How Many Almonds Should You Eat A Day : పోషకాహారంలో డ్రై ఫ్రూట్స్ ముందు వరసలో ఉంటాయి. వీటిని తినడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అతిగా తింటే మాత్రం ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిపుణులు సూచించిన ప్రకారం బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. మరి.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రోజూ ఎన్ని బాదం పప్పులు తింటే మంచిదో నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకోండి.
రోజూ ఎన్ని బాదం పప్పులు తినాలి?
- ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు రోజూ 20 వరకు బాదం పప్పులను తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందే తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
- చిన్న పిల్లలకు (1-3 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ) రోజుకు 3-4 బాదంపప్పులు తినిపించవచ్చని సూచిస్తున్నారు.
- అలాగే 4-8 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు రోజుకు 5-8 బాదం బాదంపప్పులు తినిపించవచ్చని చెబుతున్నారు.
- 9 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు రోజుకు 10 బాదంపప్పుల వరకూ తింటే ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు.
బాదం పప్పులను ఎక్కువగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు : రోజూ ఎక్కువ మొత్తంలో బాదం పప్పులను తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు పెరుగుతారు : సుమారు 100 గ్రాముల బాదం పప్పులో 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే ఇందులో అధికంగా మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి, ఎక్కువగా బాదం తినడం వల్ల బరువు పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
మలబద్ధకం : వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అయితే.. బాదం పప్పులను ఎక్కువగా తిన్న తర్వాత కావాల్సినంత నీరు తాగకపోతే మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు కలుగుతాయని నిపుణులంటున్నారు. కాబట్టి.. బాదం తిన్న తర్వాత ఎక్కువగా నీళ్లు తాగాలని గుర్తుంచుకోండి.
కిడ్నీల్లో రాళ్లు : అన్ని రకాల గింజలు, విత్తనాల్లాగానే బాదంపప్పుల్లో కూడా ఆక్సాలేట్స్ అనే సహజ సిద్ధమైన రసాయనాలున్నాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల.. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా బాదం పప్పు తీసుకున్న వారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని 2015లో "యూరాలజీ జర్నల్" ప్రచురించింది.
అలాగే.. ఆక్సలేట్ రసాయనాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు తీసుకున్న వారిలో కూడా.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉందని 2014లో 'అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్' వెల్లడించింది. కాబట్టి.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఈ సమాచారం మీ అవగాహన కోసమే. సందేహాలుంటే వైద్యుడిని సంప్రదించండి.
Benefits of Almonds in Telugu : ఈ డ్రైఫ్రూట్ తింటే బరువు తగ్గుతారు.. ఎలా తిన్న ఏం కాదు..