How To Know We Take Sufficient Water : మనం బతకడానికి ఆహారం తినడం ఎంత ముఖ్యమో నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. ఆహారం తినకుండా కొన్ని రోజులు బతకగలం.. కానీ, నీరు తీసుకోకుండా ఉండలేం. అలా వాటర్ అనేది మనుషులకే కాదు.. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకు అవసరమే. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రోజుకు సరిపోయే వాటర్‌ను తాగడం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అసలు ఒక వ్యక్తి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి ? మన బాడీకి సరిపోయేంతగా మనం వాటర్ తీసుకుంటున్నామా..? లేదా ? అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి: ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలంటే రోజుకు ఒక వ్యక్తి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యక్తిని బట్టి కూడా మారుతుందని అంటున్నారు. ఒక వ్యక్తి ఎక్కువగా శారీరక శ్రమ చేస్తూ ఉంటే.. అలాంటి వారు ఇంకా ఎక్కువగా నీటిని తాగాలని చెబుతున్నారు. అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారు కూడా నీటిని ఎక్కువగా తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాలు బలహీనమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
నీరు తాగడం వల్ల కలిగే లాభాలు :
ఉష్ణోగ్రత నియంత్రణలో : మన శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం చురుగ్గా ఉండటంలో నీరు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులంటున్నారు.
క్యాలరీలు అదుపులో : చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌ను తాగడం కంటే నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఇంకా దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
కండరాల శక్తివంతంగా : రోజూ శరీరానికి అవసరమైన నీటిని తాగడం వల్ల బాడీలో కండరాలు శక్తివంతంగా తయారవుతాయి.దీనివల్ల పని మీద ఏకాగ్రత ఉంటుంది.
చర్మం మెరిసిపోతుంది : సరిపోయేంత వాటర్ తీసుకోవడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో టాక్సిక్ కెమికల్స్ చెమట ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇంకా నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
మీరు తగినంత నీరు తాగుతున్నారా ? లేదా ? ఇలా తెలుసుకోండి..
తలనొప్పిగా ఉంటే : మీకు తలనొప్పిగా ఉంటే మీరు నీరు తక్కువగా తాగుతున్నారని శరీరం మీకు ఇచ్చే ఒక ఇండికేషన్ అని నిపుణులంటున్నారు. నీరు తక్కువగా తీసుకుంటే మెదడులోని సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌పై ప్రభావం పడుతుంది. దీంతో తలనొప్పిగా ఉంటుంది.
చర్మం, పెదవులు పొడిబారినట్లు ఉంటే : మీ చర్మం, పెదువులు పొడిబారినట్లుగా ఉంటే మీరు సరిపోయేంత నీటిని తాగడం లేదని తెలుసుకోండి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానిక కచ్చితంగా నీటిని తాగాలని నిపుణులంటున్నారు. అలాగే కళ్లు కూడా తిరుగుతాయట.
మూత్రం రంగు మారడం : మూత్రం ముదురు పసుపు రంగులో వస్తున్నా కూడా మీరు సరిపడ నీళ్లు తాగడం లేదనే అర్థం.. కాబట్టి బాడీకి సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
మూత్రవిసర్జన సాఫీగా : మూత్రవిసర్జన సాఫీగా సాగితే మీరు సరిపోయేంత నీటిని తాగుతున్నారని అర్థం. దీనివల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయని అంటున్నారు.
మీ కోసం వ్యాయామమే దిగి వచ్చింది - జస్ట్ 22 నిమిషాలు చేసినా చాలట!
పాలు తాగకపోతే కాల్షియం ప్రాబ్లమ్ - ఇలా భర్తీ చేసుకోండి!
ఆ డ్రింక్స్ తాగితే - పురుషులకన్నా మహిళలకే డేంజర్ ఎక్కువ - క్యాన్సర్ ముప్పు!