How To Control Rheumatoid Arthritis : అర్థరైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. మోకాళ్లు, వెన్నెముక, చేతివేళ్లు మొదలైన కండరాలు, వాటి జాయింట్స్‌పై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు. ఇది ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించేది. కానీ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల 30 వయసులో కూడా ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు. అయితే, రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి నుంచి సహజ సిద్ధంగా ఉపశమనం ఎలా పొందాలో నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి బారిన ఒక్కసారి పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి పూర్తి చికిత్స ఇప్పటివరకూ అందుబాటులో లేదని అంటున్నారు. అయితే, ఈ కండరాల నొప్పులను తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ మీ కోసం..
తగినంత నిద్ర అవసరం..
ఈ కీళ్లవాతం వ్యాధితో బాధపడేవారు తగినంత నిద్రపోవడం వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు నిద్రకు సమయం కేటాయించడం వల్ల కొంత వరకు ఉపశమనం పొందినట్లు వెల్లడించారు.
లెమన్‌గ్రాస్ నూనెతో..
రుమటాయిడ్ అర్ధరైటిస్ వ్యాధి వల్ల వచ్చే కండరాలు, జాయింట్ నొప్పులను తగ్గించడంలో లెమన్‌గ్రాస్ ఆయిల్ ప్రభావవంతంగా పనిచేసిందని జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది.
మరి కొన్ని..
- కీళ్లవాతం ఉన్నవారు కండరాలు బలంగా ఉండటానికి వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను చేయడం మంచిది.
- ముఖ్యంగా వాటర్‌లో చేసే వాటర్ ఎయిరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు కండరాలకు బలాన్ని చేకూర్చడంతో పాటు, ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి.
- యోగా, ధ్యానం వంటి అలవాట్లతో కీళ్లవాతం సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
- కండరాలు, జాయింట్ పెయిన్లు ఎక్కువగా ఉంటే ఐస్ ప్యాక్‌ను ట్రై చేయొచ్చు.
- అలాగే నొప్పులు తగ్గించుకోవడానికి యూకలిప్టస్ అయిల్‌తో కండరాలపై మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- కీళ్లవాతం ఉన్నవారు రోజువారీ ఆహారంలో పసుపు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
- ఇందులో ఉండే కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం పెయిన్స్ తగ్గిస్తుంది.
- అలాగే అల్లం తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉందని అంటున్నారు.
- రుమటాయిడ్ అర్ధరైటిస్‌తో సతమతమయ్యేవారు రోజువారీ ఆహారంలో బెర్రీలు, సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజ, ద్రాక్షపండ్లు తినడం వల్ల వాపును తగ్గించుకోవచ్చని నిపుణుల చెబుతున్నారు.
- అలాగే ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగును తినడం వల్ల ప్రయోజనం పొందొచ్చని అంటున్నారు.
పార్కిన్సన్ - జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు!
ఈ వ్యాధి వస్తే ఎముకలు వట్టిగానే విరిగిపోతాయి - జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!