ETV Bharat / health

మద్యంతో లివర్ డ్యామేజ్ ఇలా జరుగుతుందయ్యా - మందు బాబులూ ఓ లుక్కేసుకోండి!

How Liver Damage With Alcohol : మద్యం ఏదో విధంగా అలవాటవుతుంది.. తొలినాళ్లలో అకేషనల్​గానే తాగుతారు. ఆ తర్వాత తాగడానికి అకేషన్స్ వెతుక్కుంటారు! అవకాశాలను తమకు తామే సృష్టించుకుంటారు! ఇంతలా మనిషిని బానిసను చేసుకుంటుంది మద్యం! మరి.. దీనివల్ల కాలేయం ఎలా దెబ్బతింటుందో మీకు తెలుసా??

How Liver Damage With Alcohol
How Liver Damage With Alcohol
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 3:09 PM IST

How Liver Damage With Alcohol : ఆరోగ్యంపై మద్యం ఎంతగా దష్ప్రభావం చూపుతుందో? ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో తెలిసిందే. అయినప్పటికీ.. చాలా మంది మద్యపానాన్ని మానుకోలేరు. అదొక వ్యసనంగా మారిపోతుంది. చివరకు ఊబిలా మారిపోతుంది. అందులో నుంచి బాధితులు బయటపడలేరు. మద్యం వల్ల ముందుగా దెబ్బతినే అవయవం లివర్. మరి.. ఇది దశల వారీగా ఎలా నాశనం అవుతుంది? దాని ఫలితం మనిషిపై ఎలా పడుతుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

ఫ్యాటీ లివర్..

ఆల్కహాల్ తీసుకునే చాలా మందిలో నియంత్రణ ఉండదు. ఎంత తీసుకుంటారనేది క్లారిటీ ఉండదు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల దాన్ని ప్రాసెస్ చేయడానికి కాలేయం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది మరింతగా తాగినప్పుడు.. అది కాలేయం కణాల లోపల కొవ్వుగా మారుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) 2017లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలంగా రోజూ అతిగా మద్యం తాగుతున్న వారిలో ఫ్యాటీ లివర్ త్వరగా ఏర్పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తీసుకునే వారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. తొలినాళ్లలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. పరిస్థితి తీవ్రమవుతున్నప్పుడు కడుపులో అసౌకర్యం, బరువు తగ్గడం, అలసట వంటివి బాధిస్తుంటాయి. దశలు దాటుతున్నకొద్దీ ఈ బాధలు పెరుగుతుంటాయి.

లివర్ ఫైబ్రోసిస్..

ఫ్యాటీ లివర్ కండిషన్ తర్వాత కూడా అదే స్థాయిలో మద్యం తాగుతూ వెళ్తే.. కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. దీన్నే లివర్ ఫైబ్రోసిస్ అంటారు. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ప్రకారం.. ఫైబ్రోసిస్ కు చికిత్స చేయకపోతే.. అది సిర్రోసిస్ దశలోకి, ఆ తర్వాత కాలేయ క్యాన్సర్‌కూ దారి తీస్తుంది.

లివర్ పునర్నిర్మాణం..

నిజానికి లివర్ తనని తానే పునర్నించుకునే కెపాసిటీ ఉన్న అవయవం. దెబ్బతిన్నా.. తగినంత సమయం ఇస్తే తిరిగి కోలుకోగలదు. కానీ.. ఆ సమయం కూడా దానికి ఇవ్వకుండా నిరంతరం మద్యం పోసేస్తుంటే.. దాన్ని ప్రాసెస్ చేయలేక అలసిపోతుంది. అయినా.. లిక్కర్ తీసుకోవడం కొనసాగిస్తే.. కాలేయం నిరంతర వాచి ఉండడం.. దెబ్బతినడం జరుగుతుంది. ఇక.. దానికదే రిపేర్ చేసుకోలేని కండీషన్లోకి వెళ్లినప్పుడు.. ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది. లివర్ పై ఏర్పడే ఈ మచ్చలు.. బ్లడ్ సర్క్యులేషన్​పై ఎఫెక్ట్ చూపిస్తాయి.

పోర్టల్ బ్లడ్ ప్రెషర్..

పోర్టల్ సిరల వ్యవస్థ అనేది కాలేయానికి ప్రధానమైనది. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. కాలేయంపై ఏర్పడే మచ్చలు పోర్టల్ హైపర్‌టెన్షన్‌కు దారితీస్తాయి. ఇటు రక్త ప్రవాహాన్ని స్లో చేయడంతోపాటు.. అటు పోర్టల్ సిరపైనా అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి అధికమైనప్పుడు.. రక్తనాళం పగిలి ప్రాణాంతకం కావచ్చు.

కాలేయంలో చీము..

లివర్ పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు.. కాలేయంలో చీము ఏర్పడుతుంది. రక్తం, చనిపోయిన కణాలు, ఇతర సూక్ష్మక్రిములు కలిసి ఈ చీము గడ్డలు తయారవుతాయి. కాలేయంలో ఈ తరహా గడ్డలు ఏర్పడటానికి మద్యపానం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనం పేర్కొంది.

లివర్ సిర్రోసిస్..

కాలేయం మరింత తీవ్రంగా దెబ్బతిన్న స్థితి ఇది. కాలేయంపైన ఏర్పడిన మచ్చలు శాశ్వతంగా మిగిలిపోయే కండిషన్ ఇది. అంటే.. రక్త ప్రసరణ సరిగా జరగదు. కాలేయం సరిగా పనిచేయకుండా పోతుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధిలో దీన్ని చివరి దశగా పేర్కొంటారు. సిర్రోసిస్ దశంలో.. మనిషి నిత్యం అలసటతో ఉంటారు. బాడీలో శక్తి ఉండదు. కంటిన్యూస్​గా వికారం లేదా కడుపులో నొప్పి వంటివి ఉంటాయి. బరువు తగ్గడం మొదలవుతుంది.

కాలేయ క్యాన్సర్..

సిరోస్ పరిస్థితి మరింతగా విషమించినప్పుడు లివర్ క్యాన్సర్​ గా మారుతుంది. మనిషి పూర్తిగా బలహీనమైపోతాడు. మితిమీరిన ఆల్కహాల్ కారణంగా కాలేయం మొత్తం.. ప్రాసెస్ చేయలేని, తొలగించలేని విష పదార్థాలతో ఓవర్‌లోడ్ అయిపోయి ఉంటుంది. ఈ దశలో కాలేయం పూర్తిగా గడ్డకట్టినట్టుగా తయారై పనికిరాకుండా పోతుంది. ఫలితంగా.. మనిషి మరణానికి చేరువైపోతాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.