How to Overcome Fatty Liver With Turmeric: లివర్.. మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. అందుకే.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అయితే.. ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో మార్పులు! అయితే.. ఈ సమస్య నుంచి బయటపడటానికి పసుపు సాయం చేస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం...
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి..? : శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంతో పాటు అనేక పనులు చేస్తుంది కాలేయం. కొవ్వులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌ని జీవక్రియ చేసి, గ్లైకోజెన్, విటమిన్స్, ఖనిజాలను నిల్వ చేస్తుంది. అందుకే, ఎప్పటికప్పుడు లివర్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే లివర్‌కి వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. లివర్‌లో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు.
గుడ్డు పచ్చసొన తింటే నిజంగానే ఆరోగ్యానికి ముప్పు? - రీసెర్చ్‌లో ఆసక్తిర విషయం!
ఫ్యాటీ లివర్ రెండు రకాలు..: వైద్యపరంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే ఈ పరిస్థితి రెండు రకాల కారణాలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి లక్షణాలు అధికమైతే కాలేయం వాపు, హెపటైటిస్, సిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. కావున కాలేయ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడంలో పసుపు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది..
పసుపు: పసుపును హల్దీ లేదా బంగారు మసాలా అని పిలుస్తారు. దీనిని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. 2021లో DMS హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న 64 మంది రోగులకు దాదాపు ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ 2 గ్రాముల పసుపు ఇచ్చారు. దీంతో కాలేయ ఎంజైమ్‌లు గణనీయంగా పడిపోయాయని పరిశోధకులు కనుగొన్నారు.
లివర్ చెడిపోతోందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ హెల్తీగా..
ఫ్యాటీ లివర్ సమస్యకు పసుపు టిప్స్:
పసుపు, గోరువెచ్చని నీరు: మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని దానికి ఒక టీస్పూన్ పసుపు కలపుకు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని రోజుల్లో ఎప్పుడైనా తాగొచ్చని.. కానీ ఉదయం తాగడం వల్ల మరిన్ని ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు.
పసుపు, తేనె: తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ను నిరోధించి.. ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. తేనెతో పసుపు కలపడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడటంలో ఉపయోగపడుతుందని తెలిపారు.
పసుపు, నారింజ తొక్క: ఆరెంజ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పలు వ్యాధులను నయం చేసే ఉత్తమ పండ్లలో ఇది ఒకటి. ఇందులో గ్లైకోసైడ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కర్కుమిన్‌తో కలిపినప్పుడు కాలేయంలో అదనపు కొవ్వును తగ్గిస్తుంది.