How To Identify Injected Watermelon : సమ్మర్‌లో ఎండవేడి, ఉక్కపోత, వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. దీంతో బయటకు వెళ్లినవారు తప్పకుండా వాటర్ మెలన్ తింటుంటారు. ఎండాకాలంలో పుచ్చకాయను తినడం వల్ల బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే.. మార్కెట్లో కొందరు వ్యాపారులు అత్యాశతో వాటర్ పుచ్చకాయలు త్వరగా పండటానికి, ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్లను వేస్తుంటారట. ఇలా ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. పుచ్చకాయను కొనేటప్పుడే స్వచ్ఛమైన వాటిని గుర్తించాలని సూచిస్తున్నారు. మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇలా గుర్తించండి :
- పుచ్చకాయ పైన అక్కడక్కడా పసుపు మచ్చలతో కొద్దిగా తెల్లగా ఉంటే దాన్ని కచ్చితంగా ఇంజెక్షన్ చేసి ఉంటారని గుర్తించాలట.
- అలాగే వాటర్‌మెలన్ తొందరగా పండటానికి కార్బైడ్ అనే కెమికల్‌ను చల్లుతారట. వాటర్‌మెలన్ పైన పసుపు రంగులో ఉన్నట్టుంటే.. దాన్ని ఉప్పు నీటితో బాగా కడిగి తినాలని సూచిస్తున్నారు.
- మీరు కొన్న పుచ్చకాయ సాధారణం కంటే ఎక్కువ రెడ్ కలర్‌లో ఉంటే కూడా దానిని ఇంజెక్షన్ చేసినట్లు గుర్తించండి.
- అలాగే ఈ ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల నాలుక బాగా ఎర్రగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ తింటే పురుషుడి సెక్స్ సామర్థ్యం పెరుగుతుందట- అసలేం సంబంధం? - Watermelon For Men Benefits
- మీరు వాటర్‌మెలన్‌ను కొనేటప్పుడు ఆ కాయను బాగా పరిశీలించండి. దానిపై ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వాటిని అస్సలు కొనుగోలు చేయకండి. రంధ్రాలు ఉన్న పుచ్చకాయలకు ఇంజెక్షన్ చేసి ఉండవచ్చు!
- ఇంజెక్షన్ చేసిన వాటర్‌మెలన్‌ను కోసినప్పుడు ఆ కాయలో పగుళ్లు ఎక్కువగా ఉంటాయట.
పుచ్చకాయతో ప్రయోజనాలు :
- వాటర్‌మెలన్‌లో ఉండే గుజ్జు ఎర్రగా ఉండటానికి కారణం బీటా కెరొటిన్. ఇది చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే కంటిచూపును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- వాటర్‌మెలన్ గుజ్జు, తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుందట.
- అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు వాటర్‌మెలన్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని నిపుణులంటున్నారు.
- పుచ్చకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, సమ్మర్‌లో వీటిని రోజూ తినడం వల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.