల్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ అండ్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ 'డాక్టర్ జియాంగ్ లియు' పాల్గొన్నారు. అల్సర్‌ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకండా క్యారెట్‌ తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

చర్మంపై దద్దుర్లు వేధిస్తున్నాయా? - ఈ రెమెడీస్​తో ఆల్ సెట్ ! - Home Remedies for Skin Allergy

గుమ్మడికాయ : అల్సర్‌ సమస్యతో బాధపడేవారికి గుమ్మడికాయ మంచి ఔషధంలా పనిచేస్తుందని.. ఇందులోని పోషకాలు, విటమిన్‌లు పొట్టను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

క్యాప్సికమ్‌ : మన శరీరంలో విటమిన్ సి లోపం వల్ల అల్సర్ ప్రమాదం పెరుగుతుంది. అయితే, విటమిన్‌ సి శాతం అధికంగా ఉండే క్యాప్సికమ్‌ తినడం వల్ల అల్సర్‌ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

తేనె : తేనెలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి హెచ్​ పైలోరి అనే బ్యాక్టీరియా, కడుపు అల్సర్‌కు ఉపశమనం కల్పిస్తుంది.

పెరుగు : అల్సర్‌ వల్ల నొప్పి కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్‌ శ్రీలత (డైటీషియన్‌) చెబుతున్నారు. అలాగే రోజూ యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఈ సమస్య తగ్గించుకోవచ్చు.

అల్సర్​తో బాధపడేవారు తినకూడని పదార్థాలు: అల్సర్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు అంటున్నారు. అందులో ముఖ్యంగా టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదని, కారం, మసాలాలు తగ్గించాలని అంటున్నారు. అలాగే ఈ సమస్య ఉన్నవారు స్మోకింగ్, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెల రోజులపాటు నాన్‌వెజ్‌ తినకపోతే - ఏం జరుగుతుందో తెలుసా ? - Stop Eating Non Veg For A Month

అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా! - Hypothyroidism Affects on Pregnancy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.