ETV Bharat / health

విష జ్వరాలతో ఇబ్బందా? ఈ ఆయుర్వేద కషాయం తాగితే వెంటనే కంట్రోల్​ అవుతుందట! - Fever Treatment in Ayurveda - FEVER TREATMENT IN AYURVEDA

Fever Treatment in Ayurveda : మీరు విష జ్వరంతో బాధపడుతున్నారా? అయితే, ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఆ ఔషధానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Fever Treatment in Ayurveda
Fever Treatment in Ayurveda (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 27, 2024, 4:09 PM IST

Updated : Sep 14, 2024, 8:43 AM IST

Fever Treatment in Ayurveda : వర్షాకాలం వచ్చిదంటే చాలు.. సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడుతుంటారు. ఇలాంటి జ్వరాలను ఇంగ్లీష్ మందుల ద్వారానే కాకుండా ఆయుర్వేద పద్ధతిలోనూ నయం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కేవలం ఇంట్లోని పదార్థాలతోనే ఈజీగా కషాయం చేసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణలు డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 50 గ్రాముల నేలవేము చూర్ణం
  • 50 గ్రాముల వేపచెక్క చూర్ణం
  • 50 గ్రాముల తులసి చూర్ణం (ఆకులు, కాండం)
  • 50 గ్రాముల తిప్పతీగ చూర్ణం
  • 50 గ్రాముల పునర్నవ చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించి ఓ కడాయిని పెట్టి అందులో ఒక గ్లాస్​ నీటిని పోసి మరగనివ్వాలి.
  • నీరు వేడయ్యేలోపు కషాయంలోకి వేసే ఔషధ పదార్థాలను సరైన మోతాదులో కలపాలి.
  • ఆ తర్వాత మరుగుతున్న నీటిలో ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద చెంచాడు వేసుకోవాలి.
  • అనంతరం మీడియం ఫ్లేమ్​లో చూర్ణాన్ని మెల్లగా కలుపుతూ కాసేపు ఉంచాలి.
  • ఆ తర్వాత దీనిని ఓ జాలితో వడబెట్టుకుని పక్కకు పెట్టుకుంటే ఔషధం రెడీ అయిపోతుంది.

ఔషధాన్ని ఎలా తీసుకోవాలి?

  • ఈ ఔషధాన్ని జ్వరాలతో బాధపడుతున్నవారు.. ఎప్పటికప్పుడూ కాచుకుని గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి.
  • 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో రోజులో 3సార్లు తీసుకోవాలని చెప్పారు.
  • జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 30మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉదయం, రాత్రి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
  • ఇంగ్లీష్ మందులు వాడేవారు ఓ గంట సమయం ముందు లేదా తర్వాత మాత్రమే ఈ ఆయుర్వేద కషాయాన్ని తీసుకోవాలని సూచించారు.

నేలవేము: జ్వరాలు తగ్గడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే విషపు జ్వరాలకు నేలవేము మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వేపచెక్క: వేపచెట్టు బెరడు చేదుగా ఉన్నా జ్వరాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు.

తులసి: ఆయుర్వేదంలో తులసి మొక్కను అనేక ఔషధాల తయారీ వాడుతుంటారు. వైరల్​ ఇన్​ఫెక్షన్​, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని వైద్యులు వివరించారు.

తిప్పతీగ: ఈ మధ్య కాలంలో తిప్పతీగ వినియోగం బాగా పెరిగిపోయింది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరల్ ఇన్​ఫెక్షన్, జ్వరాలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.

పునర్నవ: పునర్నవకు ఇన్​ఫెక్షన్​లు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మలినాలను బయటకు పంపించే గుణం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బందిపడుతున్నారా? - ఈ ఆహారాల జోలికి వెళ్లకుంటే ఇట్టే తగ్గిపోతుంది!! - uric acid avoid food list in telugu

హడలెత్తిస్తోన్న డెంగీ - కాయిల్స్,​ రిపెల్లెంట్స్​తో​ పని లేకుండా ఈ టిప్స్​ పాటిస్తే - దోమలు రమ్మన్నారావు! - How to Avoid Mosquitoes from Home

Last Updated : Sep 14, 2024, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.