ETV Bharat / health

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే థైరాయిడ్​ కావొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 1:54 PM IST

Thyroid Symptoms in Children: ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ కూడా ఉంటుంది. అయితే.. ఇది కేవలం పెద్దలకు మాత్రమే వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ.. పిల్లల్లో సైతం కనిపిస్తుంది. మరి పిల్లల్లో థైరాయిడ్​ ఉన్నట్టు ఎలా గుర్తించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Thyroid Symptoms in Children
Thyroid Symptoms in Children

How to Check Thyroid Symptoms in Children: థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. సీతాకోక చిలుక ఆకారంలో ఇది ఉంటుంది. శిశువుల్లో బ్రెయిన్​ డెవలప్​మెంట్​, గ్రోత్​కు సహాయపడే హార్మోన్లను రిలీజ్​ చేస్తుంది. ఇక పెద్దలలో అయితే మెటబాలిజమ్​ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే.. థైరాయిడ్​ అనగానే అది పెద్దలకు వచ్చే సమస్య అనుకుంటారు. కానీ ఇది పిల్లల్లో కూడా వస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపో థైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. మరి పిల్లల్లో ఈ లక్షణాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

హైపో థైరాయిడిజం: తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే.. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది జన్యుపరంగా కుటుంబంలో వస్తుంది. పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం అనేది నవజాత శిశువుల్లో గుర్తించే అత్యంత సాధారణ సమస్య. మహిళ కన్సీవ్​ అయినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే.. అది బిడ్డకి కూడా సంక్రమిస్తుంది. అయితే ఏ వయస్సులో ఇది బయటపడుతుందనే చెప్పడం కొంచెం కష్టం.

లక్షణాలు: పిల్లల్లో హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. నీరసంగా ఉండడం, శక్తి తగ్గిపోవడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, చలిగా అనిపించడం, కండరాల నొప్పులు కనిపిస్తాయి.

థైరాయిడ్​తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్​తో అదుపులోకి రావడం పక్కా!

హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథులు అతిగా పని చేసి అవసరమైన దాని కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. అయితే ఇది పిల్లల్లో అరుదుగా కనిపిస్తుంది. అంటే సుమారు 10,000 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

లక్షణాలు: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్, పీడియాట్రిక్ ఎండోక్రైన్ సొసైటీ ప్రకారం.. ఏకాగ్రతలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, వేడిగా అనిపించడం, విపరీతమైన ఆకలి, బరువు తగ్గడం, తట్టుకోలేనంత చలి, నిద్ర సమస్యలు, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా(అతిసారం) వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే వారు హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులు గుర్తించాలి. కాబట్టి.. ఈ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే.. వెంటనే పీడియాట్రిషన్​ దగ్గరకి తీసుకువెళ్లడం మంచిది.

పిల్లల్లో థైరాయిడ్ స్థాయిలను చెక్​ చేయడానికి(TSH (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), T4 (థైరోక్సిన్)) టెస్ట్​లు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, థైరాయిడ్ గ్రంథి నిర్మాణాన్ని అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ లేదా ఇతర ఇమేజింగ్ టెస్ట్​లు కూడా నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో బిడ్డకి థైరాయిడ్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే వెంటనే చికిత్స కోసం.. ఎండోక్రినాలజిస్ట్​ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే సమస్య పెరిగి బిడ్డ శరీరంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. "Thyroid Function in Children" అధ్యయనంలో.. పిల్లల అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి, శారీరక అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను నిపుణులు పరిశీలించారు.

Halasana yoga pose: గ్రంథుల ఆరోగ్యానికి హలాసనం

పిల్లల్లో థైరాయిడ్​-గుర్తించకపోతే పెను శాపం

థైరాయిడ్​ పేషెంట్లు జాగ్రత్త.. మీరు కొంటున్నది అసలైన మందు కాకపోవచ్చు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.